దేశంలోని ప్రతి కుటుంబం నమ్మకం.. కేవలం 30 రోజుల్లోనే 2.91 లక్షల బైకులు కొనేశారు

భారత టూ వీలర్ మార్కెట్లో ఎన్ని కొత్త బైకులు వచ్చినా, ఎన్ని మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంట్రీ ఇచ్చినా హీరో స్ప్లెండర్ (Hero Splendor) రేంజే వేరు. సామాన్యుడికి అత్యంత నమ్మకమైన వాహనంగా పేరు తెచ్చుకున్న ఈ బైక్, సేల్స్ పరంగా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. గడిచిన ఏప్రిల్ 2026 నెలలో భారతీయ బైక్ లవర్స్ హీరో స్ప్లెండర్‌పై కాసుల వర్షం కురిపించారు. కేవలం ఒక్క నెలలోనే ఈ మోడల్ సాధించిన అమ్మకాలు చూస్తే ఆటోమొబైల్ రంగానికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

నమ్మకమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో దూసుకుపోయే హీరో స్ప్లెండర్ గడిచిన ఏప్రిల్ నెలలో ఏకంగా 2,91,146 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది (ఏప్రిల్ 2025) ఇదే నెలలో జరిగిన 1,85,635 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 57 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, రోజువారీ ఆఫీసులకు వెళ్లేవారికి ఈ బైక్ ఇప్పటికీ ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోందని ఈ రికార్డు స్థాయి అమ్మకాలు మరోసారి రుజువు చేశాయి.

Hero Splendor Rules India 2 91 Lakh Bikes Sold In Just 30 Days

ఈ అమ్మకాల లిస్టులో రెండో స్థానాన్ని హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (HF Deluxe) కైవసం చేసుకుంది. ఈ చౌకైన బైక్‌ను ఏప్రిల్ నెలలో 91,977 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు ఏకంగా 121 శాతం పెరగడం విశేషం. ఇక మూడో స్థానంలో నిలిచిన హీరో గ్లామర్ (Hero Glamour) అయితే 438 శాతం బంపర్ గ్రోత్‌తో 26,573 యూనిట్ల అమ్మకాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాలుగో స్థానంలో ఉన్న హీరో ప్యాషన్ (Hero Passion) కూడా 100 శాతం వృద్ధితో 20,367 బైకులను అమ్మి సత్తా చాటింది.

కేవలం బైకులు మాత్రమే కాదు, స్కూటర్ల విభాగంలోనూ హీరో మోటోకార్ప్ దుమ్మురేపుతోంది. ఐదో స్థానంలో నిలిచిన హీరో డెస్టినీ 125 (Destini 125) స్కూటర్ ఏకంగా 489 శాతం భారీ వృద్ధితో 25,861 యూనిట్ల సేల్స్ జరిపింది. యువతను ఆకట్టుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 125R (Xtreme 125R) 19,757 యూనిట్లతో ఆరో స్థానంలో, సూపర్ స్ప్లెండర్ 17,985 యూనిట్లతో ఏజో స్థానంలో నిలిచాయి.

Hero Splendor Rules India 2 91 Lakh Bikes Sold In Just 30 Days

ఇక ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో హీరో ప్రీమియం బ్రాండ్ హీరో విడా (Hero Vida) ఎలక్ట్రిక్ స్కూటర్ 129 శాతం గ్రోత్‌తో 16,291 యూనిట్ల అద్భుతమైన అమ్మకాలను సాధించి ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకుంది. చివరిగా తొమ్మిది, పది స్థానాల్లో హీరో ప్లెజర్ (8,920 యూనిట్లు), హీరో జూమ్ (7,201 యూనిట్లు) నిలిచాయి.

దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ హవా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి కంపెనీ ఓవరాల్ అమ్మకాలే సాక్ష్యం. ఏప్రిల్ 2026లో హీరో కంపెనీ ఇండియాలో మొత్తం 5,32,433 టూ వీలర్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్ 2025లో జరిగిన 2,88,524 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 85 శాతం భారీ లాభం. మార్చి 2026 నాటి అమ్మకాలతో పోలిస్తే కేవలం 4 శాతం స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, ఇండియన్ మార్కెట్లో నంబర్-1 టూ-వీలర్ బ్రాండ్‌గా హీరో తన పట్టును మరింత బలంగా మార్చుకుంది.

Article Published On: Sunday, May 24, 2026, 16:50 [IST]
English summary
Hero splendor rules india 2 91 lakh bikes sold in just 30 days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+