యాక్టివా 125 vs యాక్సెస్ 125: ఈ రెండు స్కూటర్లలో ఒకటి తప్పనిసరి..! ఎవరు బెస్ట్?

భారతదేశ టూవీలర్ మార్కెట్లో 125cc స్కూటర్ సెగ్మెంట్ అంటేనే గట్టి పోటీకి ప్రతీక. ఈ విభాగంలో అనేక కంపెనీలు తమ స్కూటర్లను ప్రవేశపెట్టినా, కాల పరీక్షను తట్టుకుని నిలబడినవి మాత్రం రెండు పేర్లే.. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125), హోండా యాక్టివా 125 (Honda Activa 125). ఈ రెండు స్కూటర్లు మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచే పరస్పరం ప్రత్యర్థులుగా కొనసాగుతూ, లక్షలాది వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకున్నాయి. కాలానుగుణంగా మారుతున్న కస్టమర్ అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, రెండు కంపెనీలు కూడా తరచూ అప్డేట్స్, కొత్త ఫీచర్లతో తమ స్కూటర్లను మార్కెట్లో తాజాగా ఉంచుతున్నాయి. ఇదే ఈ రెండింటి మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ క్రమంలో ఈ స్కూటర్ల గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

సుజుకి యాక్సెస్ 125 ఎక్స్-షోరూమ్ ధరలు రూ.78,184 నుంచి ప్రారంభమవుతాయి. టాప్ వేరియంట్‌ యాక్సెస్ రైడ్ కనెక్ట్ TFT ABS వేరియంట్ ధర రూ.98,378 వెళ్తుంది. యాక్టివా 125 ధరలు కొంచెం ప్రీమియం వైపు ఉండగా, ఇవి రూ.89,652 నుంచి ప్రారంభమై రూ.94,096 వరకు (అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు) ఉంటాయి. ధర పరంగా యాక్సెస్ 125 ఎక్కువ వేరియంట్ ఆప్షన్లతో ఉండగా, యాక్టివా 125 స్థిరమైన ప్రీమియం ఇమేజ్‌ను కొనసాగిస్తోంది.

Honda Activa 125 Vs Suzuki Access 125 Detailed Comparison Inside Details

ఇంజిన్ విషయానికి వస్తే, రెండు స్కూటర్లు కూడా దాదాపు సమానమైన పనితీరును అందిస్తాయి. హోండా యాక్టివా 125లో 123.9 సిసి సామర్థ్యం కలిగిన సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.4 హెచ్‌పి పవర్‌తో పాటు 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ సిటీ రైడింగ్‌కు ఇది స్మూత్‌గా, నమ్మకంగా పనిచేస్తుంది. మరోవైపు, సుజుకి యాక్సెస్ 125లో 124 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది.

ఇది కూడా 8.4 హెచ్‌పి పవర్‌ను ఇస్తుంది కానీ టార్క్ పరంగా 10.2 ఎన్ఎమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగితాలపై తేడా చాలా స్వల్పంగానే ఉన్నా, రైడింగ్ అనుభూతిలో యాక్సెస్ 125 కొంచెం రిఫైన్డ్‌గా అనిపిస్తుందని చాలామంది వినియోగదారులు చెబుతుంటారు. రంగుల ఎంపిక విషయంలో హోండా యాక్టివా 125 కొంచెం ముందుంది. యాక్టివా 125 మొత్తం 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుండగా, సుజుకి యాక్సెస్ 125 6 రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

Honda Activa 125 Vs Suzuki Access 125 Detailed Comparison Inside Details

యువతను ఆకట్టుకునే కొత్త షేడ్స్ కావాలనుకునే వారికి యాక్టివా ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, యాక్టివా 125 లీటర్‌కు సుమారు 47 కి.మీ. వరకు ఇస్తుందని చెబుతుండగా, యాక్సెస్ 125 లీటర్‌కు 45 కి.మీ. మైలేజ్‌ను అందిస్తుంది. ఈ తేడా పెద్దగా కాకపోయినా, ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కోరుకునే వారికి యాక్టివా కొంచెం మెరుగ్గా అనిపించవచ్చు. యూజర్ రివ్యూల పరంగా రెండు స్కూటర్లు సమానమైన ఆదరణ పొందాయి.

హోండా యాక్టివా 125లో కాల్, SMS అలర్ట్స్‌తో కూడిన నావిగేషన్ ఫీచర్ ఉంది. పూర్తి LED లైటింగ్ సెటప్‌తో ఇది ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అంతేకాదు, హోండా అందించే H-స్మార్ట్ కీ సిస్టమ్ ద్వారా స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ ఫైండ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫంక్షన్‌లు లభిస్తాయి. హోండా రోడ్‌సింక్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీతో పనిచేసే 4.2-అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది.

Honda Activa 125 Vs Suzuki Access 125 Detailed Comparison Inside Details

మరోవైపు, సుజుకి యాక్సెస్ 125 కూడా ఏ మాత్రం వెనుకబడలేదు. రైడ్ కనెక్ట్ టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 4.2-అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏమిటంటే, 125cc సెగ్మెంట్‌లో సింగిల్-ఛానల్ ABS పొందిన తొలి స్కూటర్ ఇదే. LED లైటింగ్, USB ఫీచర్లు ఉన్నాయి. తాజాగా విడుదలైన కొత్త వెర్షన్‌లో సింగిల్-ఛానల్ ABSను అందించడం ద్వారా సుజుకి యాక్సెస్ 125ను మరింత ఆకర్షణీయంగా మార్చింది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 11, 2026, 14:57 [IST]
English summary
Honda activa 125 vs suzuki access 125 detailed comparison inside details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+