కుర్రాళ్ల డ్రీమ్ బైక్స్ ఇప్పుడు బడ్జెట్‌లోనే.. ఈ 5 మోడల్స్ చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది

భారతదేశంలో ఒకప్పుడు బైక్ ఒకప్పుడు బైక్ అంటే కేవలం ఆఫీసుకో, కాలేజీకో వెళ్లడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటితరం యువత బైకులో పవర్, స్టైల్, హ్యాండ్లింగ్.. ఇలా అన్నింటినీ వెతుకుతోంది. అందుకే కంపెనీలు కూడా కేవలం లక్షల్లో ఖర్చు పెడితేనే దొరికే పర్ఫార్మెన్స్ బైక్స్‎ను ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులోకి, అంటే రూ.2 లక్షల లోపు బడ్జెట్‌లోనే తీసుకొస్తున్నాయి. మీరు కూడా కొత్తగా ఒక అదిరిపోయే బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే 2026 మే నెలలో మార్కెట్ను ఊపేస్తున్న టాప్-5 బైక్స్ వివరాలు తెలుసుకుందాం.

Best Budget Performance Bikes Under Rs 2 Lakh You Can Buy Now

1. బజాజ్ పల్సర్ NS400Z:
బజాజ్ కంపెనీ తన పల్సర్ సిరీస్‌లో అత్యంత పవర్ఫుల్ మోడల్ NS400Zను సరికొత్తగా లాంచ్ చేసింది. ఇందులో 349cc ఇంజిన్ ఉంది, ఇది ఏకంగా 40.6bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. భారతదేశంలో 40bhp కంటే ఎక్కువ పవర్ ఇచ్చే అత్యంత చౌకైన బైక్ ఇదే కావడం విశేషం. కేవలం రూ.1.80 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో లభించే ఈ బైక్, నాలుగు అదిరిపోయే రంగుల్లో అందుబాటులో ఉంది. వేగం అంటే ప్రాణం ఇచ్చే వారికి ఇది సరైన ఛాయిస్.

Best Budget Performance Bikes Under Rs 2 Lakh You Can Buy Now

2. హీరో ఎక్స్‌ట్రీమ్ 250R:
హీరో మోటోకార్ప్ నుంచి వస్తున్న ఈ 250R మోడల్ యువతను కట్టిపడేస్తోంది. ఇందులో 249.03 cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 30bhp పవర్, 25Nm టార్క్‌ను ఇస్తుంది. దీని ధర రూ. 1.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కేవలం లుక్ మాత్రమే కాదు, దీని రైడింగ్ పోశ్చర్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. లాంగ్ రైడ్స్ వెళ్లాలనుకునే వారికి, కాలేజీ కుర్రాళ్లకు ఇది వాల్యూ ఫర్ మనీ బైక్.

Best Budget Performance Bikes Under Rs 2 Lakh You Can Buy Now

3.ట్రయంఫ్ (Triumph) స్పీడ్ T4:
ప్రీమియం బైక్ అంటే లక్షలు పోయాలి అనుకునే రోజులు పోయాయి. ట్రయంఫ్ స్పీడ్ T4 ఇప్పుడు రూ.1.95 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. ఇందులో 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది, ఇది 29bhp పవర్, 31Nm టార్క్‌ను అందిస్తుంది. క్లాసీ లుక్ కావాలి, అదే సమయంలో బిల్డ్ క్వాలిటీలో రాజీ పడకూడదు అనుకునే రైడర్స్ కోసం ఈ బైక్ ఒక అద్భుతం. దీని ఇంజిన్ సౌండ్ కూడా చాలా వినసొంపుగా ఉంటుంది.

Best Budget Performance Bikes Under Rs 2 Lakh You Can Buy Now

4. సుజుకి జిక్సర్ 250:
జపాన్ ఇంజనీరింగ్ తో తయారైన సుజుకి జిక్సర్ 250 తన స్మూత్ పర్ఫార్మెన్స్ కు పేరుగాంచింది. ఇందులో 249cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది, ఇది 26.5bhp పవర్‌ను ఇస్తుంది. సిటీ ట్రాఫిక్ లో నడపడానికి ఇది చాలా సులభంగా ఉంటుంది. దీని ధర రూ.1.81 లక్షల నుంచి మొదలవుతుంది. మీకు ఫుల్లీ ఫెయిర్డ్ (బాడీ కవర్ అయి ఉన్న) స్పోర్ట్స్ బైక్ కావాలంటే ఇందులోనే SF 250 మోడల్ కూడా ఉంది, దాని ధర రూ.1.89 లక్షలు.

Best Budget Performance Bikes Under Rs 2 Lakh You Can Buy Now

5. కేటీఎం (KTM) 200 డ్యూక్:
పవర్ ఫుల్ బైకుల గురించి మాట్లాడుకుంటే కేటీఎం పేరు లేకుండా అది పూర్తికాదు. కేటీఎం 200 డ్యూక్ తన అగ్రెసివ్ లుక్ మరియు పికప్ కు పెట్టింది పేరు. ఇందులో 199.5cc ఇంజిన్ ఉన్నప్పటికీ, అది ఇచ్చే 25bhp పవర్ తో రోడ్లపై రాకెట్ లా దూసుకుపోతుంది. దీని ధర రూ.1.98 లక్షలు. షార్ట్ రేస్ లు ఇష్టపడే వారికి, నగరంలో కింగ్ లా తిరగాలనుకునే వారికి డ్యూక్ ఎప్పుడూ ఫేవరెట్ ఆప్షనే.

Article Published On: Monday, May 4, 2026, 7:14 [IST]
English summary
Best budget performance bikes under rs 2 lakh you can buy now
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+