ఎలక్ట్రిక్ స్కూటర్ vs ఎలక్ట్రిక్ బైక్.. టూ వీలర్ కొనేముందు ఈ విషయాలు తెలియకపోతే నష్టపోతారు

మనదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల ట్రెండ్ నడుస్తోంది. పెట్రోల్ ధరలు సెంచరీ దాటేయడం, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడంతో సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ ఈవీల వైపు చూస్తున్నారు. అయితే, ఒక ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకున్నప్పుడు కస్టమర్ల మెదడులో మెదిలే మొదటి ప్రశ్న.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా? లేక ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? అని. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం మీ అవసరాలు, మీ వాడకంపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలు, లాభనష్టాలను వివరంగా తెలుసుకుందాం.

సిటీ ప్రయాణాలకు స్కూటరే బెస్ట్
మీరు ఉండేది సిటీల్లో అయితే, మీ ప్రయాణం కేవలం ఆఫీస్, కాలేజ్ లేదా మార్కెట్ వరకే పరిమితం అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు చాలా బెస్ట్. స్కూటర్లలో గేర్లు ఉండవు కాబట్టి ట్రాఫిక్ లో నడపడం చాలా సులభం. అన్నింటికంటే ముఖ్యంగా స్కూటర్లలో ఉండే స్టోరేజ్ స్పేస్ (Storage Space). సీటు కింద హెల్మెట్ పెట్టుకోవడానికి, ముందు భాగంలో సామాన్లు తగిలించుకోవడానికి స్కూటర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో మహిళలు, పెద్దవారు కూడా సులభంగా నడపగలిగే వాహనం ఇదొక్కటే.

Electric Scooter vs Electric Bike Which One Should You Buy in 2026

పవర్, పర్ఫార్మెన్స్ కావాలంటే బైక్ తీసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ బైక్స్ సాధారణంగా యువతను, వేగాన్ని ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు. వీటిలో మోటార్ పవర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పికప్ అదిరిపోతుంది. హైవేలపై ప్రయాణించేటప్పుడు బైక్ చాలా స్థిరంగా (Stable) ఉంటుంది. బైక్ టైర్లు పెద్దవిగా ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం హాయిగా సాగుతుంది. మీరు రోజుకు 50-60 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే, ఎలక్ట్రిక్ బైక్ మీకు సౌకర్యవంతంగా ఉంటుంది.

బ్యాటరీ, రేంజ్
ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణంగా ఒక్కసారి చార్జ్ చేస్తే 80 నుంచి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తాయి. అదే ఎలక్ట్రిక్ బైక్స్ విషయానికి వస్తే, వీటిలో బ్యాటరీ ప్యాక్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి 150 నుంచి 200 కిలోమీటర్ల పైచిలుకు రేంజ్ ఇచ్చే మోడల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అయితే, బైక్ బ్యాటరీ పెద్దది కాబట్టి చార్జింగ్ సమయం కూడా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. స్కూటర్లలో అయితే పోర్టబుల్ బ్యాటరీ (బ్యాటరీని తీసి ఇంట్లోకి తీసుకెళ్లి చార్జ్ చేసుకునే వెసులుబాటు) ఆప్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి.

Electric Scooter vs Electric Bike Which One Should You Buy in 2026

మెయింటెనెన్స్ ఖర్చులు, ధరలు
ఖరీదు విషయానికి వస్తే.. ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ.70,000 నుంచి రూ.1.5 లక్షల వరకు లభిస్తాయి. కానీ పర్ఫార్మెన్స్ బైక్స్ ధరలు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభమై 2 లక్షల పైమాటే. మెయింటెనెన్స్ విషయానికి వస్తే రెండింటిలోనూ ఇంజిన్ ఆయిల్, పిస్టన్ వంటి సమస్యలు ఉండవు కాబట్టి ఖర్చు చాలా తక్కువ. అయితే, టైర్లు, బ్రేక్ ప్యాడ్ల అరుగుదల బైక్ లో కొంచెం ఎక్కువగా ఉంటుంది.

మీరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. కుటుంబ అవసరాలకు, సిటీ ట్రాఫిక్ కు స్కూటర్ బెస్ట్. కానీ మీకు ఒక స్టైలిష్ లుక్, హై స్పీడ్, లాంగ్ రైడింగ్ కంఫర్ట్ కావాలంటే మాత్రం కళ్లు మూసుకుని ఎలక్ట్రిక్ బైక్ వైపు వెళ్లొచ్చు. ఏది కొన్నా సరే, మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో చూసుకోవడం, బ్యాటరీ వారంటీ గురించి ఆరా తీయడం మర్చిపోవద్దు.

Article Published On: Friday, May 8, 2026, 14:12 [IST]
English summary
Electric scooter vs electric bike which one should you buy in 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+