దేశంలో ఎక్కువ మంది ఇంటి ముందున్న బైక్ బ్రాండ్ ఇదే.. ఊరైనా.. సిటీయైనా.. హీరో అంతే!
ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్స్ తయారీదారుగా గుర్తింపు పొందిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) చాలా కాలంగా అమ్మకాలో అగ్రస్థానంలో నిలుస్తుంది. తాజాగా విడుదల అయిన జూన్ నెలలో దేశీయంగా హీరో అదిరిపోయే అమ్మకాలను నమోదు చేసి టాప్‌లో నిలిచింది. సేల్స్ నివేదిక ప్రకారం, కంపెనీ జూన్ 2026లో మొత్తం 5,02,890 మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించి దేశీయ అమ్మకాలలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. 2025 జూన్‌లో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 5,25,136 యూనిట్లు ఉండగా, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ సారి 22,246 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. శాతాల లెక్కన ఇది దాదాపుగా 4.24 శాతం తగ్గుదలగా చెప్పొచ్చు.
2026 మే నెలతో పోలిస్తే జూన్‌లో హీరో అమ్మకాలు 6.31 శాతం తగ్గాయి. సీజనల్ డిమాండ్‌లో మార్పులు, మార్కెట్ పరిస్థితులు, ఇతర బ్రాండ్ల నుంచి పెరుగుతున్న పోటీ స్వల్ప తగ్గుదలకు కారణంగా భావిస్తున్నారు. 2026 మే నెలలో అమ్మకాలు 5,36,784 యూనిట్లుగా నమోదు కాగా గత నెలలో కాస్త అమ్మకాలు 33,894 యూనిట్లు తక్కువగా నమోదు అయి మొత్తం దేశీయంగా సేల్స్ 5,02,890 యూనిట్లకు పరిమితమయ్యాయి.

అయితే కేవలం దేశీయ అమ్మకాలనే కాకుండా ఎగుమతులను కూడా కలిపి పరిశీలిస్తే టూవీలర్ తయారీ సంస్థల ర్యాంకింగ్ పూర్తిగా మారిపోతుంది. భారత మార్కెట్‌లో రిటైల్ అమ్మకాల పరంగా హీరో మోటోకార్ప్ ముందంజలో ఉన్నప్పటికీ, దేశీయ అమ్మకాలతో పాటు విదేశీ మార్కెట్లకు చేసిన ఎగుమతులను కూడా కలిపి లెక్కిస్తే టీవీఎస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంటే భారత మార్కెట్‌లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ టీవీఎస్ సత్తా చాటుతుంది.
దీనికి కారణం టీవీఎస్ సాధించిన భారీ ఎగుమతులే. 2026 జూన్ నెలలో కంపెనీ ఏకంగా 1,54,403 టూవీలర్ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది ఆ నెలలో ఇతర ప్రధాన తయారీ సంస్థలతో పోలిస్తే చాలా ఎక్కువ. అదే కాలంలో హోండా 59,325 యూనిట్లను, హీరో మోటోకార్ప్ 38,269 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేశాయి. దీంతో టీవీఎస్ తన ప్రత్యర్థుల కంటే రెండింతలకుపైగా ఎగుమతులు నమోదు చేసింది.

ఎగుమతుల్లో వచ్చిన ఈ భారీ ఆధిక్యం టీవీఎస్ మొత్తం అమ్మకాలపై కూడా స్పష్టమైన ప్రభావం చూపింది. దేశీయ అమ్మకాలు, విదేశీ ఎగుమతులు రెండింటినీ కలిపి చూస్తే కంపెనీ మొత్తం అమ్మకాలు 5,65,417 యూనిట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో హీరో మొత్తం అమ్మకాలు 5,41,159 యూనిట్లు, హోండా మొత్తం అమ్మకాలు 5,28,281 యూనిట్లు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం అమ్మకాల పరంగా టీవీఎస్ ఈ రెండు దిగ్గజ సంస్థలను వెనక్కి నెట్టింది.
ఎగుమతుల పరంగా హీరో వెనకబడినప్పటికి కూడా దేశీయంగా బలమైన కస్టమర్లు ఈ కంపెనీకి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ మార్కెట్ల వరకు విస్తరించిన డీలర్ నెట్‌వర్క్, విడిభాగాలు సులభంగా లభ్యమవడం, అందుబాటు ధరలు, విశ్వసనీయమైన మోడళ్ల కారణంగా భారతీయ ప్రజల హీరోకు ఆదరణను కొనసాగిస్తున్నారు. అందుకే టూవీలర్ వాహనాల మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ మధ్య కూడా హీరో మోటోకార్ప్ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకుంటుంది.

రానున్నది పండగల సీజన్ కాబట్టి, ఆ సమయంలో హీరో కంపెనీ నుంచి వివిధ ఆఫర్స్, డిస్కౌంట్స్, డీలర్ స్థాయిలో అందించే ప్రత్యేక తగ్గింపుల కారణంగా కొత్త కస్లమర్లు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కంపెనీ ఎగుమతులు ఇంకా పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ అమ్మకాలు గణంకాలు చెబుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కూడా హీరో మోటోకార్ప్ విడా బ్రాండ్ ద్వారా తన ఉనికిని గట్టిగా తెలియజేస్తోంది.


Click it and Unblock the Notifications