సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కానీ ఒక షరతు మీద! లిస్ట్‌లో ఇండియా టాప్ మోడళ్లు
ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఖర్చు ఒక పెద్ద అడ్డంకిగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన వినూత్న విధానమే BaaS (Battery as a Service). ఈ స్కీమ్‌లో వాహనం ధరలో అత్యంత ఖరీదైన భాగమైన బ్యాటరీని వేరు చేస్తారు. దాంతో, కస్టమర్లు స్కూటర్‌ను చాలా తక్కువ ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీ కోసం మాత్రం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక విధంగా చూస్తే "pay-as-you-use" మోడల్‌లా పని చేస్తుంది. అవసరానికి అనుగుణంగా ప్లాన్‌ను మార్చుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా స్కూటర్ మొత్తం ధరలో దాదాపుగా సగానికి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ విధానంలో లభిస్తున్న కొన్ని స్కూటర్లను చూద్దాం.
TVS Orbiter V1: టీవీఎస్ ఆర్బిటర్ వీ1 భారతదేశంలో విలువకు విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది, ముఖ్యంగా BaaS మోడల్‌తో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. సాధారణంగా ఈ స్కూటర్ ధర రూ.84,500 నుండి ప్రారంభమవుతుండగా, BaaS ఆప్షన్‌తో కేవలం రూ.49,999కే అందుబాటులోకి రావడం పెద్ద హైలైట్‌గా చెప్పుకోవచ్చు. తక్కువ ప్రారంభ ధరతోనే అధునాతన ఫీచర్లు అందించడం దీని ప్రత్యేకత.

ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 86 కి.మీ IDC రేంజ్‌ను ఇస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, LED హెడ్‌ల్యాంప్స్, ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్, స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీ, LCD క్లస్టర్, యాంటీ-థెఫ్ట్ అలారం, హిల్ హోల్డ్ అసిస్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, 34 లీటర్ల భారీ స్టోరేజ్, క్రూయిజ్ కంట్రోల్, అంతేకాకుండా, జియోఫెన్సింగ్, యాక్సిడెంట్ అలర్ట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా వినియోగదారులకు అదనపు భద్రతను అందిస్తాయి.
Vida VX2 Go: ప్రముఖ టూవీలర్ తయారీ కంపెరీ హీరో మోటోకార్ప్, తన Vida బ్రాండ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో బలంగా అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వచ్చిన విడా వీఎక్స్2 గో ఇప్పుడు BaaS ప్లాన్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ స్కూటర్ సాధారణంగా రూ.76,740 ధరతో అందుబాటులో ఉండగా, BaaS మోడల్‌లో కేవలం రూ.44,990 ప్రారంభ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఈ స్కూటర్‌లో తీసివేయగల బ్యాటరీ (removable battery) సిస్టమ్ ఉండటం ప్రత్యేకత. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 92 కి.మీ IDC రేంజ్‌ను అందిస్తుంది. అలాగే గరిష్టంగా గంటకు 70 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఫీచర్ల విషయానికి వస్తే, 33.2 లీటర్ల బూట్ స్పేస్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, LED లైటింగ్‌తో కూడిన పూర్తిగా డిజిటల్ డాష్‌బోర్డ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇది, ఇప్పుడు BaaS పథకం ద్వారా మరింత అందుబాటులోకి వచ్చింది. ఈ స్కీమ్ కింద ఇది కేవలం రూ.59,999 ప్రారంభ ధరకే లభించడం వినియోగదారులకు పెద్ద ప్లస్‌గా మారింది. సాధారణంగా దీని స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.1.02 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాప్ వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 212 కి.మీ IDC రేంజ్‌ను అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, DRLలతో కూడిన స్మార్ట్ LED హెడ్‌ల్యాంప్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్న TFT కన్సోల్, TVS స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. అలాగే సీటు కింద 32 లీటర్ల స్టోరేజ్, HMI కంట్రోలర్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు రోజువారీ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.


Click it and Unblock the Notifications








