ఇండియా ఆటో మార్కెట్‌ను షేక్ చేసిన హోండా.. ప్రతి ఊర్లో, పట్టణంలో పరుగులు తీస్తున్నవి ఇవే!
హోండా మోటార్ సైకిల్ ఇండియా భారత టూవీలర్ వాహన మార్కెట్‌లో తన సత్తాను మరోసారి నిరూపించింది. దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఈ కంపెనీ, 2026 ఫిబ్రవరిలో అద్భుతమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. వినియోగదారుల విశ్వాసం, విశ్వసనీయమైన ఇంజిన్ పనితీ, మంచి మైలేజ్ వంటి అంశాలు హోండా వాహనాలకు నిరంతర డిమాండ్ తీసుకొస్తున్నాయి. 2026 ఫిబ్రవరిలో హోండా మొత్తం 5,67,351 యూనిట్ల ద్విచక్ర వాహనాలను డెలివరీ చేయగా, గత సంవత్సరం ఇదే కాలంలో 4,22,449 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను పోల్చితే సంవత్సర ప్రాతిపదికన (YoY) సుమారు 34 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి స్థిరమైన వృద్ధి సాధించడం కంపెనీకి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. మొత్తం అమ్మకాలలో 5,13,190 యూనిట్లు దేశీయ మార్కెట్‌లోనే విక్రయించబడటం గమనార్హం. ఇది భారత మార్కెట్‌లో హోండా బ్రాండ్‌కు ఉన్న బలమైన స్థితిని చూపిస్తుంది. ఇక 54,161 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేయబడటం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా హోండా తన ప్రభావాన్ని పెంచుకుంటోందని స్పష్టమవుతోంది.

దేశీయంగానే కాకుండా గ్లోబల్ స్థాయిలో కూడా కంపెనీ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది హోండా ప్రముఖ మోడళ్లు. ముఖ్యంగా హోండా యాక్టివా (Honda Activa) స్కూటర్ ఎప్పటికప్పుడు అత్యధికంగా అమ్ముడవుతూ బ్రాండ్‌కు ప్రధాన బలంగా నిలుస్తోంది. కుటుంబాల నుంచి యువత వరకు అందరికీ సరిపోయే డిజైన్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు యాక్టివాను ప్రజాదరణలో ముందంజలో ఉంచుతున్నాయి.
అదేవిధంగా హోండా షైన్ (Honda Shine) తన శక్తివంతమైన ఇంజిన్, విశ్వసనీయతతో కమ్యూటర్ బైక్ విభాగంలో మంచి స్థానం సంపాదించుకుంది. యువతను ఆకట్టుకునే స్పోర్టీ లుక్‌తో Honda Dio కూడా అమ్మకాల వృద్ధికి కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే, హోండా ఫిబ్రవరి 2026లో నమోదు చేసిన ఈ 34 శాతం వృద్ధి కేవలం గణాంకం మాత్రమే కాదు, బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకానికి నిదర్శనం.

భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటైన Honda Activa 125, Honda Activa 110 వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. ముందుగా యాక్టివా 125 గురించి చెప్పుకుంటే, ఇది శక్తివంతమైన పనితీరుతో పాటు ఆధునిక ఫీచర్లను అందించే ప్రీమియం స్కూటర్. రూ. 88,339 నుంచి రూ. 94,096 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో లభించే ఈ మోడల్ 123.92 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.
నగర ప్రయాణాలకు అనువైన ఈ ఇంజిన్ సుమారు 47 కి.మీ వరకు మైలేజీ ఇవ్వగలదు. గరిష్ట వేగం గంటకు 90 కి.మీ వరకు ఉండటం వల్ల హైవే ప్రయాణాల్లో కూడా నమ్మకంగా నడపవచ్చు. టెక్నాలజీ పరంగా చూస్తే TFT కన్సోల్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భద్రత పరంగా డిస్క్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్లు ఇవ్వడం మరింత విశ్వాసాన్ని పెంచుతుంది.

ఇక యాక్టివా 110 విషయానికి వస్తే, ఇది ఎక్కువ మంది కుటుంబాల మొదటి ఎంపికగా నిలిచింది. రూ. 75,433 నుంచి రూ. 89,806 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో అందుబాటులో ఉండటం దీని ప్రధాన ఆకర్షణ. 109.51 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్ రోజువారీ కమ్యూటింగ్‌కు చక్కగా సరిపోతుంది. సుమారు 50 కి.మీ వరకు మైలేజీ ఇవ్వగల సామర్థ్యం ఉండటం దీన్ని మరింత ఆర్థికంగా మారుస్తుంది.


Click it and Unblock the Notifications








