యాక్టివా తరహాలో మరో కొత్త హోండా స్కూటర్ రాబోతుంది.. లాంచ్‌కు పేటెంట్ సంకేతాలు!

భారత మార్కెట్లో స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ, మైలేజ్, నడపడానికి సులభంగా ఉండటం వంటి కారణాలతో చాలా మంది స్కూటర్లనే మొదటి ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో స్కూటర్ సెగ్మెంట్‌లో పోటీ మరింత ఎక్కువగా మారుతోంది. ఇండియాలో చాలా మందికి స్కూటర్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది హోండా యాక్టివానే. ఎన్నో ఏళ్లుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా యాక్టివా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రతి నెలా లక్షలాది మంది వినియోగదారులు యాక్టివానే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హోండా కంపెనీ మరో బ్రహ్మాస్త్రాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

కొత్త మోడల్ ద్వారా యువతతో పాటు నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారిని మరింతగా ఆకట్టుకోవాలనే లక్ష్యంతో హోండా పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఈ కొత్త స్కూటర్‌పై ఇప్పటికే ఆటో నిపుణుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ కొత్త స్కూటర్ 125 సిసి సెగ్మెంట్‌లోనూ రావచ్చని తెలుస్తుంది. ఇది యాక్టివాకు సోదరుడిగా, మరింత అధునాతనంగా, ఆకట్టుకునే సదుపాయాలతో రావచ్చు.

Honda Npf125 Scooter May Launch In India Based On Activa 125 Engine

గతంలోనే భారత్‌లో హోండా NPF125 స్కూటర్ డిజైన్‌ పేటెంట్ నమోదు చేసింది. సాధారణంగా ఏదైనా కొత్త వాహనాన్ని మార్కెట్లో తీసుకువచ్చే ముందు కంపెనీలు దాని డిజైన్‌కు పేటెంట్ దాఖలు చేయడం చేస్తుంటాయి. దీంతో ఈ స్కూటర్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలపై చర్చ మొదలైంది. అయితే, పేటెంట్ దాఖలు చేసినంత మాత్రన తప్పనిసరిగా లాంచ్ అవుతుందనే కాదు, కానీ భవిష్యత్తులో దాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ పరిశీలిస్తున్నట్లు చెప్పొచ్చు.

డిజైన్ పరంగా హోండా NPF125 స్పోర్టీతో పాటు ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ను హోండా భారతదేశంలో విక్రయించడం లేదు. అయితే చైనా, వియత్నాం వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఇది కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అందువల్ల ఇదే మోడల్‌ను భారతీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పుల చేసి సరికొత్తగా తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే, యాక్టివాకు సోదరుడు వచ్చేసినట్లే.

Honda Npf125 Scooter May Launch In India Based On Activa 125 Engine

హోండా NPF125 పనితీరు గురించి చూస్తే, యాక్టివా 125లో ఉపయోగిస్తున్న, అదే 124 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను దీనిలోను వాడే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ పనితీరు గురించి యాక్టివాను వాడుతున్న ప్రతిఒక్కరికి తెలుసు కాబట్టి, కొత్త స్కూటర్‌ పనితీరు కూడా అద్భుతంగా ఉండనుందని తెలుస్తుంది. అయితే హోండా నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ స్కూటర్ లాంచ్, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై పూర్తి స్పష్టత వస్తుంది.

ప్రస్తుతానికి విదేశాల్లో అమ్ముడవుతున్న NPF125 స్కూటర్ ఎక్కువ ప్రీమియం ఫీచర్లు కలిగిన మోడల్. యాక్టివా కంటే దీనిలో మరింత అధునాతన ఆప్షన్లు ఉంటాయి. ఈ స్కూటర్ ముందు భాగంలో LED లైట్లు, హ్యాంగిల్ బార్‌లో సమాచారం చూడటానికి LCD డిస్‌ప్లే ఉన్నాయి. అలాగే, కీలెస్‌ ఇగ్నిషన్, స్కూటర్ రన్నింగ్‌లో మీ స్మార్ట్ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి USB ఛార్జర్, మెరుగైన బ్రేకింగ్ కోసం సింగిల్ ఛానల్ ABSను కూడా అందించారు.

ప్రస్తుతం ఇండియాలో అమ్మకానికి అందుబాటులో ఉన్న హోండా యాక్టివా 125 స్కూటర్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 90,803 నుండి రూ. 95,247 మధ్య ఉంది. అయితే, హోండా NPF125 ఎక్కువ ప్రీమియం ఫీచర్లు కలిగిన మోడల్ కాబట్టి, దీని ధర యాక్టివా కంటే కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో 125 సిసి స్కూటర్లకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో కొత్త స్కూటర్‌ను కూడా ఆదరించే అవకాశం ఉంది.

Article Published On: Monday, July 6, 2026, 17:16 [IST]
English summary
Honda npf125 scooter may launch in india based on activa 125 engine
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+