రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి దేవుడు ఇచ్చిన వరం.. 69 కి.మీ మైలేజ్, రూ.80-90 వేల ధర.. బెస్ట్ బైక్ ఏది?

హోండా SP 125 తన సెగ్మెంట్‌లో ఒక ఫ్లాగ్‌షిప్ బైక్‌గా మంచి గుర్తింపు పొందింది. అదే సమయంలో హీరో సూపర్ స్ప్లెండర్ XTEC కూడా దీనికి గట్టి పోటీ ఇస్తూ మార్కెట్లో నిలదొక్కుకుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్లు పరస్పరం పోటీపడటమే కాదు, పనితీరు, ఫీచర్లు, మైలేజ్ వంటి తమదైన ప్రత్యేకతను చూపిస్తున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ, వినియోగదారులకు ఉపయోగపడే డజన్ల కొద్దీ ఫీచర్లతో ఈ బైక్‌లు నిజంగా అద్భుతమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ, వినియోగదారులకు ఉపయోగపడే డజన్ల కొద్దీ ఫీచర్లతో ఈ బైక్‌లు నిజంగా అద్భుతమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ఈ కథణంలో ఈ రెండు బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.

ధర: హోండా SP 125 ధర రూ. 87,878 నుంచి రూ. 95,465 వరకు ఉండగా, హీరో సూపర్ స్ప్లెండర్ XTEC మాత్రం రూ. 83,448 నుంచి రూ. 87,044 (ఎక్స్-షోరూమ్) మధ్యలో లభిస్తుంది. అందువల్ల ధర పరంగా చూస్తే సూపర్ స్ప్లెండర్ XTEC కొంచెం తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుంది. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకునే వారికి ఇది ఒక ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

Honda Sp 125 And Super Splendor Xtec Commuter Bikes Price Design Engine And Features Comparision

డిజైన్: రెండు కూడా తమదైన స్టైల్‌తో ఆకట్టుకుంటాయి. హోండా SP 125లో స్లీక్ లుక్‌తో పాటు పూర్తి ఎల్ఈడీ లైటింగ్ సెట్‌ప్-హెడ్‌ల్యాంప్ నుంచి టెయిల్ ల్యాంప్ వరకు చాలా మోడర్న్ ఫీల్ ఇస్తుంది. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌తో ఇది రోడ్డు మీద స్పోర్టీగా కనిపిస్తుంది. అంతేకాదు, వెడల్పైన బాడీ, 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 1,285 మిమీ వీల్‌బేస్ వల్ల స్టెబిలిటీ కూడా బాగుంటుంది.

మరోవైపు హీరో సూపర్ స్ప్లెండర్ XTEC కూడా డిజైన్‌లో తగ్గేది లేదు. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ DRLs ఉండటం వలన ఫ్రంట్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. టెయిల్ ల్యాంప్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంకా 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వలన గుంతల రోడ్లపై కూడా కంఫర్ట్‌గా నడపవచ్చు. 1,267 మిమీ వీల్‌బేస్‌తో ఇది సిటీ రైడింగ్‌కు సరిగ్గా సరిపోయే బ్యాలెన్స్ ఇస్తుంది.

Honda Sp 125 And Super Splendor Xtec Commuter Bikes Price Design Engine And Features Comparision

పనితీరు: హీరో సూపర్ స్ప్లెండర్ XTECలో 124.7 సీసీ ఇంజన్ ఉండి, ఇదీ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సుమారు 69 కి.మీ వరకు మైలేజీ ఇవ్వడం వల్ల రోజువారీ వినియోగదారులకు ఆర్థికంగా ఉంటుంది. గరిష్ట వేగం 90 కి.మీ వరకు ఉన్నప్పటికీ, సిటీ రైడింగ్‌కు సరిపడే పవర్‌ను ఇస్తుంది. ఇదీ 0 నుంచి 60 కి.మీ వేగాన్ని కేవలం 7.5 సెకన్లలో చేరగలగడం వల్ల స్టార్ట్‌లో మంచి స్పందన ఇస్తుంది.

హోండా SP 125లో 123.94 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉండి, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కలిసి స్మూత్, రిఫైన్‌డ్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. నగర ప్రయాణాలకు చాలా సరళంగా స్పందిస్తూ, అవసరమైనప్పుడు మంచి పిక్‌అప్‌ను కూడా అందిస్తుంది. సుమారు 60-65 కి.మీ మైలేజీతో పాటు గంటకు 100 కి.మీ వరకు గరిష్ట వేగాన్ని చేరగలగడం దీని ప్రత్యేకత. అంతేకాదు, కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

Honda Sp 125 And Super Splendor Xtec Commuter Bikes Price Design Engine And Features Comparision

ఫీచర్స్: హీరో సూపర్ స్ప్లెండర్ XTEC ఫీచర్లలో మరింత టెక్ ఫోకస్ కనిపిస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ నగర ట్రాఫిక్‌లో ఇంధనం ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంజన్ కిల్ స్విచ్ వంటి ఫీచర్లు రైడర్‌కు మరింత సౌకర్యాన్ని ఇస్తాయి.

హోండా SP 125లో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండటం వల్ల స్పీడ్, మైలేజీ, ట్రిప్ వంటి సమాచారం క్లియర్‌గా కనిపిస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ ఫంక్షన్ వంటి సేఫ్టీ ఫీచర్ ఉండటం వల్ల బైక్ స్టార్ట్ చేసే సమయంలో అదనపు భద్రత లభిస్తుంది. సైలెంట్ స్టార్టర్ టెక్నాలజీ వల్ల బైక్‌ను ఆన్ చేసినప్పుడు శబ్దం తక్కువగా ఉండటం కూడా ఒక ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, March 20, 2026, 8:53 [IST]
English summary
Honda sp 125 and super splendor xtec commuter bikes price design engine and features comparision
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+