రెండూ బడ్జెట్‌లో వచ్చే స్కూటర్లు.. తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజ్.. మరి రెండింటిలో ఏది బెస్ట్?
భారతదేశంలో స్కూటర్ సెగ్మెంట్ రోజురోజుకీ మరింత పోటీతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన, నమ్మకమైన, సౌకర్యవంతమైన స్కూటర్లకు వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మంచి గుర్తింపు పొందిన మోడళ్లలో టీవీఎస్ జూపిటర్ 110 (TVS Jupiter 110) ఒకటి. ఈ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుని, కుటుంబాలకు అనువైన నమ్మకమైన వాహనంగా పేరు సంపాదించింది. ఇక మరోవైపు, Hero Xoom 110 కూడా ఈ సెగ్మెంట్‌లో మంచి పోటీని అందిస్తోంది. యువతను ఆకట్టుకునే స్టైలిష్ లుక్, ఆకర్షణీయమైన ఫీచర్లు, చురుకైన పనితీరు కారణంగా ఈ స్కూటర్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. వినియోగదారుల కోసం ఈ రెండు స్కూటర్ల గురించి ఈ కింది కథణంలో చూద్దాం.
ధర: TVS జూపిటర్ 110 భారత మార్కెట్‌లో సుమారు రూ.77,000 నుంచి రూ.89,600 మధ్య (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తుంది. వేరియంట్‌లను బట్టి ధరలో కొంత తేడా ఉండొచ్చు. ఇక మరోవైపు హీరో కంపెనీ నుంచి వచ్చిన హీరో జూమ్ 110 ధర పరంగా మరింత అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ రూ.72,701 నుంచి రూ.78,786 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో లభిస్తుంది. ధర పరంగా ఈ రెండు ఒకే రేంజ్‌లో ఉన్నాయి.

డిజైన్: TVS Jupiter 110, Hero Xoom 110 రెండు స్కూటర్లు ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో వస్తాయి. TVS జూపిటర్‌లో LED హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, LED టెయిల్ ల్యాంప్, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ఇది టైటానియం గ్రే మ్యాట్, మెటియోర్ రెడ్ గ్లోస్, స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, స్టార్‌డస్ట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 163 mm గ్రౌండ్ క్లియరెన్స్, 1,275 mm వీల్‌బేస్ ఉన్నాయి.
హీరో జూమ్ 110లో LED హెడ్‌ల్యాంప్, LED DRL, LED టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. దీనిలో కూడా 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ఇది పెర్ల్ సిల్వర్ వైట్, స్పోర్ట్స్ రెడ్, మాట్టే అబ్రాక్స్ ఆరెంజ్, మాట్టే షాడో గ్రే రంగుల్లో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm, వీల్‌బేస్ 1,300 mm ఉంటుంది. ఈ రెండు తమ ప్రత్యేకమైన డిజైన్, రంగులలతో అందుబాటులో ఉన్నాయి.

పర్ఫామెన్స్: పనితీరు పరంగా చూస్తే రెండూ కూడా శక్తివంతమైన ఇంజిన్‌లతో మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. TVS జూపిటర్ 110లో 113 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. సుమారు 50 కిమీ మైలేజ్ అందిస్తుంది. పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 5.1 లీటర్లు కాగా, గరిష్ట వేగం గంటకు 82 కిమీ వరకు ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ 0 నుంచి 60 కిమీ వేగాన్ని కేవలం 8.29 సెకన్లలో చేరుకోగలదు.
ఇక Hero Xoom 110లో 110.9 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 53 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్‌కు 5.2 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 87 కిమీ వరకు ఉంటుంది. అలాగే ఇది 0 నుంచి 60 కిమీ వేగాన్ని 9.35 సెకన్లలో చేరుకుంటుంది. మొత్తంగా చూస్తే రెండు స్కూటర్లు మంచి పనితీరుతో వినియోగదారులకు అనువుగా ఉంటాయి.

ఫీచర్స్: Jupiter 110లో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, USB ఛార్జింగ్ పోర్ట్, ఇంజిన్ కిల్ స్విచ్, బ్లూటూత్ కనెక్టివిటీ, భద్రతకు ముందు టెలిస్కోపిక్ హైడ్రాలిక్, వెనుక అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్‌తో డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. Xoom 110లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, భద్రతకు ముందు టెలిస్కోపిక్ హైడ్రాలిక్, వెనుక హైడ్రాలిక్ డంపర్ సస్పెన్షన్, డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు లభిస్తాయి.


Click it and Unblock the Notifications








