యాక్టివా కంటే తక్కువ ధరకే హీరో స్కూటర్.. ఇప్పుడు ఇదే ట్రెండింగ్‌.. అమ్మకాలే సాక్ష్యం!

భారతీయ స్కూటర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్‌కు బలమైన స్థానం సంపాదించడం అంత సులభం కాలేదు. ఒకప్పుడు హీరో ప్లెజర్ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత కంపెనీ తీసుకొచ్చిన అనేక స్కూటర్ మోడళ్లు మార్కెట్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ముఖ్యంగా హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి బలమైన ప్రత్యర్థుల మధ్య హీరో తన ఉనికిని చాటుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే పరిస్థితి ఇప్పుడు క్రమంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కొత్త తరం హీరో డెస్టినీ 125 (Hero Destini 125) మార్కెట్లోకి వచ్చిన తర్వాత కంపెనీ స్కూటర్ విభాగంలో తిరిగి పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, కుటుంబ అవసరాలకు అనువైన లక్షణాలతో ఈ స్కూటర్ భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ స్కూటర్ కోసం చూస్తున్న కొనుగోలుదారుల నుంచి డెస్టినీ 125కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా విడుదలైన మే 2026 విక్రయ గణాంకాలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. గత నెలలో హీరో మోటోకార్ప్ మొత్తం 26,482 యూనిట్ల డెస్టినీ 125 స్కూటర్లను విక్రయించింది.

Hero Destini 125 Sales Cross 26000 Units With 76 Percent Growth

గత ఏడాది ఇదే నెలలో నమోదైన 15,018 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 76.34 శాతం వృద్ధి. స్కూటర్ సెగ్మెంట్‌లో ఇంత భారీ స్థాయిలో వార్షిక వృద్ధిని నమోదు చేయడం డెస్టినీ 125కు లభిస్తున్న ఆదరణకు నిదర్శనం. హోండా యాక్టివా వంటి మార్కెట్ దిగ్గజాల విక్రయాలను డెస్టినీ ఇంకా అందుకోలేకపోయినా, ఈ వృద్ధి హీరో మోటోకార్ప్‌కు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా చెప్పవచ్చు.

హీరో డెస్టినీ 125 ప్రస్తుతం VX, ZX, ZX+ వంటి విభిన్న వేరియంట్లలో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.80,884 నుంచి రూ.90,465 వరకు ఉండటంతో, ఇది 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో మంచి విలువను అందించే మోడల్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా హోండా యాక్టివాతో పోలిస్తే దాదాపు రూ.8,000 వరకు తక్కువ ధరలో లభించడం కొనుగోలుదారులకు అదనపు ఆకర్షణగా మారింది.

Hero Destini 125 Sales Cross 26000 Units With 76 Percent Growth

కొత్త తరం డెస్టినీ 125 విజయానికి ప్రధాన కారణం దీని పూర్తిగా కొత్త డిజైన్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, డెస్టినీ 125లో 124 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అందించారు. CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన ఈ ఇంజిన్ 9 bhp శక్తి, 10.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలకు అవసరమైన స్మూత్ పనితీరు, వేగవంతమైన పికప్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని ఇది అందిస్తుంది.

కొత్త తరం మోడల్‌లో ఇంజిన్‌ను మరింత శుద్ధి చేసి, పనితీరును మెరుగుపరచడంతో పాటు NVH స్థాయిలను కూడా తగ్గించినట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంటోంది. అదనంగా, హీరోకు ప్రత్యేకమైన i3S టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉంది. మైలేజ్ పరంగా కూడా ఈ స్కూటర్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. హీరో తెలిపిన వివరాల ప్రకారం, డెస్టినీ 125 లీటరుకు 59 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు.

Hero Destini 125 Sales Cross 26000 Units With 76 Percent Growth

ఫీచర్ల పరంగా ఈ స్కూటర్‌లో అందించిన ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్, ఆటో క్యాన్సల్ టర్న్ ఇండికేటర్స్, అంతేకాకుండా, ఆధునిక వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డెస్టినీ 125లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా జోడించారు. దీంతో రైడర్లు తమ ప్రయాణానికి సంబంధించిన సమాచారం, కాల్, మెసేజ్ అలర్ట్‌లు, నావిగేషన్ సూచనలను సులభంగా పొందగలుగుతారు.

Article Published On: Wednesday, June 24, 2026, 16:10 [IST]
English summary
Hero destini 125 sales cross 26000 units with 76 percent growth
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+