Gen Z కోసం ఇవే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్క ఛార్జ్‌తో వందల కిలోమీటర్లు!

జెనరేషన్ Z వినియోగదారులు కేవలం వాహనం ఉపయోగం కోసం మాత్రమే కాకుండా, దాని స్టైల్, టెక్నాలజీపై కూడా ఎక్కువగా దృష్టి పెడతారు. వారి జీవనశైలి వేగవంతంగా, డిజిటల్‌గా మారుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపికలో కూడా వారు సాధారణ ఆప్షన్లను కాకుండా ప్రత్యేకమైన వాటిని కోరుకుంటారు. వారికి ఆకర్షణీయమైన డిజైన్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్, అలాగే రియల్-టైమ్ డేటా యాక్సెస్ వంటి ఆధునిక టెక్నాలజీ అంశాలు చాలా ముఖ్యంగా కనిపిస్తాయి. అంతేకాదు, పనితీరు విషయంలో కూడా కాంప్రమైజ్ చేయకుండా, వేగవంతమైన యాక్సిలరేషన్, మంచి రేంజ్, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందించే స్కూటర్లను ఎక్కువగా ప్రాధాన్యంగా ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో జెనరేషన్ Z వినియోగదారులకు సెట్ అయ్యే టూవీలర్స్ గురించి ఈ కింది కథణంలో.

Bajaj Chetak 2501: బజాజ్ చేతక్ 2501 ఇప్పుడు చేతక్ లైనప్‌లో కొత్తగా మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాతకాలపు క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక టెక్నాలజీని జోడిస్తూ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, ముఖ్యంగా స్టైల్, ప్రీమియం ఫీలింగ్ కోరుకునే యువతను ఆకట్టుకునేలా ఉంది. చేతక్‌కు ఎప్పటినుంచో ఉన్న రెట్రో ఇమేజ్‌ను కొనసాగిస్తూ, కొత్త తరం అవసరాలకు సరిపోయే స్మార్ట్ ఫీచర్లను ఇందులో అందించడం దీని ప్రధాన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Best Gen Z Electric Scooters India High Range Smart Features And Performance

దీని ధర సుమారు రూ.91,504 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఈ ధరలో ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో పాటు, విశ్వసనీయమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ అనుభవాన్ని బజాజ్ అందిస్తోంది. ఇందులో 2.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై దాదాపు 113 కి.మీ వరకు రేంజ్‌ను అందించగలదు. రోజువారీ నగర ప్రయాణాలకు ఇది చాలావరకు సరిపోతుందని చెప్పవచ్చు. అలాగే టెక్నాలజీ పరంగా ఈ స్కూటర్ ఆధునిక ఫీచర్లతో నిండి ఉంది.

Ather Rizta: ఏథర్ రిజ్టా భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో వేగంగా ప్రజాదరణ పొందుతున్న మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. దీని ధర సుమారు రూ.1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ధరలో ఏథర్ అందిస్తున్న ఫీచర్లు, టెక్నాలజీ కారణంగా, ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా మారింది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 159 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగల సామర్థ్యం దీనికి ఉంది.

Best Gen Z Electric Scooters India High Range Smart Features And Performance

ఏథర్ రిజ్టా మరో ముఖ్యమైన ఆకర్షణ 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ. దీని ధర సుమారు రూ.1.17 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఫీచర్ల పరంగా చూస్తే, ఏథర్ రిజ్టా పూర్తిగా ఆధునిక టెక్నాలజీతో నిండి ఉంది. ఇందులో TFT డిస్‌ప్లే, భారీగా 56 లీటర్ల స్టోరేజ్ స్పేస్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అదనంగా ఆటో హోల్డ్, స్కిడ్ కంట్రోల్, హిల్ అసిస్ట్, రివర్స్ మోడ్ వంటి రైడింగ్ సౌకర్యాలు అందించబడ్డాయి.

Ola S1 X+ : ఓలా ఎలక్ట్రిక్ లైనప్‌లో S1 X+ ఇప్పుడు అత్యంత ఆధునిక, టెక్నాలజీ ఫోకస్‌డ్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. దీని ధర సుమారు రూ.1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో 5.2 kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ బ్యాటరీతో స్కూటర్ ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై దాదాపు 320 కి.మీ వరకు రేంజ్‌ను అందించగలదని కంపెనీ చెబుతోంది.

Best Gen Z Electric Scooters India High Range Smart Features And Performance

ముఖ్యంగా జెన్ 3 వెర్షన్‌తో ఈ మోడల్ మరింత అప్‌గ్రేడ్ అయి, కొత్త తరం కొనుగోలుదారులను ఆకర్షించేలా రూపొందించబడింది. స్టైలిష్ డిజైన్, భారీ రేంజ్, స్మార్ట్ ఫీచర్లు, అధునాతన టెక్నాలజీ కలయికతో ఇది మార్కెట్లో బలమైన ఎంపికగా మారుతోంది. ముఖ్యంగా భారతదేశంలో తయారైన 4680 భారత్ సెల్స్‌ను ఇందులో ఉపయోగించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవి మెరుగైన పనితీరు, బ్యాటరీ సామర్థ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Article Published On: Tuesday, May 19, 2026, 15:30 [IST]
English summary
Best gen z electric scooters india high range smart features and performance
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+