ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 650 కిమీ ప్రయాణం.. ధర కేవలం రూ. 56 వేలే.. పేదలు సైతం కొనే బైక్

భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజలకు బైక్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు హీరో మోటోకార్ప్(Hero MotoCorp). అతి తక్కువ ధర, అదిరిపోయే మైలేజీతో సామాన్యుడి సొంతిల్లు కల కంటే ముందు బైక్ కలను నెరవేరుస్తున్న కారు చౌక బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe). ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాల్లో ఈ బైక్ మరోసారి తన సత్తా చాటింది. కేవలం ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఏకంగా 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్ వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

భారతీయ మార్కెట్లో ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్‌లకు నిరంతరం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలో దొరకడం, మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం, లీటర్ పెట్రోల్‌కు ఎక్కువ దూరం ప్రయాణించడం అనేవి ఈ బైక్‌ల ప్రధాన లక్షణాలు. ఈ రెండు అంశాలను సమర్థవంతంగా అందిస్తున్న బైక్ ఏదైనా ఉందంటే అది హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మాత్రమే.

Hero HF Deluxe 650 KM Range in Single Tank at Just Rs 56 000

గడచిన 2025 డిసెంబర్ నెలలో ఈ బైక్ అమ్మకాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఒక్క నెలలోనే ఏకంగా 49,051 యూనిట్లు అమ్ముడై, గతేడాది కంటే 17.59 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ద్విచక్ర వాహనాల జాబితాలో ఇది 7వ స్థానంలో నిలిచింది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌లో 97.2 సీసీ, ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5.9 Kw పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్ బాక్స్ అనుసంధానం చేయబడింది.

Hero HF Deluxe 650 KM Range in Single Tank at Just Rs 56 000

ఈ బైక్ బరువు కేవలం 112 కిలోలు మాత్రమే ఉండటం వల్ల రద్దీగా ఉండే నగరాల్లో కూడా సులభంగా నడపవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ, సీటు ఎత్తు 805 మిమీగా ఉంటుంది. తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా ఈ బైక్‌ను చాలా సులభంగా, భద్రంగా నడపగలిగేలా దీనిని రూపొందించారు.

ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసే మైలేజీ విషయానికి వస్తే.. హీరో కంపెనీ అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ బైక్ లీటరుకు సుమారు 68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 9.6 లీటర్లు. అంటే, మీరు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే దాదాపు 652.8 కిలోమీటర్ల దూరం నిరాటంకగా ప్రయాణించవచ్చు.

ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే చాలు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి మళ్ళీ వెనక్కి రావడానికి సరిపోతుందన్నమాట. ఇంత తక్కువ ధరకు ఇంతటి మైలేజీ ఇచ్చే బైక్ మరొకటి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Hero HF Deluxe 650 KM Range in Single Tank at Just Rs 56 000

ధర విషయానికి వస్తే.. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రారంభ ధర కేవలం రూ.56,742 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. టాప్ వేరియంట్ ధర కూడా రూ.69,235 లోపే ఉంటుంది. కేవలం మన దేశంలోనే కాదు, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాలకు ఈ బైక్ భారత్ నుంచి ఎగుమతి అవుతోంది.

హోండా షైన్ 100 వంటి బైక్‌లకు ఇది గట్టి పోటీనిస్తోంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ఆఫీసుకో లేదా కాలేజీకో వెళ్లడానికి మంచి మైలేజీ ఇచ్చే బైక్ కోసం చూస్తుంటే.. కళ్లు మూసుకుని హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌ను ఎంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, January 24, 2026, 14:48 [IST]
English summary
Hero hf deluxe 650 km range in single tank at just rs 56 000
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+