ఇండియాలో దీన్ని మించిన బైకును చూపించలేరు.. ఒక్కసారి కొంటే 15 ఏళ్లు వాడొచ్చు, రోజూ 10,000 బైక్‌లు సేల్
భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ఎప్పటికీ అగ్రస్థానంలో నిలిచే పేరు అంటే అది హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus). సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఈ బైక్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలిచింది. తక్కువ ధర, మెరుగైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిపి స్ప్లెండర్ ప్లస్‌ను ఇంటింటి బైక్‌గా మార్చాయి. దశాబ్దాలుగా మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకున్న ఈ మోటార్‌సైకిల్‌పై వినియోగదారుల విశ్వాసం రోజురోజుకు మరింత బలపడుతోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2026 జనవరి నెలలో ఈ బైక్ ఏకంగా 3,10,802 యూనిట్లు అమ్ముడై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఇది సాధారణ సంఖ్య కాదు, దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ స్ప్లెండర్ ప్లస్‌కు ఉన్న భారీ డిమాండ్‌కు ఇది నిదర్శనం. ఇదే సమయంలో, 2025 జనవరిలో ఈ బైక్ 2,45,315 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. ఈ రెండు గణాంకాలను పోల్చి చూస్తే, కేవలం ఒక ఏడాదిలోనే అమ్మకాలు 21.1 శాతం పెరగడం విశేషం. ఈ స్థాయి వృద్ధి సాధించడం అంటే మార్కెట్‌లో బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో అర్థమవుతోంది.

ప్రస్తుత ఇంధన ధరల పరిస్థితుల్లో కూడా అధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లకు డిమాండ్ తగ్గలేదు. అందులోనూ స్ప్లెండర్ ప్లస్ తన స్థిరమైన పనితీరు, సులభమైన రైడింగ్ అనుభవం, విశ్వసనీయ ఇంజిన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నగరాల్లో ఆఫీస్‌కు వెళ్లేవారైనా, గ్రామాల్లో రోజువారీ పనుల కోసం వాహనం అవసరమయ్యేవారైనా అందరికీ ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది. కాలం మారినా, కొత్త మోడళ్లొచ్చినా, ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
2025 డిసెంబర్ నెలలోనే ఈ బైక్ 2,72,441 యూనిట్లు అమ్ముడై బలమైన ముగింపును నమోదు చేసింది. ముఖ్యంగా 2026 జనవరిలో ఈ బైక్‌కు వచ్చిన స్పందన మరింత ఆకట్టుకునేలా ఉంది. సగటున ప్రతి రోజూ దాదాపు 10,000 యూనిట్లు అమ్ముడవడం అంటే దేశవ్యాప్తంగా ఎంత పెద్ద డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ధర విషయానికి వస్తే, స్ప్లెండర్ ప్లస్ ఇంకా సరసమైన ధరల పరిధిలోనే అందుబాటులో ఉంది.

కనిష్టంగా రూ. 74,152 నుంచి గరిష్టంగా రూ. 76,437 (ఎక్స్-షోరూమ్) వరకు ధర ఉండటం వల్ల మధ్యతరగతి కుటుంబాలు సైతం సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారు. ఇది అవసరాలకు అనుగుణంగా నాలుగు వేరియంట్లలో డ్రమ్ బ్రేక్, i3S, స్పెషల్ ఎడిషన్, మిలియన్ ఎడిషన్‌లలో లభిస్తుంది . ప్రతి వేరియంట్‌లో కూడా విశ్వసనీయ ఇంజిన్ పనితీరు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి లక్షణాలు కొనసాగుతున్నాయి.
ఇందులో 97.2-సీసీ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 8 PS హార్స్‌పవర్, 8.05 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలకు, రోజువారీ ఆఫీస్ రైడ్‌లకు ఇది సరిపడే శక్తిని అందిస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రావడం వల్ల గేర్ మార్పులు సాఫీగా ఉంటాయి. ట్రాఫిక్‌లోనూ, ఓపెన్ రోడ్డుపైనూ రైడింగ్ అనుభవం సులభంగా ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, లీటర్‌కు సుమారు 70 కిలోమీటర్ల వరకు ఇస్తుంది.

ఫీచర్ల పరంగా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా అవసరమైన సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా i3S టెక్నాలజీ ఉండటం వల్ల ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. పనితీరు పరంగా గరిష్ట వేగం గంటకు 93 కి.మీ.ల వరకు ఉంటుంది. 0 నుండి 60 కి.మీ.ల వేగాన్ని కేవలం 9 సెకన్లలో అందుకోవడం ఈ సెగ్మెంట్‌లో మంచి ప్రతిస్పందనగా చెప్పాలి.


Click it and Unblock the Notifications








