యువత గుండెల్లో మళ్లీ జావా హంగామా.. పాతకాలపు డిజైన్.. కొత్తకాలపు పవర్! జావా 42 ఐవరీ ధర, ఫీచర్లు ఇవే

నియో-క్లాసిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించిన Jawa Yezdi Motorcycles మరోసారి యువతను ఆకట్టుకునే స్టైలిష్ అప్డేట్‌తో ముందుకొచ్చింది. కంపెనీ తన ప్రాచుర్యం పొందిన Jawa 42 మోడల్‌కు ఐవరీ ఎడిషన్ (Ivory Edition)ను పరిచయం చేస్తూ, క్లాసిక్ శైలిని ఆధునిక ఇంజనీరింగ్‌తో మిళితం చేసిన ప్రత్యేక రూపాన్ని అందించింది. ప్రారంభం నుంచే బోల్డ్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, రైడర్-ఫస్ట్ ఫీచర్లతో మంచి పేరు తెచ్చుకున్న జావా 42, ఇప్పుడు ఈ కొత్త ఎడిషన్‌తో మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తోంది. 2026 జావా 42 ఐవరీ ఎడిషన్‌ను చూసిన వెంటనే ఆకట్టుకునే అంశం దాని ప్రత్యేక రంగు, ఫినిషింగ్. వెనుక ఫెండర్‌పై, ఇంధన ట్యాంక్‌పై వింటేజ్ ఫాంట్‌లో రాసిన బ్రాండింగ్ ఈ బైక్‌కు ఒక క్లాసిక్ టచ్‌ను జోడిస్తుంది.

ఇది కేవలం ఒక స్టికర్ మార్పు మాత్రమే కాదు, పాతకాలపు రేసింగ్ వారసత్వాన్ని గుర్తు చేసేలా రూపొందించిన డిజైన్ ఎలిమెంట్. సైడ్ ప్యానెల్ పూర్తిగా కొత్త డిజైన్‌తో రూపొందించబడింది. అదే సమయంలో, జావా సిగ్నేచర్ టియర్-డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్‌పై చెకర్డ్ ఫ్లాగ్ గ్రాఫిక్ ఈ బైక్‌కు రేసింగ్ స్పిరిట్‌ను అందిస్తుంది. ఈ డిజైన్‌కు ప్రేరణగా నిలిచింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐల్ ఆఫ్ మ్యాన్ TT రేసింగ్ శకం.

Classic Legends Brings Jawa 42 Ivory Edition With Retro Design And Powerful Engine

ఆ కాలంలో కనిపించిన క్లాసిక్ రేసింగ్ బైక్‌ల శైలిని గుర్తు చేసేలా ఈ ఐవరీ ఎడిషన్ రూపుదిద్దుకుంది. పాతకాలపు వేగం సౌందర్యాన్ని ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో కలిపి, యువతకు కొత్త అనుభూతిని అందించడమే కంపెనీ లక్ష్యం అని తెలుస్తోంది. డిజైన్ విషయానికొస్తే, ఆఫ్‌సెట్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఇది సాధారణ సెంటర్-మౌంటెడ్ మీటర్‌కు భిన్నంగా ఉండటం వల్ల క్లాసిక్ స్టైల్‌ను మరింత హైలైట్ చేస్తుంది.

స్పష్టమైన నియో-క్లాసిక్ సిల్హౌట్‌తో జావా 42 తన చారిత్రక 1960,70ల నాటి మూలాలను గుర్తు చేస్తూనే, డిజైన్ ట్రెండ్‌లకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. పనితీరు పరంగా జావా 42 ఐవరీ ఎడిషన్ తన స్థాయిని నిలబెట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది. స్మూత్ పవర్ డెలివరీ, స్టేబుల్ రైడింగ్ అనుభవం, మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ వంటి అంశాలు నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా వీకెండ్ లాంగ్ రైడ్స్‌కి కూడా సరైన ఎంపికగా నిలబెడతాయి.

Classic Legends Brings Jawa 42 Ivory Edition With Retro Design And Powerful Engine

ఇంజిన్, పనితీరు పరంగా చూస్తే, కొత్త Jawa 42 Ivory Edition తన సెగ్మెంట్‌లో బలమైన ప్రతిస్పందనను అందించే మోటార్‌సైకిల్‌గా నిలుస్తోంది. 350సీసీ విభాగంలోని అనేక బైక్‌లతో పోలిస్తే సుమారు 40 శాతం ఎక్కువ శక్తిని అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఈ బైక్‌లో 294-సీసీ లిక్విడ్-కూల్డ్ J-పాంథర్ ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 27.32 PS శక్తి, 26.84 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర విషయానికొస్తే, ఈ ప్రీమియం లుక్, శక్తివంతమైన పనితీరు కలిగిన మోటార్‌సైకిల్‌ను కేవలం రూ. 1,84,950 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు అందిస్తున్నారు. ఈ ధరతో 2026 జావా 42 ఐవరీ ఎడిషన్ భారతదేశం అంతటా 450కి పైగా అధీకృత Jawa Yezdi Motorcycles డీలర్‌షిప్ షోరూమ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. యాజమాన్య అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు కంపెనీ ప్రత్యేక హామీ కార్యక్రమాన్ని కూడా అందిస్తోంది.

Classic Legends Brings Jawa 42 Ivory Edition With Retro Design And Powerful Engine

కస్టమర్ సంతృప్తి, ఇబ్బంది లేని యాజమాన్యానికి ప్రాధాన్యత ఇస్తూ, ఈ బైక్‌పై 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ ఇవ్వబడుతుంది. అంతేకాకుండా, 6 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని వెంట 8 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, దేశవ్యాప్తంగా వర్తించే 5 సంవత్సరాల AMC (అన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్) వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Article Published On: Wednesday, February 18, 2026, 7:26 [IST]
English summary
Classic legends brings jawa 42 ivory edition with retro design and powerful engine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+