రోజూ 100 కి.మీలు తిరిగే వారికి 3 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది!
యుద్ధం కారణంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.గతంలో కంటే ఈ సారి ఈవీల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఈవీ స్కూటర్ల ఆప్షన్లు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. అప్పట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అంటేనే మొహం చాటేసిన వారు ఇప్పుు అవే కావాలని అంటున్నారు. దీంతో ఇప్పుడు దాదాపు ప్రతి ప్రముఖ కంపెనీ తక్కువ ధరల్లో కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, అధునాతన ఫీచర్లతో భారత మార్కెట్లో ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ స్కూటర్ కోసం చూస్తున్న వారికి పలు మోడళ్లు ఈ కింది కథనంలో చూద్దాం.
TVS iQube: స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.11 లక్షల నుంచి రూ.1.85 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 2.2 kWh, 3.5 kWh, 5.3 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 94 కిలోమీటర్ల నుంచి 212 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు ఇది మంచి ఆప్షన్.

దీనిలో అందించిన ఫీచర్స్ గురించి చూసినట్లయితే, రిమోట్ లాక్/అన్‌లాక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,LED హెడ్‌లైట్, TVS కనెక్ట్ యాప్ ఇంటిగ్రేషన్ ఉండటం వల్ల రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, TFT డిస్‌ప్లే, రైడింగ్‌లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడానికి USB ఛార్జింగ్ పోర్ట్, ప్రయాణం చేస్తున్నప్పుడు స్కిడ్ కాకుండా ఉండటానికి డిస్క్ బ్రేకులు, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి మొదలగు ఫీచర్స్ ఈ స్కూటర్‌లో ఉన్నాయి.
Hero Vida VX2: దేశీయ ప్రముఖ మోటార్‌సైకిల్ కంపెనీ హీరోకు చెందిన విడా బ్రాండ్ కింది అమ్మకానికి ఉన్నటువంటి మోడల్ విడా VX2. ఇది స్టైలిష్ డిజైన్‌తో ఇండియాలో చాలా మంది యూత్‌ను ఆకట్టుకున్న మోడల్. దీని ధర వచ్చేసి సుమారు రూ. 99,490గా ఉంటుంది. అయితే BaaS స్కీమ్‌ను ఎంచుకుంటే దీని ప్రారంభ ధర చాలా వరకు తగ్గి కేవలం రూ.44,990 వరకు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

BaaS స్కీమ్‌ను ఎంచుకుంటే ప్రతి కిలోమీటరుకు సుమారు 90 పైసల నుండి రూ.1.24 వరకు చార్జ్ విధించబడుతుంది. దీనిలో బ్యాటరీని విడిగా పొందాల్సి ఉంటుందనే విషయం గమనించాలి. VX2 పలు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి 2.2 kWh, 3.4 kWh, 4.4 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. రేంజ్ గురించి చూసినట్లయితే, వేరియంట్‌ను బట్టి, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 92 నుంచి 187 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
Bajaj Chetak: రోజువారీ ప్రయాణాలతో పాటు కుటుంబ వాడకానికి కూడా ఇది మంచి ఆప్షన్. బజాజ్ చేతక్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.10 లక్షల నుంచి రూ.1.46 లక్షల వరకు ఉంటుంది. దీంతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది అవసరాలకు అనుగుణంగా 2.9 kWh, 3.2 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

రేంజ్ పరంగా IDC ప్రమాణాల ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 127 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. దీంతో షాపింగ్, వ్యక్తిగత పనులు వంటి అవసరాలను సులభంగా పూర్తి చేయవచ్చు. దీనిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, రీజనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ వంటి ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను ఇది ఆకట్టుకుంటుంది.


Click it and Unblock the Notifications