అక్వాన్ తుపాను అలర్ట్: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'అక్వాన్' ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నవంబర్ 20, 21 తేదీల్లో వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ముఖ్యంగా నవంబర్ 19, 20 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
ఐఎమ్‌డీ తాజా బులెటిన్ ప్రకారం.. శుక్రవారం వరకు తీరప్రాంత ఏపీకి రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఈరోజు వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, శుక్రవారం నుంచి జల్లులు ప్రారంభమై, శనివారానికి తూర్పు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. విజయవాడలో అక్కడక్కడా భారీ వర్షాలు పడి, రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

'అక్వాన్' తుపాను ప్రభావం: ఏపీ, తెలంగాణలో ఐఎమ్‌డీ హెచ్చరికలు ఇవే!
| తేదీ | ప్రాంతం | ఐఎమ్‌డీ హెచ్చరికలు |
|---|---|---|
| నవంబర్ 19 | కోస్తాంధ్ర & యానాం | భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు; ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తీవ్రమైన వర్షం. |
| నవంబర్ 20 | కోస్తాంధ్ర; తెలంగాణ | తీరప్రాంతంలో భారీ వర్షాలు; తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. |
| నవంబర్ 21 | తెలంగాణ (తూర్పు జిల్లాలు) | అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు; జిల్లాలవారీగా ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు. |
వర్షంలో ద్విచక్ర వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తడి రోడ్లపై గ్రిప్ తగ్గుతుంది కాబట్టి, వేగం తగ్గించి ముందుగానే బ్రేకులు వేయడం మంచిది. రోడ్డుపై వేసిన వైట్ లైన్లపై బండి పోనివ్వకండి. వెనుక బ్రేక్‌ను ఎక్కువగా ఉపయోగించండి. టైరు సగం కంటే ఎక్కువ మునిగే నీళ్లలో బండి నడపొద్దు. హెల్మెట్ వైజర్ శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు వాడండి. బండి తడిసిన ప్రతిసారీ చైన్ లూబ్రికేషన్ చేయడం మర్చిపోవద్దు. వాటర్ లాగిన్ అయ్యే అండర్‌పాస్‌ల నుంచి అస్సలు వెళ్లకండి.
ఈ-స్కూటర్ కేర్: ఐపీ రేటింగ్స్, ఛార్జింగ్ భద్రత, నీటి సమస్యలపై జాగ్రత్తలు
ప్రముఖ ఈ-స్కూటర్లలో బ్యాటరీ, మోటార్‌లకు IP67 రేటింగ్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. బండి మొత్తం నీటిలో మునిగితే తట్టుకోలేదు. వర్షంలో తడిసిన తర్వాత స్కూటర్, కనెక్టర్లు, పోర్టబుల్ ఛార్జర్‌ను పూర్తిగా తుడిచి ఆరిన తర్వాతే ఛార్జింగ్ పెట్టండి. తడి సాకెట్లను అస్సలు వాడకండి. ఫ్లోర్‌బోర్డ్ లేదా బ్యాటరీ కేవిటీలోకి నీరు చేరితే, నడిపించే ప్రయత్నం చేయకుండా టోయింగ్ ద్వారా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. నీటి వల్ల జరిగే నష్టాలకు చాలా ఇన్సూరెన్స్/వారంటీలు వర్తించవు కాబట్టి నిబంధనలు సరిగ్గా చదువుకోండి.
ఇన్సూరెన్స్ క్లెయిమ్: వరద నష్టాల పరిహారం, త్వరిత క్లెయిమ్ కోసం అవసరమైన పత్రాలు
కాంప్రహెన్సివ్ లేదా స్టాండ్‌అలోన్ ఓన్-డ్యామేజ్ పాలసీలు ఉన్నవారికే వరద నష్టపరిహారం లభిస్తుంది. నీరు చేరడం వల్ల ఇంజిన్ లేదా బ్యాటరీ పాడైతే పరిహారం పొందడానికి 'ఇంజిన్ ప్రొటెక్ట్' లేదా 'బ్యాటరీ ప్రొటెక్ట్' యాడ్-ఆన్లు అవసరం. నీటిలో మునిగిన వాహనాన్ని స్టార్ట్ చేసేందుకు అస్సలు ప్రయత్నించకండి. జరిగిన నష్టాన్ని ఫోటోలు తీసి వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వండి. ఆర్సీ, పాలసీ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోలు, రిపేర్ ఎస్టిమేషన్, క్లెయిమ్ ఫారమ్‌లను సిద్ధంగా ఉంచుకుంటే ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది.
డీలర్లు, సర్వీస్ సెంటర్ల అలర్ట్: హైదరాబాద్, విశాఖ, విజయవాడ
రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు ఉన్న జిల్లాల్లో షోరూమ్‌ల పనివేళలు మారే అవకాశం ఉంది. డెలివరీలు కూడా ఆలస్యం కావచ్చు. కాబట్టి షోరూమ్‌లకు వెళ్లేముందు ఫోన్ చేసి కనుక్కోవడం మంచిది. రోటీన్ సర్వీసింగ్ కంటే బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. విశాఖపట్నం జిల్లాలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో షోరూమ్ సమయాల్లో మార్పులు ఉండవచ్చు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ నంబర్లను సేవ్ చేసుకోండి. నీరు నిలిచిన ప్రాంతాల్లో టెస్ట్ రైడ్‌లు చేయకండి.
నవంబర్ 19 నుంచి 21 వరకు ఐఎమ్‌డీ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. నీరు నిలిచిన రోడ్ల గుండా ప్రయాణించకపోవడం మంచిది. రైన్ కవర్, చిన్నపాటి టూల్స్, జిప్ లాక్ బ్యాగ్‌లు, పవర్ బ్యాంక్ వంటి అవసరమైన వస్తువులను వెంట ఉంచుకోండి. మీ వాహనం వర్షంలో బాగా తడిస్తే.. ముందుగా ఆరబెట్టి, పరిశీలించి, అవసరమైతే ఇన్సూరెన్స్ కోసం డాక్యుమెంట్ చేయండి. కొద్దిగా జాగ్రత్త వహిస్తే మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవడంతో పాటు మీ వాహనాలను, వాటి వారంటీలను కాపాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications
