చరిత్ర మర్చిపోని బ్రాండ్.. రికార్డులు తిరగరాస్తున్న హీరో.. కూలీ నుంచి ఆఫీసర్ వరకు అందరికీ ఇవే కావాలి!

భారతదేశంలో టూవీలర్ మార్కెట్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp). దేశపు అతిపెద్ద టూవీలర్ తయారీదారుగా ఉన్న ఈ సంస్థ, అమ్మకాల పరంగా మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. హోండా, టీవీఎస్ వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులకు చేరువవుతూ హీరో మోటోకార్ప్ దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 అమ్మకాల గణాంకాలు ఈ జోరును మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ నెలలో కంపెనీ మొత్తం 5,58,216 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 3,88,068 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 44 శాతం భారీ వృద్ధి.

ఏడాదిలో ఇంత పెద్ద పెరుగుదల సాధించడం కంపెనీ మార్కెట్ బలం, డీలర్ నెట్‌వర్క్, విశ్వాసానికి నిదర్శనం. కేవలం డిస్పాచ్‌లలోనే కాదు, రిటైల్ అమ్మకాలలో అదే ఉత్సాహం కనిపిస్తోంది. వాహన్ పోర్టల్‌లో నమోదు అయిన వాహనాల సంఖ్య 4,58,346కి చేరింది. ఇది మార్కెట్లో నిజమైన డిమాండ్ బలంగా ఉన్నదనే సంకేతం. మార్చి 1, 2026 నాటికి అందుబాటులో ఉన్న డేటా(తెలంగాణ మినహా) ఆధారంగా సంవత్సరానికి 18 శాతం రిటైల్ వృద్ధి నమోదైంది.

Hero Motocorp February 2026 Sold 558216 Units More Details

అంటే డీలర్‌షిప్‌ల నుంచి వాహనాలు బయటకు వెళ్లడమే కాకుండా, వినియోగదారుల చేతుల్లోకి వేగంగా చేరుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు హీరో బైకులు, స్కూటర్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన మైలేజ్, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ ఇవన్నీ కలిసి కంపెనీకి అదనపు బలం అందిస్తున్నాయి. ఫిబ్రవరి 2026లో నమోదైన ఈ అంకెలు మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నదనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.

దేశీయ మార్కెట్లో బలమైన ప్రదర్శన కనబరుస్తూనే, అంతర్జాతీయ రంగంలో కూడా హీరో మోటోకార్ప్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఫిబ్రవరి 2026లో కంపెనీ ఎగుమతులు 41,248 యూనిట్లకు చేరడం దీని స్పష్టమైన ఉదాహరణ. గత సంవత్సరం ఇదే కాలంలో విదేశాలకు పంపిన 30,772 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 34 శాతం పెరుగుదల. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు, హీరో అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బలంగా నిలబడుతున్నదనే సంకేతం.

Hero Motocorp February 2026 Sold 558216 Units More Details

ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పలు దేశాల్లో హీరో బైకులకు పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన ఇంధన సామర్థ్యం వంటి అంశాలు విదేశీ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఇదే స్థాయిలో పెరగడం కంపెనీకి మరింత బలం ఇచ్చింది.

ముఖ్యంగా మోటార్‌సైకిళ్ల విభాగంలో కంపెనీ భారీ దూకుడు చూపించింది. ఆ నెలలో బైక్‌ల మొత్తం వాల్యూమ్‌లు 4,99,756 యూనిట్లకు చేరుకోవడం గమనార్హం. గత సంవత్సరం ఫిబ్రవరిలో నమోదైన 3,52,312 యూనిట్లతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. అంటే బైక్ సెగ్మెంట్‌లోనే లక్షకు పైగా అదనపు యూనిట్లు అమ్ముడవడం కంపెనీ మార్కెట్ బలాన్ని ప్రతిబింబిస్తోంది.

Hero Motocorp February 2026 Sold 558216 Units More Details

స్కూటర్ విభాగం కూడా వెనుకబడలేదు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 35,756 యూనిట్లు నమోదైతే, ఈసారి ఆ సంఖ్య 58,460 యూనిట్లకు పెరిగింది. ఇక ఎలక్ట్రిక్ విభాగంలో కూడా హీరో తన ఉనికిని బలపరుస్తోంది. హీరో స్వతంత్ర ఎలక్ట్రిక్ సబ్-బ్రాండ్ అయిన Vida ఈ నెలలో 12,514 రిజిస్ట్రేషన్లు నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే దీని మార్కెట్ వాటా మూడు రెట్లు పెరగడం విశేషం.

More from DriveSpark

Article Published On: Wednesday, March 4, 2026, 16:44 [IST]
English summary
Hero motocorp february 2026 sold 558216 units more details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+