పెట్రోల్‌కు బదులుగా ఇవి వాడండి.. బెస్ట్ హైబ్రిడ్, CNG బైక్స్–స్కూటర్లు ఇవే! 330 కిలోమీటర్ల మైలేజ్
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కార్లు, బైకులను బయటకు తీసుకెళ్లాలన్నా ప్రజలు రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలపై వినియోగదారుల దృష్టి పడుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన టూవీలర్స్‌కు భారీ డిమాండ్ పెరుగుతోంది. ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్న ప్రజలు ఇప్పుడు ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే కారణంగా పలువురు తయారీ సంస్థలు కూడా హైబ్రిడ్, సీఎన్‌జీ ఆధారిత టూ-వీలర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇవి సాధారణ పెట్రోల్ వాహనాల కంటే మెరుగైన మైలేజ్ ఇవ్వడమే కాకుండా రోజువారీ ఇంధన వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్నాయి. కథనంలో హైబ్రిడ్, CNG పవర్‌ట్రెయిన్‌లతో వచ్చిన టూ-వీలర్ల గురించి తెలుసుకుందాం.
Yamaha Fascino 125 Fi Hybrid: ఇంధన ధరలు పెరుగుతున్న ఈ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్ల కోసం వెతుకుతున్న వారికి Yamaha తీసుకొచ్చిన హైబ్రిడ్ స్కూటర్లలో ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ బెస్ట్. దీనిలో 125cc బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అందించారు. సాధారణ పెట్రోల్ స్కూటర్‌లతో పోలిస్తే ఇందులో ఉపయోగించిన స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

స్కూటర్ స్టార్ట్ అయ్యే సమయంలో అదనపు పవర్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు బ్యాటరీని ఆటోమేటిక్‌గా ఛార్జ్ చేయడంలో ఇది సహాయపడుతుంది. దీంతో ఇంజిన్ పనితీరు స్మూత్‌గా ఉండటమే కాకుండా ఇంధన వినియోగం తగ్గుతుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.2 PS పవర్, 10.3 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోల్‌కు సుమారు 69 కి.మీ వరకు మైలేజ్ ఇవ్వగలదు. ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ధర రూ.74,910 నుంచి ప్రారంభమవుతోంది.
Yamaha FZ-S Fi Hybrid: ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.1.45 లక్షలుగా ఉంది. ఇందులో 149cc ఎయిర్ కూల్డ్ SOHC 2-వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 12.4 PS పవర్, 13.3 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీంతో బైక్‌కు మంచి పికప్ లభించడంతో పాటు హైవేపై కూడా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ బైక్ దాదాపు 60 కి.మీ వరకు మైలేజ్ అందించగలదు.

Yamaha Ray ZR 125 Fi Hybrid: యమహా రే జెడ్‌ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.76,235 నుంచి ఉంటుంది. ఇది ఫాసినో కంటే కొంచెం స్పోర్టీ డిజైన్ కోరుకునే వినియోగదారులకు రూపొందించబడింది. ఇందులో కూడా అదే 125cc బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్, SMG టెక్నాలజీను అందించారు. ఇది కూడా దాదాపుగా 60 కి.మీ వరకు మైలేజ్ అందించగలదు. స్పోర్టీ లుక్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్.
Bajaj Freedom 125 CNG: ఎక్స్ షోరూమ్ ధర రూ.91,566 నుంచి రూ.1.07 లక్షల వరకు ఉంది. ఈ బైక్‌లో 124.58 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్/CNG ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 9.5 PS పవర్, 9.7 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. పెట్రోల్ మోడ్‌లో సుమారు 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అదే సీఎన్‌జీ మోడ్‌లో దాదాపు 200 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు.

ఈ రెండు ఇంధన ట్యాంక్‌లను పూర్తిగా నింపిన తర్వాత మొత్తం సుమారు 330 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ముఖ్యంగా డెలివరీ ఉద్యోగులు, ఆఫీస్ వెళ్లేవారు, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. డిజైన్ పరంగా కూడా ఈ బైక్‌ను సాధారణ కమ్యూటర్ బైక్‌లా కాకుండా కొంచెం మోడ్రన్ లుక్‌తో రూపొందించారు. పొడవైన సీటు, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ వల్ల లాంగ్ రైడ్స్‌లో కూడా అలసట తక్కువగా ఉంటుంది.


Click it and Unblock the Notifications