రోడ్లపై మళ్ళీ స్ప్లెండర్ హవా.. ఒక్క నెలలో 3.33 లక్షల బైకుల విక్రయం.. నంబర్-1గా రికార్డు

భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో గత నెల (మార్చి 2026) సేల్స్ లెక్కలు తేలాయి. ఎప్పటిలాగే సామాన్యుడి నేస్తం హీరో స్ప్లెండర్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, ఇతర కంపెనీల బైకులు, స్కూటర్లు కూడా పోటాపోటీగా అమ్ముడయ్యాయి. ఈ మార్చి నెలలో టాప్-10 స్థానాల్లో నిలిచిన వాహనాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హీరో స్ప్లెండర్ (Hero Splendor)
భారతదేశంలో టూ-వీలర్ అంటే మొదట గుర్తొచ్చే పేరు హీరో స్ప్లెండర్. మార్చి 2026లో ఈ బైక్ ఏకంగా 3,32,227 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అంటే రోజుకు సగటున 10 వేలకు పైగా బైకులు అమ్ముడయ్యాయన్నమాట. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 3.01 శాతం వృద్ధి సాధించింది. దీని మైలేజీ, మెయింటెనెన్స్ తక్కువ కావడమే ఈ రేంజ్ సక్సెస్ కు కారణం. మధ్యతరగతి ప్రజలకు ఇది ఇప్పటికీ మొదటి ఛాయిస్ గా నిలుస్తోంది.

Hero Splendor Remains Indias No 1 Two-Wheeler 3 33 Lakh Units Sold in 31 Days

హోండా యాక్టివా (Honda Activa)
స్కూటర్ల సెగ్మెంట్లో తిరుగులేని రాజు హోండా యాక్టివా. ఈసారి యాక్టివా అమ్మకాలు ఏకంగా 36.86 శాతం పెరగడం విశేషం. మొత్తం 2,59,670 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇంటిల్లిపాదీ సులభంగా నడపగలిగే ఫీచర్లు, రీసేల్ వాల్యూ బాగుండటంతో పట్టణాల్లో దీని డిమాండ్ విపరీతంగా పెరిగింది. టాప్-10 లిస్టులో రెండో స్థానంలో నిలిచి తన పట్టును నిరూపించుకుంది.

హోండా షైన్ (Honda Shine)
125 సిసి బైక్ సెగ్మెంట్లో హోండా షైన్ మెరుపులు మెరిపిస్తోంది. గత నెలలో 1,73,098 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే 14.53 శాతం అమ్మకాలు పెరిగాయి. ఆఫీసు వెళ్లే వారికి, స్మూత్ రైడింగ్ కోరుకునే వారికి షైన్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ముఖ్యంగా సెల్ఫ్ స్టార్ట్, డిస్క్ బ్రేక్ వంటి ఆధునిక ఫీచర్లు దీనికి ప్లస్ పాయింట్లు.

Hero Splendor Remains Indias No 1 Two-Wheeler 3 33 Lakh Units Sold in 31 Days

బజాజ్ పల్సర్ (Bajaj Pulsar)
యువత క్రేజ్ బజాజ్ పల్సర్ ఈసారి 24.29 శాతం వృద్ధి సాధించి 1,32,248 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. పల్సర్ సిరీస్ లో 125 సిసి నుండి 250 సిసి వరకు రకరకాల మోడల్స్ ఉండటంతో స్టూడెంట్స్ నుంచి ఎంప్లాయీస్ వరకు అందరూ దీనివైపు మొగ్గు చూపుతున్నారు. స్పోర్టీ లుక్, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ దీని ప్రత్యేకత.

టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter)
హోండా యాక్టివాకు గట్టి పోటీనిచ్చే టీవీఎస్ జుపిటర్ 1,24,771 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు 17.89 శాతం పెరిగాయి. పెద్ద చక్రాలు, బయటే పెట్రోల్ కొట్టించుకునే సదుపాయం ఉండటం జుపిటర్ కు పెద్ద బలం. స్కూటర్లలో ఇది రెండో అత్యధిక అమ్మకాలు కలిగిన మోడల్ గా నిలిచింది.

Hero Splendor Remains Indias No 1 Two-Wheeler 3 33 Lakh Units Sold in 31 Days

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
స్ప్లెండర్ తర్వాత అత్యంత సరసమైన బైక్ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్. ఇది 85,088 యూనిట్ల విక్రయాలతో ఆరో స్థానంలో ఉంది. 7.33 శాతం గ్రోత్ సాధించింది. పల్లెటూళ్లలో, ఎక్కువ దూరం తిరిగే వారికి ఇది ఎంతో నమ్మకమైన వాహనం. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ కావాలనుకునే వారు దీనిని ఎంచుకుంటున్నారు.

సుజుకి యాక్సెస్ (Suzuki Access)
సుజుకి కంపెనీకి చెందిన యాక్సెస్ 125 స్కూటర్ 72,658 యూనిట్లతో ఏడో స్థానంలో ఉంది. దీని అమ్మకాలు 9.49 శాతం పెరిగాయి. క్లాసిక్ లుక్, పవర్ ఫుల్ 125 సిసి ఇంజిన్ దీనిని ప్రీమియం స్కూటర్ల విభాగంలో ముందుంచింది. ఫ్యామిలీస్ కి ఇది బాగా నచ్చే మోడల్.

Hero Splendor Remains Indias No 1 Two-Wheeler 3 33 Lakh Units Sold in 31 Days

టీవీఎస్ అపాచీ (TVS Apache)
స్పోర్ట్స్ బైక్ విభాగంలో అపాచీ తన సత్తా చాటుతోంది. 47,081 యూనిట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. రేసింగ్ డీఎన్‌ఏ కలిగిన ఈ బైక్ యూత్ లో చాలా పాపులర్. 6.48 శాతం వృద్ధితో నిలకడైన అమ్మకాలను నమోదు చేస్తోంది.

టీవీఎస్ XL100 (TVS XL100)
భారతదేశంలో ఏకైక మోపెడ్ గా నిలిచిన టీవీఎస్ XL100 భారీ వృద్ధిని సాధించింది. ఏకంగా 31.30 శాతం అమ్మకాలు పెరిగి 46,192 యూనిట్లకు చేరింది. వ్యాపారస్తులు, చిన్న పాటి లోడ్లు మోసే వారికి ఇది నమ్మకమైన నేస్తం. దీనికి ఇప్పటికీ గ్రామాల్లో ఫుల్ డిమాండ్ ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)
ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ రికార్డు సృష్టించింది. 46.26 శాతం వృద్ధితో 38,757 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసి టాప్-10లో చోటు దక్కించుకుంది. పెట్రోల్ స్కూటర్లకు ఇది గట్టి ప్రత్యామ్నాయంగా మారుతోంది. తక్కువ మెయింటెనెన్స్, స్మార్ట్ ఫీచర్లు దీనికి ప్రధాన ఆకర్షణ.

More from DriveSpark

Article Published On: Friday, April 17, 2026, 17:39 [IST]
English summary
Hero splendor remains indias no 1 two wheeler 3 33 lakh units sold in 31 days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+