లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీ.. ధర చూస్తే రూ. 60 వేల లోపే.. పేదవాడి కడుపు నింపే బైక్ ఇదే
మధ్యతరగతి భారతీయులకు బైక్ అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది ఒక పొదుపు మార్గం కూడా. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలని కోరుకునే సామాన్యులకు ఇప్పుడు హీరో మోటోకార్ప్ ఒక అద్భుతమైన వరాన్ని అందిస్తోంది. అదే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe). హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి దిగ్గజ బైక్‌ల కంటే దాదాపు 10 వేల రూపాయల తక్కువ ధరకే లభిస్తూ, లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ ఈ బైక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలో ఈ బైక్ సాధించిన విక్రయాల గణాంకాలు చూస్తుంటే ఆటోమొబైల్ దిగ్గజాలే విస్తుపోతున్నాయి.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కేవలం ధరలో మాత్రమే కాదు, అమ్మకాల్లోనూ తన సత్తా చాటుతోంది. తాజాగా వెలువడిన 2026 జనవరి సేల్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్క నెలలోనే ఏకంగా 71,690 బైక్‌లు అమ్ముడయ్యాయి. గత ఏడాది (2025 జనవరి) తో పోలిస్తే ఇది 15.21 శాతం వృద్ధి. అంటే గతేడాది కంటే సుమారు 9,467 బైక్‌లు అదనంగా విక్రయించబడ్డాయి. ఈ ఘనతతో 2026 జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 బైక్‌ల జాబితాలో హెచ్ఎఫ్ డీలక్స్ 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ తర్వాత స్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

హెచ్ఎఫ్ డీలక్స్ ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం దాని ధర. ప్రస్తుతం భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర కేవలం రూ. 56,742 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. టాప్ వేరియంట్ ధర కూడా రూ. 69,235 లోపే ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థుల ధరలతో పోలిస్తే ఇది ఎంత తక్కువో తెలుసా ?
బజాజ్ ప్లాటినా 100: దీని ప్రారంభ ధర రూ. 66,015. అంటే హెచ్ఎఫ్ డీలక్స్ దీని కంటే రూ. 9,273 తక్కువ.
హోండా షైన్ 100: దీని ప్రారంభ ధర రూ. 65,243. అంటే హెచ్ఎఫ్ డీలక్స్ దీని కంటే రూ. 8,501 తక్కువ.
ఈ స్థాయిలో ధర వ్యత్యాసం ఉండటం మధ్యతరగతి వినియోగదారులకు పెను లాభంగా మారింది. జేబుకు చిల్లు పడకుండా, బ్రాండెడ్ బైక్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

సామాన్యుడు బైక్ కొనే ముందు అడిగే మొదటి ప్రశ్న మైలేజీ ఎంతిస్తుంది? అని. ఈ విషయంలో హెచ్ఎఫ్ డీలక్స్ ఏ మాత్రం తగ్గదు. ఇది అఫీషియల్‌గా లీటరుకు 68 కిలోమీటర్ల (ARAI) మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతున్నా, సాధారణ రోడ్లపై జాగ్రత్తగా నడిపితే దాదాపు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని వినియోగదారుల ఫీడ్‌బ్యాక్. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇంతటి మైలేజీ ఇచ్చే బైక్ ఉంటే, నెలకు పెట్రోల్ ఖర్చుపై భారీగా ఆదా చేసుకోవచ్చు.
తక్కువ ధర అంటే ఫీచర్లు ఉండవని అనుకోకండి. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ సుదీర్ఘ కాలం మన్నిక ఇచ్చేలా రూపొందించబడింది. ఇందులో 97.2 సిసి ఎయిర్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజిన్ ఉంది. ఇది 8.02 PS పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో ఐ3ఎస్ (i3S) టెక్నాలజీ ఉంది, ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆపివేసి, ఇంధనాన్ని ఆదా చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని కఠినమైన రోడ్లపై కూడా ఈ బైక్ ఎంతో సాఫీగా సాగుతుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండటం దీనికి అదనపు బలం.


Click it and Unblock the Notifications








