పెళ్లికూతురిలా అందంగా ముస్తాబై వచ్చిన మధ్యతరగతి బండి.. 72 కిమీ మైలేజ్, బ్లూటూత్ ఫీచర్లు

భారత మధ్యతరగతి బైక్ లవర్స్ అత్యంత ఎక్కువగా ఇష్టపడే 125cc బైక్ సెగ్మెంట్‌లో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద టూ-వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), మార్కెట్లో తన తిరుగులేని పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు మోస్ట్ పాపులర్ సూపర్ స్ప్లెండర్ సిరీస్‌లో సరికొత్త అప్‌గ్రేడెడ్ మోడల్‌ను లాంచ్ చేసింది. దీనికి హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 (Hero Super Splendor XTEC 2.0) అని పేరు పెట్టారు.

1994 నుంచి దేశంలోని కోట్ల మందికి నమ్మకమైన ప్రయాణ సాధనంగా నిలిచిన స్ప్లెండర్ బ్రాండ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, నేటి తరం యువతకు నచ్చేలా అదిరిపోయే టెక్నాలజీ, మైండ్ బ్లోయింగ్ మైలేజ్, సరికొత్త మోడ్రన్ డిజైన్‌తో ఈ బైక్‌ను దేశీయ మార్కెట్లోకి దించారు.

hero super splendor xtec 2 0 bike launched in india price specs mileage features telugu

మధ్యతరగతి జేబుకు చిల్లు పడకుండా ఉండటం కోసం హీరో సంస్థ ఈ నయా ఎడిషన్ ధరను చాలా రీజనబుల్‌గా సెట్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కేవలం రూ.86,500గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ అఫీషియల్ డీలర్‌షిప్‌లలో ఈ బైక్ అమ్మకాలకు సిద్ధంగా ఉంది.

పెర్ఫార్మెన్స్, మైలేజ్ విషయానికి వస్తే హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 తన సెగ్మెంట్‌లో కింగ్ అనిపించుకునేలా డిజైన్ చేయబడింది. ఇందులో అత్యంత విశ్వసనీయమైన 124.7cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 7500 ఆర్‌పీఎమ్ వద్ద 10.7 bhp పవర్, 6000 ఆర్‌పీఎమ్ వద్ద 10.6 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో కూడా ఎంతో స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చేలా దీనిని ట్యూన్ చేశారు.

hero super splendor xtec 2 0 bike launched in india price specs mileage features telugu

ఈ బైక్‌లోని అసలైన హైలైట్ ఏంటంటే.. ఇది తన సెగ్మెంట్‌లో ఎవరికీ సాధ్యంకాని విధంగా ఏకంగా లీటరుకు 72 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇందుకోసం ఇందులో అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (APFI), హీరో ఐకానిక్ ఐ3ఎస్ (i3S - Idle Stop-Start System) టెక్నాలజీని ఉపయోగించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బైక్ ఐడిల్‌గా ఉన్నప్పుడు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది, మళ్లీ క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుంది.

దీనికి తోడుగా ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) వల్ల బైక్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి కిర్రుమనే శబ్దాలు రాకుండా, చాలా సైలెంట్‌గా ఇంజన్ ఆన్ అవుతుంది. సేఫ్టీ విషయంలో హీరో ఈసారి చాలా పెద్ద పీట వేసింది. ఈ సిరీస్‌లోనే మొదటిసారిగా హజార్డ్ లైట్స్ (Hazard Lights) ఫీచర్‌ను ప్రవేశపెట్టారు.

hero super splendor xtec 2 0 bike launched in india price specs mileage features telugu

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో లేదా బైక్ బ్రేక్‌డౌన్ అయినప్పుడు ఈ స్విచ్ ఆన్ చేస్తే బైక్‌లోని నాలుగు ఇండికేటర్లు ఒకేసారి బ్లింక్ అవుతాయి. ఇది వెనుక, ముందు వచ్చే వాహనదారులకు సులభంగా అలర్ట్ ఇస్తుంది. రైడర్ల సేఫ్టీ కోసం ముందు చక్రానికి పవర్‌ఫుల్ డిస్క్ బ్రేక్, హ్యాండిల్‌బార్‌పైనే ఇంజన్ కిల్ స్విచ్ అందించారు.

ఇక టెక్నాలజీ పరంగా.. ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ చేసే ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలదు. మీ స్మార్ట్‌ఫోన్‌ను దీనికి కనెక్ట్ చేసుకుంటే.. రైడింగ్ చేసేటప్పుడు వచ్చే ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్స్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్లు, మిస్డ్ కాల్స్, కాలర్ ఐడీ, మీ ఫోన్ బ్యాటరీ స్టేటస్ కూడా బైక్ స్క్రీన్‌పైనే క్లియర్ గా చూసుకోవచ్చు.

కస్టమర్ల సౌకర్యార్థం ఇందులో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ (RTMi), లో-ఫ్యూయల్ వార్నింగ్ లైట్, లాంగ్ జర్నీలలో మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి హ్యాండిల్ బార్ వద్దనే యూఎస్‌బీ టైప్-సి (USB Type-C) ఛార్జింగ్ పోర్టును కూడా ఏర్పాటు చేశారు.

రోజూ ఆఫీసులకు, కాలేజీలకు లాంగ్ జర్నీ చేసే వారి సౌకర్యం కోసం దీని ఎర్గోనామిక్స్ చాలా అద్భుతంగా మార్చారు. వెడల్పైన హ్యాండిల్‌బార్ వల్ల రైడర్ వెన్నునొప్పి రాకుండా స్ట్రెయిట్‌గా కూర్చోవచ్చు. రైడర్, వెనుక కూర్చునే పిలియన్ ప్యాసింజర్ ఇద్దరికీ సరిపోయేలా సోఫా లాంటి పొడవైన, మెత్తటి లగ్జరీ డ్యూయల్-టెక్స్చర్డ్ స్టిచ్డ్ సీటును ఇచ్చారు.

దారుణమైన గుంతల రోడ్లలో కూడా ఈజీగా ప్రయాణించడానికి టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక కూర్చునే వారికి గ్రిప్ కోసం వెడల్పైన రియర్ గ్రాబ్ రైల్ అందించారు. ఈ సరికొత్త బైక్ లుక్ పరంగా మరింత స్పోర్టీగా, ప్రీమియంగా కనిపించడం కోసం బాడీపై డైనమిక్ డ్యూయల్-టోన్ గ్రాఫిక్స్, మెరిసిపోయేలా 3D లోగో, వీల్స్ చుట్టూ స్టైలిష్ రిమ్ టేపులను ఇచ్చారు. ఈ బైక్ మార్కెట్లో 5 అదిరిపోయే క్రేజీ కలర్ ఆప్షన్లలో లభించనుంది.

* గ్లాసీ బ్లాక్ (Glossy Black)
* క్యాండీ బ్లేజింగ్ రెడ్ (Candy Blazing Red)
* మాట్ యాక్సిస్ గ్రే (Matt Axis Grey)
* మాట్ నెక్సస్ బ్లూ (Matt Nexus Blue)
* మాట్ చెస్ట్‌నట్ బ్రౌన్ (Matt Chestnut Brown)

Article Published On: Wednesday, May 27, 2026, 16:05 [IST]
English summary
Hero super splendor xtec 2 0 bike launched in india price specs mileage features telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+