లేడీస్ అండ్ జెంట్స్ అందరూ ఈ కంపెనీ స్కూటర్లే కావాలంటున్నారు.. జూన్‎లో 90 వేల మందికి పైగా కొన్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (ఈవీ) మార్కెట్ రోజురోజుకూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు భారీగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో దేశీయ ఈవీ మార్కెట్లో విక్రయాలు భారీగా పుంజుకున్నాయి.

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలైన టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటోలు కలిసి కేవలం ఒకే నెలలో ఏకంగా 90 వేలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి మార్కెట్లో తమ గుత్తాధిపత్యాన్ని చాటుకున్నాయి. వీటితో పాటు ఎథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ (విడా) వంటి కంపెనీలు కూడా రికార్డు స్థాయి సేల్స్ నమోదు చేశాయి.

EV Sales Boom TVS And Bajaj Cross 90k Mark While This Small EV Brand Secures 3582 Growth

మార్కెట్ లీడర్‌గా దూసుకుపోతున్న టీవీఎస్
ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ తన అగ్రస్థానాన్ని భద్రపరుచుకుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఐక్యూబ్ (iQube), ఆర్బిటర్ (Orbiter) వంటి పాపులర్ మోడళ్లను అమ్ముతున్న టీవీఎస్ సంస్థ, జూన్ నెలలో రికార్డు స్థాయిలో 46,999 యూనిట్ల అమ్మకాలను జరిపింది. గత ఏడాది ఇదే జూన్ నెలలో కంపెనీ కేవలం 26,734 స్కూటర్లను మాత్రమే విక్రయించగా, ఈసారి ఏకంగా 76 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.

మరోవైపు బజాజ్ ఆటో కూడా తన చేతక్ స్కూటర్‌తో గట్టి పోటీ ఇస్తోంది. బజాజ్ కంపెనీ ఈ జూన్ నెలలో 43,234 స్కూటర్లను విక్రయించి 80 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో బజాజ్ సేల్స్ కేవలం 23,987 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి.

EV Sales Boom TVS And Bajaj Cross 90k Mark While This Small EV Brand Secures 3582 Growth

95 శాతం గ్రోత్‌తో ఎథర్ ఎనర్జీ.. 175 శాతం వృద్ధితో దుమ్మురేపిన హీరో విడా!
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ కంపెనీ ఎథర్ ఎనర్జీ కూడా మార్కెట్లో తన హవాను కొనసాగిస్తోంది. జూన్ నెలలో ఎథర్ సంస్థ 31,188 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి, గత ఏడాది జూన్ నాటి 16,015 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఏకంగా 95 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది.

ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా (Vida) అమ్మకాల్లో భారీ జంప్ సాధించింది. గత ఏడాది జూన్ లో కేవలం 7,920 యూనిట్లు అమ్మిన హీరో విడా, ఈసారి ఏకంగా 175 శాతం అద్భుతమైన గ్రోత్‌తో 21,792 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి టాప్-4 లో నిలిచింది.

EV Sales Boom TVS And Bajaj Cross 90k Mark While This Small EV Brand Secures 3582 Growth

ఓలా ఎలక్ట్రిక్‌కు తప్పని తిరోగమనం
ఒకప్పుడు ఈవీ మార్కెట్లో రారాజుగా వెలిగిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) సంస్థకు ఈ జూన్ నెల పెద్దగా కలిసిరాలేదు. టాప్-5 కంపెనీల జాబితాలో ఎలాగోలా చోటు దక్కించుకున్నప్పటికీ, వార్షిక అమ్మకాల పరంగా ఓలా మైనస్ గ్రోత్‌ను నమోదు చేసింది.

గత ఏడాది జూన్ నెలలో ఓలా కంపెనీ 20,697 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగా, ఈ జూన్ నెలలో కేవలం 16,144 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. అంటే కంపెనీ అమ్మకాలు దాదాపు 22 శాతం మేర పడిపోయాయి. సర్వీస్ లోపాలు, కస్టమర్ల అసంతృప్తి కారణంగానే ఓలా అమ్మకాలు తగ్గాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ చిన్న కంపెనీకి ఏకంగా 3582 శాతం గ్రోత్
ఈ జూన్ నెల ఈవీ అమ్మకాల రిపోర్టులో అందరి దృష్టిని ఆకర్షించిన సంస్థ ఈ-స్ప్రింటో గ్రీన్ ఎనర్జీ (e-Sprinto Green Energy). ఈ చిన్న ఈవీ బ్రాండ్ ఏకంగా 3582 శాతం అసాధారణ వార్షిక వృద్ధిని సాధించి చరిత్ర సృష్టించింది. గత ఏడాది జూన్ లో ఈ కంపెనీ కేవలం 51 స్కూటర్లను మాత్రమే విక్రయించగా, ఈసారి ఏకంగా 1,878 యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

తక్కువ ధర, మెరుగైన ఫీచర్ల వల్లే ఈ బ్రాండ్‌కు ఆదరణ పెరిగినట్లు తెలుస్తోంది. వీటితో పాటు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ 10,928 యూనిట్లతో (152% గ్రోత్), రివర్ మోబిలిటీ 4,391 యూనిట్లతో (214% గ్రోత్), బీగౌస్ ఆటో 3,916 యూనిట్లతో (98% గ్రోత్), సింపుల్ ఎనర్జీ 1,365 యూనిట్ల అమ్మకాలతో (210% గ్రోత్) టాప్-10 లో నిలిచాయి.

Article Published On: Thursday, July 2, 2026, 14:13 [IST]
English summary
Ev sales boom tvs and bajaj cross 90k mark while this small ev brand secures 3582 growth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+