రూ.116 పెట్రోల్‌తో 90Km వరకు మైలేజ్! ప్రతి రూపాయికి విలువ ఇస్తుంది.. కస్టమర్లకు ఇప్పటికీ హాట్ ఫేవరెట్!
భారతీయ టూవీలర్ మార్కెట్లో మైలేజ్‌కు ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం బజాజ్ ప్లాటినా (bajaj platina) చాలా కాలంగా విశ్వసనీయమైన ఎంపికగా కొనసాగుతోంది. తక్కువ నిర్వహణ ఖర్చులు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, అద్భుతమైన ఇంధన సామర్థ్యం కారణంగా ఈ బైక్ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విస్తృత ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా రోజువారీ ఉద్యోగ ప్రయాణాలు, వ్యాపార అవసరాల కోసం ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ప్లాటినా ఒక ఆచరణాత్మక ఎంపికగా నిలిచింది. తాజాగా విడుదలైన 2026 మే నెల విక్రయ గణాంకాలు కూడా ఈ బైక్‌కు మార్కెట్లో ఇప్పటికీ మంచి డిమాండ్ ఉందని సూచిస్తున్నాయి.
ఆ నెలలో బజాజ్ ప్లాటినా మొత్తం 26,467 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ సంఖ్య 27,919 యూనిట్లు ఉండగా, ఈసారి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఏడాది ప్రాతిపదికన పోల్చితే ప్లాటినా విక్రయాలు కేవలం 5 శాతం మాత్రమే తగ్గడం గమనార్హం. మార్కెట్లో కొత్త మోడళ్ల రాక, పెరుగుతున్న పోటీ మధ్య ప్లాటినా ఇలాంటి స్థిరమైన అమ్మకాలను నమోదు చేయడం దాని ప్రజాదరణకు నిదర్శనం.

ముఖ్యంగా మైలేజ్‌కు ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల్లో ఈ బైక్ ఇప్పటికీ బలమైన స్థానం కొనసాగిస్తోంది. అందుకే అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, బజాజ్ ప్లాటినా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. రాబోయేది ఇండియాలో మొత్తం పండగల సీజన్ కాబట్టి ఆ సమయంలో ఈ బైక్ అమ్మకాలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్, పలు తగ్గింపుల కారణంగా సేల్స్ పెరగొచ్చు.
ప్రస్తుతం ఈ బైక్ ప్లాటినా 100, ప్లాటినా 110 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్లాటినా 100 అత్యంత సరసమైన ధరలో లభించే మోడల్. సుమారు రూ.66,015 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉండే ఈ బైక్, రోజువారీ ప్రయాణాల కోసం ఖర్చు తక్కువగా ఉండే వారికి మంచి ఎంపికగా నిలుస్తోంది. డిజైన్ పరంగా కూడా ఇది సాధారణ కమ్యూటర్ బైక్‌ల కంటే కాస్త ఆధునికంగా కనిపిస్తుంది.

స్టైలిష్ హెడ్‌ల్యాంప్, LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), ఆకర్షణీయమైన టెయిల్ ల్యాంప్ డిజైన్ బైక్‌కు మెరుగైన రూపాన్ని అందిస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్లాటినా 100లో 102 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి నగర ప్రయాణాల్లో స్మూత్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మైలేజ్ పరంగా ఈ బైక్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది.
వాడుక పరిస్థితులను బట్టి లీటరుకు 75 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఇక ప్లాటినా 110 మరింత శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు కొన్ని అదనపు ఫీచర్లను అందిస్తుంది. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.71,558. డిజైన్ పరంగా ప్లాటినా 100తో పోలిస్తే మరింత ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్, LED DRLs, స్టైలిష్ LED టెయిల్ ల్యాంప్స్ ఫీచర్లు బైక్‌కు ఆధునిక రూపాన్ని అందిస్తాయి.

ఈ బైక్‌లో 115.45 సీసీ ఇంజిన్ అందించబడింది. ఇది కూడా 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి రోజువారీ ప్రయాణాలకు సరిపడే పనితీరును అందిస్తుంది. అదనపు పవర్ అవసరమయ్యే వినియోగదారులకు ప్లాటినా 110 మరింత అనువుగా ఉంటుంది. మైలేజ్ విషయంలో కూడా ఈ మోడల్ నిరాశపరచదు. లీటరుకు సుమారు 70 కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తూ పనితీరు మరియు మైలేజ్ మధ్య మంచి సమతుల్యతను కల్పిస్తుంది.


Click it and Unblock the Notifications