IPL సీజన్‌కి ముందే సర్‌ప్రైజ్.. అభిమానులకు విడా VX2 ప్లస్ టీజర్ రిలీజ్! ఇది స్పెషల్ ఎడిషన్ గురూ!
క్రికెట్ పండుగలా భావించే ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభానికి ముందు నుంచే దేశవ్యాప్తంగా ఉత్సాహం పెరిగిపోతుంది. ఇదే వేళ, అభిమానుల ఆ ఎగ్జైట్‌మెంట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఒక ఆసక్తికరమైన అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ కంపెనీ, క్రికెట్, ఎలక్ట్రిక్ మొబిలిటీని కలిపి ఒక కొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేయబోతోంది, అదే హీరో విడా వీఎక్స్2 ప్లస్ నైట్ ఎడిషన్ (Hero Vida VX2 Plus Night Edition).
పేరు నుంచే అర్థమయ్యేలా, ఇది కేవలం ఒక స్కూటర్ కాదు, టీమ్ స్పిరిట్, స్టైల్, ఫ్యాన్స్ ఎమోషన్‌ను ప్రతిబింబించే ఒక ప్రత్యేక ఎడిషన్. ఈ స్పెషల్ మోడల్ విడుదలకు ముందుగా, హీరో మోటోకార్ప్ ఒక టీజర్‌ను విడుదల చేసింది. ఆ టీజర్ ద్వారా ఈ స్కూటర్ డిజైన్, కలర్ థీమ్, మొత్తం లుక్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రంగులు, ఐడెంటిటీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నైట్ ఎడిషన్ అని పేరు పెట్టడమే కాకుండా, దానికి తగ్గట్టు డార్క్ థీమ్, స్పోర్టీ ఫినిష్‌తో ఈ స్కూటర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ లాంచ్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం కేవలం ఒక కొత్త వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురావడం కాదు. IPL వంటి భారీ ఈవెంట్ సమయంలో అభిమానులతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకోవడం, అలాగే యువతలో ఎలక్ట్రిక్ మొబిలిటీపై ఆసక్తిని పెంచడం కూడా దీని లక్ష్యం.
Hero Vida VX2 Plus Knight Edition విషయంలో డిజైన్ పరంగా చూసినప్పుడు, ఇది స్టాండర్డ్ VX2 ప్లస్ మోడల్‌ను ఆధారంగా తీసుకున్నప్పటికీ, స్పెషల్ టచ్‌తో మరింత ప్రీమియంగా తీర్చిదిద్దారు. మొదటి చూపులోనే ఇది సాధారణ మోడల్ కాదని అర్థమయ్యేలా కొత్త డెకాల్స్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్‌లు, DRLల పైన ప్రత్యేకంగా ఉంచిన 'లిమిటెడ్ ఎడిషన్' బ్యాడ్జ్ వెంటనే దృష్టిని ఆకర్షిస్తుంది.

అదే ప్రాంతంలో Kolkata Knight Riders లోగోను చేర్చడం ద్వారా, ఈ మోడల్‌కు క్రికెట్ కనెక్షన్‌ను స్పష్టంగా చూపించారు. ఫ్యాన్స్‌కు ఇది కేవలం వాహనం కాదు, తమ ఫేవరెట్ టీమ్‌కు చెందిన గుర్తింపుగా మారుతుంది. డిజైన్‌లో మరో హైలైట్ బంగారు రంగు డెకాల్స్. ఇవి నేరుగా జట్టు జెర్సీ నుంచి ప్రేరణ పొందినవి. స్కూటర్ ముందు, వెనుక భాగాల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తూ, మొత్తం లుక్‌కు స్పోర్టీ ఫీల్‌ను ఇస్తాయి.
అంతేకాకుండా, సీటు కింద ఉన్న ప్రాంతం అంచులపై ఉన్న ఊదా రంగు అలంకరణలు పెర్ల్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌తో కలిసి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఈ కలర్ కాంబినేషన్ వల్ల ఈ నైట్ ఎడిషన్ నిజంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ స్కూటర్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా మాత్రమే అందించనున్నందున, దీని ప్రత్యేకత మరింత పెరుగుతోంది. ముఖ్యంగా IPL 2026 ముగిసే వరకు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు హీరో ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా అధికారిక భాగస్వామిగా మారడం ఈ ప్రత్యేక ఎడిషన్‌కు ప్రధాన కారణం. భాగస్వామ్యాన్ని మరింత హైలైట్ చేయడానికి, అభిమానులకు ప్రత్యేక అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతో Hero Vida VX2 Plus Night Editionను అభివృద్ధి చేశారు. స్టాండర్డ్ VX2 ప్లస్ మోడల్ ధర రూ.94,800 (ఎక్స్-షోరూమ్), ఈ నైట్ ఎడిషన్ లిమిటెడ్ వర్షన్ కావడంతో కొద్దిగా ఎక్కువ ధర ఉండవచ్చు.


Click it and Unblock the Notifications








