ఇండియాలో దీన్ని మించిన బైక్ చూపించలేరు.. దేశాన్నే కైవసం చేసుకుంది! ప్రతి రోజూ వేల బైక్స్ అమ్మకం

భారతీయుల దైనందిన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయిన బైక్‌లలో ఒకటి హీరో స్పెండ్లర్ (Hero Splendor). సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఈ బైక్, జాతీయ బైక్ అన్న పేరు తెచ్చుకోవడం యాదృచ్ఛికం కాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్, సింపుల్ మెయింటెనెన్స్, నమ్మకమైన పనితీరు ఈ మూడు లక్షణాలు స్ప్లెండర్‌ను కోట్లాది భారతీయుల మొదటి ఎంపికగా నిలబెట్టాయి. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరిలో ఈ బైక్ నమోదు చేసిన అమ్మకాలు చూస్తే, స్ప్లెండర్ ప్రభావం ఎంత గొప్పదో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 3,21,952 యూనిట్లు అమ్ముడవడం చిన్న విషయం కాదు. అంటే ప్రతి రోజు సగటున 10,700కు పైగా బైక్‌లు రోడ్డెక్కుతున్నాయంటే, ఇది ఒక రికార్డ్ స్థాయి డిమాండ్‌గా చెప్పాలి.

ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కావు, భారతీయ వినియోగదారుల నమ్మకానికి నిదర్శనం. గత ఏడాది ఫిబ్రవరిలో అమ్ముడైన 2,07,763 యూనిట్లతో పోలిస్తే, ఈసారి దాదాపు 55 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం. అంటే ఒక్క ఏడాదిలోనే లక్షకు పైగా అదనపు యూనిట్లు అమ్ముడవడం ద్వారా హీరో మోటోకార్ప్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. స్ప్లెండర్ విజయానికి కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

Hero Splendor February 2026 Sales Reported 321952 Units More Details Inside

పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ కాలంలో, మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూసే ప్రతి ఒక్కరికీ ఇది సరైన ఆప్షన్‌గా నిలుస్తోంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ సమానంగా ఉపయోగపడే సౌలభ్యం దీనికి పెద్ద ప్లస్. రిపేర్ ఖర్చులు తక్కువగా ఉండటం, స్పేర్ పార్ట్స్ సులభంగా లభించడం వంటి అంశాలు కూడా దీనిని మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి.

ఇలా చూస్తే, హీరో స్పెండ్లర్ కేవలం ఒక బైక్ కాదు, భారతీయ మధ్యతరగతి కుటుంబాల విశ్వాసానికి ప్రతీకగా మారింది. గత ఆరు సంవత్సరాలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనంగా నిలవడం కూడా దీని స్థిరమైన విజయాన్ని స్పష్టం చేస్తోంది. కాలం మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా, స్ప్లెండర్‌పై ప్రజల నమ్మకం మాత్రం అలాగే కొనసాగుతుండటం నిజంగా విశేషమే. ఇది విభిన్న అవసరాలకు సరిపోయేలా మూడు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Hero Splendor February 2026 Sales Reported 321952 Units More Details Inside

ప్రస్తుతం మార్కెట్లో స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ XTEC, సూపర్ స్ప్లెండర్ XTEC అనే మూడు మోడళ్లు లభిస్తున్నాయి. వీటిలో స్ప్లెండర్ ప్లస్, ప్లస్ XTEC 100cc సెగ్మెంట్‌లో ఉండగా, సూపర్ స్ప్లెండర్ XTEC మాత్రం 125cc సెగ్మెంట్‌లోకి వస్తుంది. ఈ విభజన వల్లే ప్రతి సెగ్మెంట్‌లోనూ మంచి డిమాండ్‌ను సంపాదించగలిగింది హీరో. స్ప్లెండర్ ప్లస్ మోడల్‌ను తీసుకుంటే i3S టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ.

ట్రాఫిక్‌లో బైక్ ఆగినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ అయి, క్లచ్ కొట్టగానే మళ్లీ ఆన్ అవడం వల్ల పెట్రోల్ సేవింగ్‌లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి తోడు అల్లాయ్ వీల్స్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 74,902 నుంచి ప్రారంభమవుతుంది. కొంచెం ఆధునికత కోరుకునే వారికి స్ప్లెండర్ ప్లస్ XTEC మంచి ఆప్షన్. ఈ మోడల్ ధర రూ. 78,428 నుంచి ప్రారంభమవుతుంది.

Hero Splendor February 2026 Sales Reported 321952 Units More Details Inside

ఇంకా కొంచెం ఎక్కువ పవర్, పనితీరు కోరుకునే వారికి సూపర్ స్ప్లెండర్ XTEC సరైన ఎంపికగా నిలుస్తోంది. 125cc ఇంజన్‌తో వచ్చే ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉండటం వల్ల హైవే డ్రైవింగ్‌లో కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అదనపు సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 83,448 నుంచి ప్రారంభమవుతుంది.

మైలేజీ విషయంలో కూడా స్ప్లెండర్ సరీస్ తన సత్తాను కొనసాగిస్తోంది. 100cc మోడళ్లు లీటరుకు 70 కి.మీ.లకు పైగా మైలేజ్ ఇవ్వగలవని చెప్పబడుతుండగా, 125cc సూపర్ స్ప్లెండర్ కూడా లీటరుకు సుమారు 65 కి.మీ. మైలేజ్ అందించడం విశేషం. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ కాలంలో, ఈ రేంజ్ మైలేజ్ వినియోగదారులకు పెద్ద ఉపశమనంగా మారుతోంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 26, 2026, 13:04 [IST]
English summary
Hero splendor february 2026 sales reported 321952 units more details inside
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+