సామాన్యుల కోసం అతి తక్కువ ధరలో హోండా స్కూటర్.. యాక్టివా మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా?
భారతదేశ స్కూటర్ మార్కెట్‌లో ఎవరు రాజు అంటే, చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు హోండా (Honda). ముఖ్యంగా హోండా యాక్టివా స్కూటర్ ఈ విజయానికి ప్రధాన పునాది. గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా యాక్టివా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రతి నెలా లక్షల సంఖ్యలో యాక్టివా స్కూటర్లు విక్రయమవుతుండటమే హోండా బ్రాండ్‌కు ఉన్న నమ్మకానికి, ఆదరణకు నిదర్శనం. ఫ్యామిలీ వినియోగదారుల నుంచి యువత వరకు యాక్టివా ఒక సేఫ్ అండ్ రిలయబుల్ ఎంపికగా మారిపోయింది.
ఇలాంటి బలమైన ఇమేజ్ ఉన్న హోండా, ఎలక్ట్రిక్ వాహనాల వైపు భారత మార్కెట్ వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో, స్కూటర్ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని ఎలక్ట్రిక్ విభాగంలో కూడా కొనసాగించాలని భావించింది. ఈ లక్ష్యంతోనే హోండా భారత మార్కెట్‌లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. అవే హోండా యాక్టివా E, హోండా QC1. యాక్టివా పేరుతోనే వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో, ఈ మోడళ్లపై వినియోగదారుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

లాంచ్ సమయంలో ఇవి మార్కెట్‌లో అమ్మకాలలో రికార్డులు సృష్టిస్తాయని చాలామంది భావించారు. అయితే, అంచనాలకు భిన్నంగా పరిస్థితి మారింది. ఆశించిన స్థాయిలో యాక్టివా E, QC1 స్కూటర్లు అమ్ముడుపోలేదు. మార్కెట్‌లో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్లు దూసుకుపోతున్న సమయంలో, హోండా మోడళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఒక దశలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను నిలిపివేయబోతోందనే వార్తలు కూడా వినిపించాయి. ఇది హోండా అభిమానులను, ఆటో రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. హోండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను పూర్తిగా నిలిపివేయడం కంటే, వేరే దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, హోండా యాక్టివా E, QC1 అమ్మకాలు ఎందుకు ఆశించిన స్థాయిలో లేవు? వినియోగదారులు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? అనే అంశాలపై లోతైన దర్యాప్తు చేస్తోంది. డిజైన్, రేంజ్, ధర, ఫీచర్లు, చార్జింగ్ వంటి అన్ని అంశాలను హోండా సవివరంగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో, ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి వచ్చిన అనుభవాలను ఉపయోగించుకుని, సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆటోకార్ ఇండియా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో విక్రయిస్తున్న యాక్టివా E, QC1 మోడళ్లు అంతర్జాతీయ మార్కెట్లకు అభివృద్ధి చేసిన స్కూటర్లపై ఆధారపడి ఉన్నాయని, అవి పూర్తిగా భారతీయ వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా డిజైన్ కాలేదనే అభిప్రాయం ఉంది.
తాజా నివేదికల ప్రకారం, హోండా అభివృద్ధి చేస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొదటి నుంచే ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసమే డిజైన్ చేసి అభివృద్ధి చేస్తోంది. అంటే ఇది కేవలం అంతర్జాతీయ మోడల్‌కు చేసిన మార్పులు కాకుండా, భారతీయ వినియోగదారుల అవసరాలు, వినియోగ విధానం, మార్కెట్ పరిస్థితులను కేంద్రంగా పెట్టుకుని రూపొందుతున్న స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో హోండా అత్యంత కీలకంగా భావిస్తున్న అంశం ధర.

అతి తక్కువ ధరలో భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలులో ధర కీలక పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని హోండా బాగా అర్థం చేసుకుంది. అందుకే, ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా అతితక్కువ ధరను నిర్ణయించాలనే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ఈసారి హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పరీక్షగా కాకుండా, ఒక సీరియస్ ప్రొడక్ట్తోనే మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








