మంచి బైక్ కోసం చూస్తున్నారా? ఈ రెండు రూ.86 వేలల్లో.. లీటరుకు 60 కి.మీ మైలేజ్! బెస్ట్ బడ్జెట్ ఆప్షన్స్
హోండా షైన్ 125 (Honda Shine 125) లిమిటెడ్ ఎడిషన్ భారత మార్కెట్లో చాలా కాలంగా ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌గా గుర్తింపు పొందింది. మంచి మైలేజ్, సింపుల్ డిజైన్, విశ్వసనీయమైన ఇంజిన్ కారణంగా ఈ బైక్‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు మంచి డిమాండ్ ఉంది. మరోవైపు హీరో గ్లామర్ ఎక్స్ 125 (Hero Glamour X 125) కూడా ఇదే సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇస్తోంది. స్టైలిష్ డిజైన్, మెరుగైన ఫీచర్లు, మంచి పనితీరు వల్ల ఇది యువతలో ఎక్కువగా ఆకర్షణ పొందుతోంది. ఈ రెండు కూడా భారత పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తూ రోజూ ప్రయాణంలో తోడుగా నిలుస్తాయి. ఇప్పుడు ఈ కథణంలో ఈ రెండు బైకుల గురించిన తేడాల గురించి తెలుసుకుందాం.
ధర విషయానికి వస్తే, ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ ధర సుమారు రూ.86,211 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. మరోవైపు హీరో గ్లామర్ X 125 ధర రూ.86,309 నుంచి రూ.93,683 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. అంటే ధర పరంగా ఈ రెండు బైక్‌ల మధ్య పెద్దగా తేడా కనిపించదు.

డిజైన్ పరంగా రెండు బైక్‌లు ప్రత్యేకతను చూపిస్తాయి. హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ సింపుల్ అయినా స్టైలిష్ లుక్‌తో వస్తుంది. ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్, ఆకర్షణీయమైన సైడ్ కవర్లు, ఎగ్జాస్ట్ మఫ్లర్ కవర్ ఉన్నాయి. ఇది పెర్ల్ సైరెన్ బ్లూ వంటి ప్రత్యేక రంగులో కూడా లభిస్తుంది. ఈ బైక్ వెడల్పైన డిజైన్‌తో, 162 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 1,285 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది.
మరోవైపు హీరో గ్లామర్ X 125 కొంచెం స్పోర్టీ, ఆధునిక డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో LED హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ పొజిషన్ లైట్లు, LED టెయిల్ ల్యాంప్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ మెటాలిక్ నెక్సస్ బ్లూ, మ్యాట్ మెటాలిక్ సిల్వర్, బ్లాక్ పెర్ల్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఇది 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 1,267 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

పనితీరు విషయానికి వస్తే హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్‌లో 123.94 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది, దీంతో రైడింగ్ అనుభవం సాఫ్ట్‌గా ఉంటుంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మైలేజ్ పరంగా లీటరుకు సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది.
మరోవైపు హీరో గ్లామర్ X 125లో 124.7 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మైలేజ్ విషయంలో ఈ బైక్ కొంచెం ముందంజలో ఉందని చెప్పవచ్చు. కంపెనీ ప్రకారం ఇది లీటరుకు సుమారు 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు. గరిష్ట వేగం విషయానికి వస్తే ఇది గంటకు సుమారు 105 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. అంతేకాకుండా వేగం పెరగడంలో కూడా ఇది చురుకుగా ఉంటుంది.

షైన్ ఎడిషన్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్, డిస్క్/డ్రమ్ బ్రేక్ అందించారు. గ్లామర్ X 125లో డిజిటల్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఐడిల్-స్టార్ట్-స్టాప్ సిస్టమ్, USB ఛార్జింగ్ పోర్ట్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








