హోండా యాక్టివా అన్న వచ్చేస్తున్నాడు.. మరింత శక్తివంతంగా, స్టైలిష్‌గా! మార్కెట్‌లో హీట్ పెరుగుతోంది!

భారతదేశంలో స్కూటర్ మార్కెట్ గురించి మాట్లాడితే, హోండా యాక్టివా(Honda Activa) పేరు తప్పకుండా ముందుకు వస్తుంది. సంవత్సరాలుగా భారతీయ కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ స్కూటర్, ఇప్పటికీ అమ్మకాలలో రారాజుగా కొనసాగుతోంది. ప్రతి నెలా లక్షల సంఖ్యలో యాక్టివా యూనిట్లు అమ్ముడవుతుండగా, ఇతర కంపెనీలు దాని స్థాయికి చేరేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు హోండా మరో కొత్త ప్లాన్‌తో భారత మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హోండా భారతదేశంలో ప్రధానంగా యాక్టివా, డియో అనే రెండు స్కూటర్‌లను విక్రయిస్తోంది. ఇవి 110cc, 125cc ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు భారత స్కూటర్ మార్కెట్ వేగంగా మారుతోంది.

వినియోగదారులు కేవలం సాధారణ కమ్యూటర్ స్కూటర్లకే పరిమితం కాకుండా, ఎక్కువ పవర్, స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు ఉన్న స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 125cc కంటే ఎక్కువ సామర్థ్యం గల స్కూటర్లకు యువత నుంచి భారీ డిమాండ్ పెరుగుతోంది. ఈ మారుతున్న ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకున్న హోండా, ఇప్పుడు 'ఎయిర్‌బ్లేడ్' అనే కొత్త మ్యాక్సీ-స్టైల్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Honda Airblade Maxi Scooter Could Launch Soon In India Details

ఇప్పటికే ఈ స్కూటర్‌కు సంబంధించిన పేటెంట్‌ను కంపెనీ భారతదేశంలో నమోదు చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. సాధారణంగా హోండా ఏదైనా వాహనానికి భారత పేటెంట్ తీసుకుంటే, అది త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆటో రంగం భావిస్తోంది. కొత్త హోండా ఎయిర్‌బ్లేడ్ 125cc, 160cc అనే రెండు ఇంజన్ ఆప్షన్‌లతో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో రానున్న ప్రీమియం మ్యాక్సీ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వవచ్చు.

పెద్ద బాడీ డిజైన్, కంఫర్టబుల్ సీటింగ్, స్పోర్టీ లుక్, హైవే రైడింగ్‌కు అనువైన పనితీరు వంటి అంశాలతో ఈ స్కూటర్ యువతను బలంగా ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. హోండా ఇప్పుడు మార్కెట్ మారుతున్న సమయంలో, ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో కూడా తన ఉనికిని బలంగా చూపించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హోండా ప్రస్తుతం ఈ ఎయిర్‌బ్లేడ్ స్కూటర్‌ను విదేశీ మార్కెట్లలో 125cc, 160cc అనే రెండు ఇంజన్ ఆప్షన్‌లతో విక్రయిస్తోంది.

Honda Airblade Maxi Scooter Could Launch Soon In India Details

అయితే భారతదేశంలో కంపెనీ దాఖలు చేసిన డిజైన్ పేటెంట్‌లో ఏ వెర్షన్‌ను తీసుకురానుందనే విషయం మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో 125cc మోడల్ వస్తుందా? లేక నేరుగా 160cc పవర్‌ఫుల్ వెర్షన్‌తో ఎంట్రీ ఇస్తుందా? అనే చర్చ ఆటో రంగంలో జోరుగా సాగుతోంది. ఈ స్కూటర్‌లో మరో ముఖ్యమైన అంశం దాని లిక్విడ్-కూల్డ్ ఇంజన్. ప్రస్తుతం భారత మార్కెట్లో 125cc సెగ్మెంట్‌లో లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వచ్చే స్కూటర్ ఏదీ లేదు.

అదే సమయంలో యమహా ఏరాక్స్ 155కు మంచి స్పందన రావడంతో, హోండా కూడా అదే సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని చూపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉండటం వల్ల ఎక్కువ వేగంలో కూడా ఇంజన్ పనితీరు స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాల ప్రయాణాల్లో వేడి సమస్యలు తక్కువగా ఉండటంతో పాటు, మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ప్రత్యేకంగా విదేశాల్లోని ఎయిర్‌బ్లేడ్ 160 వెర్షన్ గురించి మాట్లాడితే, 156.93cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

Honda Airblade Maxi Scooter Could Launch Soon In India Details

ఈ ఇంజన్ గరిష్టంగా 15 హెచ్‌పి పవర్, 14.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అంటే నగర రోడ్లపై మాత్రమే కాదు, హైవేలపై కూడా స్పోర్టీ రైడింగ్ అనుభూతిని అందించే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఈ స్కూటర్ ఇక్కడి మార్కెట్లోకి వస్తే యాక్టివా తర్వాత హిట్ మోడల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో ఈ స్కూటర్ గురించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Article Published On: Saturday, May 9, 2026, 17:02 [IST]
English summary
Honda airblade maxi scooter could launch soon in india details
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+