ఎలక్ట్రిక్ బండ్లకు పోటీగా ఫ్లెక్స్-ఫ్యూయల్ బండ్లు.. ఏది బెస్ట్? బ్యాటరీనా.. ఇథనాలా?

పెరుగుతున్న ఇంధన అవసరాలు, ముడి చమురుపై విదేశాలపై ఎక్కువగా ఆధారపడటం, అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని వేగంగా విస్తరించే దిశగా పలు కీలక చర్యలు చేపడుతోంది. భవిష్యత్ రవాణా వ్యవస్థను మరింత పర్యావరణహితంగా మార్చడంలో ఈ రెండు టెక్నాలజీలు కీలక పాత్ర పోషించనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈవీలు మరియు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల లక్ష్యం ఒకటే అయినప్పటికీ, అవి పనిచేసే విధానం, ఉపయోగించే ఇంధనం, నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాల అవసరాలు, వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు వంటి అంశాల్లో గణనీయమైన తేడాలు ఉన్నాయి.

ఒకవైపు బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా, మరోవైపు పెట్రోల్‌తో పాటు ఎథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సాంకేతికతల్లో ప్రధాన తేడాలు ఏమిటి? ఏది ఎక్కువ ప్రయోజనకరం? భారతదేశ పరిస్థితులకు ఏ టెక్నాలజీ మరింత అనుకూలంగా ఉంటుంది? వినియోగదారులు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు ఈ రెండు భవిష్యత్ రవాణా సాంకేతికతలను వివరంగా తెలుసుకుందాం.

Electric Vs Flex Fuel Bikes Key Differences Explained Full Details Inside

రోజువారీ వినియోగం: రోజువారీ వినియోగంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటికీ ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు ఇంధన ఖర్చును తగ్గించే అవకాశం కల్పిస్తాయి. పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E85 ఇంధనం పూర్తిగా అందుబాటులో లేకపోయినా, అవసరమైనప్పుడు సాధారణ పెట్రోల్‌తో కూడా ఈ వాహనాలను నడపవచ్చు.

మరోవైపు, నగరాల్లో రోజువారీ చిన్న ప్రయాణాలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఎంపిక. ఇంట్లోనే రాత్రి సమయంలో ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉండటం, తక్కువ నిర్వహణ ఖర్చులు, నిశ్శబ్దమైన డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలు వీటి ప్రధాన ఆకర్షణలు. అయితే సుదీర్ఘ ప్రయాణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగానికి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మరింత అనుకూలంగా ఉంటాయి. ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సిన అవసరం లేకపోవడంతో రేంజ్ ఆందోళన కూడా ఉండదు.

Electric Vs Flex Fuel Bikes Key Differences Explained Full Details Inside

ఫ్యూయల్ లభ్యత: ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తాయి. వీటిలో సాంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ ఉండదు కాబట్టి టెయిల్‌పైప్ నుంచి కాలుష్య ఉద్గారాలు విడుదల కావు. మరోవైపు, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు అంతర్గత దహన (ICE) ఇంజిన్‌తోనే పనిచేస్తాయి. అయితే ఇవి సాధారణ పెట్రోల్‌తో పాటు 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉన్న E85 ఇంధనంతో కూడా నడిచేలా ప్రత్యేకంగా రూపొందిస్తారు.

ఖర్చు పరంగా చూస్తే, ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే అవకాశం ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలు కిలోమీటరుకు చాలా తక్కువ వ్యయంతో ప్రయాణించే అవకాశం కల్పిస్తాయి. అయితే వాటి వినియోగం ఛార్జింగ్ స్టేషన్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మరింత ఆచరణాత్మక ఎంపికగా నిలుస్తాయి.

మెయింటనెన్స్: ఖర్చుల పరంగా చూస్తే ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభ ధర సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. సబ్సిడీలు ఉన్నప్పటికీ బ్యాటరీ ఖర్చు కారణంగా వీటి ధర అధికంగా ఉండగా, కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాటరీ మార్పిడి కూడా ఖరీదైనదే. మరోవైపు, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల ధర సాధారణ పెట్రోల్ బైక్‌లకు దగ్గరగా ఉండటంతో పాటు నిర్వహణ కూడా పెద్దగా భిన్నంగా ఉండదు.

భారతదేశంలోని విభిన్న రహదారి పరిస్థితులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈవీలు, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు రెండింటినీ ప్రోత్సహిస్తోంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఈవీలు అనువుగా ఉండగా, దూర ప్రయాణాలు, గ్రామీణ ప్రాంతాల వినియోగానికి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

Article Published On: Thursday, July 2, 2026, 16:00 [IST]
English summary
Electric vs flex fuel bikes key differences explained full details inside
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+