స్కూటర్‌కు అడ్వెంచర్ లుక్.. కొత్త ట్రెండ్‌కు హీరో శ్రీకారం.. ఇక స్కూటర్ అంటే ఇదే!
భారత టూవీలర్ మార్కెట్లో స్పోర్టీ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువతను ఆకర్షించే డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆధునిక ఫీచర్లు కలిగిన స్కూటర్ల కోసం వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ కూడా తన ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించేందుకు కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మార్కెట్లో TVS ఎన్‌టార్క్ 125కు ప్రత్యర్థిగా నిలిచిన హీరో జూమ్ 125ను మరింత ప్రత్యేకమైన రూపంలో తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న హీరో జూమ్ 125 స్పోర్టీ డిజైన్, అగ్రెసివ్ స్టైలింగ్, ఆధునిక ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటోంది.
అయితే సంప్రదాయ స్కూటర్ రూపకల్పనకు భిన్నంగా, అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల స్ఫూర్తితో రూపొందించిన కొత్త వెర్షన్‌ను తీసుకురావాలని హీరో భావిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. దీంతో స్కూటర్ మార్కెట్లో పూర్తిగా కొత్త తరహా మోడల్‌ను పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఇటలీలోని మిలన్ నగరంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత EICMA మోటార్ షోలో హీరో మోటోకార్ప్ జూమ్ 125కు సంబంధించిన అడ్వెంచర్-స్టైల్ కాన్సెప్ట్ స్కూటర్‌ను ప్రదర్శించింది.

ఆ కాన్సెప్ట్ అప్పట్లోనే ఆటోమొబైల్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సాధారణ స్కూటర్లతో పోలిస్తే మరింత రగ్గడ్ లుక్, ఎత్తైన స్టాన్స్, అడ్వెంచర్ టూరింగ్‌ను గుర్తు చేసే డిజైన్ అంశాలతో ఆ కాన్సెప్ట్ ప్రత్యేకంగా కనిపించింది. అప్పటి నుంచే ఈ మోడల్‌ను ఉత్పత్తి దశకు తీసుకువస్తారనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఆ అంచనాలకు మరింత బలం చేకూరేలా హీరో భారతదేశంలో కొత్త స్కూటర్ డిజైన్‌కు పేటెంట్ దాఖలు చేసి ఆమోదం పొందింది.
ఈ పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే, EICMAలో ప్రదర్శించిన అడ్వెంచర్ కాన్సెప్ట్‌కు చాలా వరకు పోలికలు కనిపిస్తున్నాయి. దీంతో హీరో జూమ్ 125 ఆధారంగా అడ్వెంచర్ స్టైల్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ కొత్త మోడల్‌లో కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, అడ్వెంచర్ థీమ్‌కు అనుగుణంగా పలు ప్రత్యేక ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

హీరో మోటోకార్ప్ ఈ కొత్త స్కూటర్ డిజైన్‌కు పేటెంట్ పొందినప్పటికీ, దానిని తప్పకుండా ఉత్పత్తి దశకు తీసుకొస్తుందని ఇప్పుడే నిర్ధారించలేం. సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు భవిష్యత్తులో ఉపయోగించాలనుకునే డిజైన్‌లు లేదా సాంకేతికతలను ముందుగానే పేటెంట్ చేసుకోవడం సహజం. వాటిలో కొన్ని మాత్రమే చివరకు మార్కెట్లోకి వస్తాయి. అయినప్పటికీ, పేటెంట్ నమోదు కావడం వల్ల ఈ మోడల్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలు గతంతో పోలిస్తే మరింత పెరిగాయని చెప్పవచ్చు.
గతంలో ఇటలీలో జరిగిన EICMA మోటార్ షోలో హీరో మోటోకార్ప్ ప్రదర్శించిన జూమ్ 125 అడ్వెంచర్ కాన్సెప్ట్ చాలా అగ్రెసివ్ డిజైన్‌తో ఆకట్టుకుంది. అయితే తాజాగా బయటకు వచ్చిన పేటెంట్ డిజైన్‌ను చూస్తే, కంపెనీ మరింత సింపుల్‌గా, రోజువారీ వినియోగానికి అనువుగా ఉండే డిజైన్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్‌లో ఉన్న అన్ని అడ్వెంచర్ అంశాలను కాకుండా, కొన్ని ఉపయోగకరమైన స్టైలింగ్ ఫీచర్లను మాత్రమే ఇందులో ఉంచినట్లు కనిపిస్తోంది.
ఇంజిన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం జూమ్ 125లో ఉన్న 124.6 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 9.9 హెచ్‌పీ పవర్, 10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కొత్త గ్రాఫిక్స్, డిజిటల్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, అడ్వెంచర్ స్టైల్ యాక్సెసరీలు వంటి కొన్ని కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ స్కూటర్ లాంచ్‌పై హీరో మోటోకార్ప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, పేటెంట్ నమోదుతో ఈ కొత్త అడ్వెంచర్ స్టైల్ జూమ్ 125 మార్కెట్లోకి వచ్చే అవకాశాలు పెరిగినట్లు తెలుస్తోంది. త్వరలో దీని గురించిన ఇతర పూర్తి వివరాలు తెలియరావచ్చు.


Click it and Unblock the Notifications