హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది! ఐక్యూబ్, చేతక్, రిజ్తాలతో పోలిస్తే ఇది బెస్ట్ ఆప్షనా? పూర్తి వివరాలు ఇవే!
హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ QC3ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ వద్ద దీని ప్రారంభ ధర ₹1.35 లక్షలుగా ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, అథర్ రిజ్తాలకు గట్టి పోటీగా ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్‌లో ఇది అడుగుపెట్టింది. సింగిల్ ఛార్జ్‌పై 145 కి.మీ (IDC) రేంజ్, 32 లీటర్ల బూట్ స్పేస్, 5-ఇంచుల TFT డిస్‌ప్లే, కీ-లెస్ వంటి ఆధునిక ఫీచర్లతో వచ్చింది. ఇప్పటికే బుకింగ్స్ షురూ కాగా, ప్రారంభ దశలో ఐదు నగరాల్లో మాత్రమే ఇది అందుబాటులోకి రానుంది.
మొదటి విడతలో ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లాం నగరాల్లోని ఎంపిక చేసిన రెడ్‌వింగ్ షోరూమ్‌ల ద్వారా హోండా ఈ స్కూటర్‌ను విక్రయించనుంది. కస్టమర్లు షోరూమ్‌లలో లేదా ఆన్‌లైన్ ద్వారా ₹5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా హోండాకు ఉన్న విస్తృతమైన రెడ్‌వింగ్ నెట్‌వర్క్ వల్ల భవిష్యత్తులో స్పేర్ పార్ట్స్, సర్వీసింగ్ సమస్యలు ఉండవని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రాథమిక నగరాల్లోని కస్టమర్లకు హోండా నెట్‌వర్క్ భరోసా లభిస్తుంది, మిగిలిన ప్రాంతాల వారు తదుపరి రోలవుట్ వరకు వేచి చూడాల్సిందే.

హోండా QC3 vs ఐక్యూబ్ vs చేతక్ vs రిజ్తా: ధర, లభ్యత వివరాలు
వాహనం కొనుగోలులో ఆన్-రోడ్ ధరలే కీలకం. ప్రధాన మెట్రో నగరాల్లో QC3 ఆన్-రోడ్ ధర సుమారు ₹1.46 లక్షలుగా ఉంది. ఇది ఐక్యూబ్ బేస్ వేరియంట్‌కంటే కాస్త ఎక్కువ, రిజ్తా లేదా చేతక్ టాప్ వేరియంట్‌ల మధ్యలో ఉంటుంది. నగరాలు, వేరియంట్‌లను బట్టి ఐక్యూబ్ ధర ₹1.24–1.30 లక్షలు, చేతక్ ₹1.23–1.24 లక్షలు, రిజ్తా ₹1.29–1.33 లక్షల శ్రేణిలో ఉన్నాయి.
రేంజ్, ఛార్జింగ్: IDC vs రియల్ వరల్డ్
హోండా QC3లోని 3.0 kWh బ్యాటరీ 145 కి.మీ IDC రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కేవలం 2 గంటల 40 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది, ఫుల్ ఛార్జింగ్‌కు దాదాపు 4 గంటలు పడుతుంది. టీవీఎస్ ఐక్యూబ్ బ్యాటరీ సైజ్‌ని బట్టి 94–145 కి.మీ రేంజ్ ఇస్తుండగా, 0-80% ఛార్జింగ్‌కు 4 గంటల 18 నిమిషాలు పడుతుంది. అథర్ రిజ్తా 3.7 kWh వేరియంట్ రియల్ వరల్డ్ టెస్టింగ్‌లో 105 కి.మీ రేంజ్ ఇచ్చింది. బజాజ్ చేతక్ 3502 మోడల్ 153 కి.మీ IDC రేంజ్, 3 గంటల 25 నిమిషాల్లో 0-80% ఛార్జింగ్ సదుపాయం కలిగి ఉంది.
ఫ్యామిలీ యూజ్: స్టోరేజ్, రైడింగ్ కంఫర్ట్, ఫీచర్లు
ఫ్యామిలీ స్కూటర్ కొనేటప్పుడు స్టోరేజ్ స్పేస్, సీటింగ్ కంఫర్ట్ ప్రధాన అంశాలు. హోండా QC3లో 32 లీటర్ల బూట్ స్పేస్‌తో పాటు నావిగేషన్ సపోర్ట్ ఉన్న 5-ఇంచుల TFT డిస్‌ప్లే అందించారు. ఐక్యూబ్‌లోనూ 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ 35-సిరీస్‌లో 35 లీటర్ల స్పేస్‌తో పాటు కొన్ని వేరియంట్లలో గ్లోవ్‌బాక్స్ కూడా లభిస్తుంది. అథర్ రిజ్తా విషయానికొస్తే 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌తో పాటు అదనంగా 22 లీటర్ల ఫ్రంట్ ఫ్రంక్ యాక్సెసరీ ఆప్షన్ కూడా ఇచ్చారు.
ప్రధాన నగరాల్లో ఆన్-రోడ్ ధరలు, అంచనా EMI వివరాలు
| నగరం | QC3 ఆన్-రోడ్ | EMI | ఐక్యూబ్ ఆన్-రోడ్ | EMI | చేతక్ ఆన్-రోడ్ | EMI | రిజ్తా ఆన్-రోడ్ | EMI |
|---|---|---|---|---|
| హైదరాబాద్ | ₹1.46L | ₹4,230 | ₹1.30L | ₹3,780 | ₹1.24L | ₹3,600 | ₹1.34L | ₹3,880 |
| బెంగళూరు | ₹1.46L | ₹4,230 | ₹1.24L | ₹3,610 | ₹1.24L | ₹3,600 | ₹1.30L | ₹3,780 |
| ముంబై | ₹1.46L | ₹4,230 | ₹1.26L | ₹3,660 | ₹1.24L | ₹3,600 | ₹1.30L | ₹3,780 |
| ఢిల్లీ | ₹1.46L | ₹4,230 | ₹1.27L | ₹3,690 | ₹1.23L | ₹3,565 | ₹1.29L | ₹3,750 |
ఇక్కడ పేర్కొన్న నగర ఆన్-రోడ్ ధరలు ప్రస్తుత లిస్టింగ్స్ ఆధారంగా ఇచ్చినవి. 10 శాతం డౌన్‌పేమెంట్, 10 శాతం వడ్డీ రేటు, 36 నెలల కాలపరిమితి ఆధారంగా EMIలు అంచనా వేశాం. QC3 ఆన్-రోడ్ ధరలను ఆటోకార్ అంచనాల ఆధారంగా, మిగిలిన స్కూటర్ల ధరలను జిగ్‌వీల్స్, బైక్‌వేల్ లెక్కింపుల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ తీసుకునేముందు స్థానిక డీలర్‌ను సంప్రదించి నిఖార్సయిన ధరలను తెలుసుకోండి.
ఎవరికి ఏ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది?
రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు కంఫర్ట్, మంచి ఫీచర్లు కోరుకునే వారికి టీవీఎస్ ఐక్యూబ్ 3.1 kWh సరైన ఛాయిస్. ఫ్యామిలీ అవసరాలు, ఎక్కువ సామాన్లు తీసుకెళ్లడానికి పెద్ద సీటు, అదనపు స్టోరేజ్ ఉన్న అథర్ రిజ్తా సౌకర్యవంతంగా ఉంటుంది. కమర్షియల్ లేదా డెలివరీ అవసరాలకు, గట్టి బాడీతో పాటు 35 లీటర్ల స్పేస్ ఉండే బజాజ్ చేతక్ 3502 బెస్ట్. ఇక హోండా QC3 లభ్యతలో ఉన్న నగరాల్లో.. తక్కువ ఛార్జింగ్ సమయం, హోండాకున్న విస్తృత డీలర్ నెట్‌వర్క్ కారణంగా QC3 కొనుగోలు చేయడం నమ్మకమైన నిర్ణయం కాగలదు.


Click it and Unblock the Notifications
