మధ్యతరగతి యువతకి సరైన స్పోర్టీ బైక్! ఒక లీటర్ పెట్రోల్‌తో ఎక్కువ దూరం! తక్కువ ధరలో ఎక్కువ శక్తి

TVS Apache RTR 160 భారత మార్కెట్లో ఒక ప్రముఖమైన స్పోర్టీ మోటార్‌సైకిల్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టైల్, పనితీరు, ధర ఈ మూడు విషయాల్లోనూ సమతుల్యత ఉండటంతో ఇది ముఖ్యంగా మధ్యతరగతి యువతకు సరైన ఎంపికగా నిలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, రోజువారీ ప్రయాణాలకు సరిపడే మైలేజ్ అందించడం ఈ బైక్‌కు ప్లస్ పాయింట్. మీరు ఇప్పుడు కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉంటే, పవర్‌ఫుల్ ఇంజిన్, స్పోర్టీ లుక్, నమ్మకమైన బ్రాండ్ విలువ కావాలంటే Apache RTR 160 ఖచ్చితంగా పరిశీలించాల్సిన మోడల్. నగరంలో డైలీ కమ్యూట్ అయినా, హైవే రైడింగ్ అయినా అన్ని అవసరాలకు ఇది సరిపోతుంది. ఈ బైక్ గురించిన వివరాలను ఈ కింది కథనంలో అందిస్తున్నాము.

TVS Apache RTR 160 సరసమైన ధరతో పాటు మంచి ఫీచర్లను అందించడం వల్ల అన్ని వర్గాల వినియోగదారులకు అనువైన మోటార్‌సైకిల్‌గా నిలుస్తోంది. ఈ బైక్ కనిష్టంగా రూ. 1.01 లక్షల నుంచి గరిష్టంగా రూ. 1.23 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరలో లభించడం విశేషం. ఈ ధర పరిధిలో స్పోర్టీ లుక్, నమ్మకమైన పనితీరు అందుబాటులో ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక మంచి ఎంపికగా మారింది.

Best Comfort Bike TVS Apache RTR 160 Price Engine And Mileage Details Inside

వేరియంట్‌ల విషయానికి వస్తే, Apache RTR 160ను TVS కంపెనీ విభిన్న అవసరాలకు తగ్గట్టుగా అందిస్తోంది. ఇందులో RM డ్రమ్ (బ్లాక్ ఎడిషన్), RM డ్రమ్, RM డిస్క్, RM డిస్క్ BT, రేసింగ్ ఎడిషన్, అలాగే డ్యూయల్ ఛానల్ ABS వంటి అనేక వేరియంట్‌లు ఉన్నాయి. దీంతో బడ్జెట్‌ను బట్టి, ఫీచర్లను బట్టి వినియోగదారులు తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

డిజైన్ పరంగా ఈ మోటార్‌సైకిల్ మరింత ఆధునికంగా రూపుదిద్దుకుంది. అగ్రెసివ్ లుక్‌ను ఇస్తూ ఉండే స్టైలిష్ LED హెడ్‌లైట్, స్పోర్టీ ఫీల్ ఇచ్చే LED DRLలు, అలాగే ఆకర్షణీయమైన LED టెయిల్ లైట్ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం మీద, తక్కువ ధరలో స్టైల్, టెక్నాలజీ, పనితీరు అన్నీ కలిపి కావాలనుకునే వారికి TVS Apache RTR 160 ఒక సరైన ఎంపిక అని చెప్పొచ్చు.

Best Comfort Bike TVS Apache RTR 160 Price Engine And Mileage Details Inside

ధరకు తగ్గట్టుగానే TVS Apache RTR 160 చాలా శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను అందిస్తోంది. ఇందులో 159.7-సిసి 4-స్ట్రోక్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వబడింది. ఈ ఇంజిన్ 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 16.04 బిహెచ్‌పి పవర్‌ను, అలాగే 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.85 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. స్పోర్టీ రైడింగ్‌ను ఇష్టపడే వారికి ఈ పవర్ అవుట్‌పుట్ మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది.

ఇంజిన్‌కు అనుసంధానంగా 5-స్పీడ్ గేర్‌బాక్స్ వల్ల స్మూత్ రైడింగ్‌తో పాటు హైవేలో స్టేబుల్ పనితీరును అందిస్తుంది. ఇది తక్కువ నిర్వహణ ఖర్చులతో పాటు మంచి మైలేజ్ అందించడంలో ప్రసిద్ధి చెందింది. ఇది 1 లీటర్ పెట్రోల్‌పై సుమారు 41.4 నుంచి 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు. అంతేకాదు, 12 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఉండటంతో పూర్తిగా ట్యాంక్ నింపితే 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Best Comfort Bike TVS Apache RTR 160 Price Engine And Mileage Details Inside

ఈ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, క్రాష్ అలర్ట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో స్పోర్ట్స్, అర్బన్, రెయిన్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. దీనికి ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక మోనోట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్-ఫిల్డ్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. దీనికి డ్యూయల్-ఛానల్ ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్రమ్/డిస్క్ బ్రేక్‌లు లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, February 9, 2026, 16:29 [IST]
English summary
Best comfort bike tvs apache rtr 160 price engine and mileage details inside
Read more on: #tvs motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+