సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తున్నారు.. కానీ ఒక చిన్న కండిషన్‌తో! జాబితాలో దేశంలోనే టాప్ మోడళ్లు
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే చాలా మందికి మొదట ఎదురయ్యే సమస్య అధిక ప్రారంభ ధర. ముఖ్యంగా బ్యాటరీ ఖర్చు ఎక్కువగా ఉండటంతో మొత్తం వాహనం ధర పెరిగిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన కొత్త విధానం BaaS. ఈ మోడల్‌లో స్కూటర్‌ను కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీకి కాకుండా వాహనానికి మాత్రమే డబ్బులు వసూలు చేసి, బ్యాటరీ అద్దె ప్రాతిపదికన ఇస్తారు. బ్యాటరీ వినియోగానికి మాత్రమే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ విధానంలో చెల్లింపు చేయాలి. దీంతో ప్రారంభ పెట్టుబడి భారీగా తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడంలో ఈ BaaS విధానం కీలక పాత్ర పోషిస్తోంది. సగం ధరకే వాహనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కథణంలో ఈ విధంగా అందుబాటులో ఉన్న స్కూటర్లను చూద్దాం.
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇప్పుడు కంపెనీ ప్రవేశపెట్టిన BaaS (Battery as a Service) పథకం కారణంగా ఇది మరింత అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త స్కీమ్ ద్వారా వినియోగదారులు స్కూటర్‌ను చాలా తక్కువ ప్రారంభ ధర అయిన సుమారు రూ.59,999కే కొనుగోలు చేయగలుగుతున్నారు. బ్యాటరీ ఖర్చు వేరుగా ఉండటంతో మొత్తం పెట్టుబడి గణనీయంగా తగ్గిపోతుంది.

సాధారణంగా ఈ స్కూటర్ స్టాండర్డ్ వేరియంట్ ధర సుమారు రూ.1.02 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కానీ BaaS ఆప్షన్‌తో ప్రారంభ ఖర్చు తగ్గిపోవడంతో ఎక్కువ మంది కస్టమర్లు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ఆకర్షితులవుతున్నారు. పనితీరు పరంగా చూసినట్లయితే, టాప్ వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 212 కి.మీ(IDC) వరకు రేంజ్‌ను అందిస్తుంది. దీనిలో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో వచ్చే TFT డిజిటల్ కన్సోల్, TVS SmartXonnect టెక్నాలజీ వంటివి ఉన్నాయి.
Vida VX2 Go: విడా వీఎక్స్2 గో మోడల్ ముఖ్యంగా BaaS (Battery as a Service) ప్లాన్‌తో మరింత అందుబాటులోకి వచ్చి వినియోగదారులను ఆకర్షిస్తోంది. సాధారణంగా ఈ స్కూటర్ ధర సుమారు రూ.76,740 ఉండగా, BaaS ఆప్షన్ ద్వారా కేవలం రూ.44,990 ప్రారంభ ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈ స్కూటర్‌లో ప్రత్యేకంగా తీసివేయగల (removable) బ్యాటరీ సిస్టమ్ ఉండటం ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.

వినియోగదారులు ఇంట్లోనే సులభంగా బ్యాటరీని ఛార్జ్ చేసుకునే సౌకర్యం పొందుతారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 92 కి.మీ IDC రేంజ్‌ను అందించగలదు. అలాగే ఇది గరిష్టంగా గంటకు 70 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఫీచర్ల విషయానికి వస్తే 33.2 లీటర్ల పెద్ద బూట్ స్పేస్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు, అలాగే LED లైటింగ్‌తో కూడిన పూర్తిగా డిజిటల్ డాష్‌బోర్డ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
TVS Orbiter V1: టీవీఎస్ ఆర్బిటర్ వీ1 భారత ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో విలువకు తగ్గ ఎంపికగా వేగంగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యంగా BaaS (Battery as a Service) మోడల్‌తో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. సాధారణంగా ఈ స్కూటర్ ధర సుమారు రూ. 84,500 నుండి ప్రారంభమవుతుండగా, BaaS ఆప్షన్ ద్వారా కేవలం రూ.49,999 ప్రారంభ ధరకే అందుబాటులోకి రావడం పెద్ద హైలైట్‌గా మారింది.

పనితీరు విషయానికి వస్తే, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారుగా 86 కి.మీ IDC రేంజ్‌ను అందిస్తుంది. ఫీచర్ల పరంగా TVS Orbiter V1 చాలా ప్రాక్టికల్, స్మార్ట్ సదుపాయాలతో నిండి ఉంది. ఇందులో LED హెడ్‌ల్యాంప్స్, ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్, TVS SmartXonnect టెక్నాలజీతో కూడిన LCD క్లస్టర్, యాంటీ-థెఫ్ట్ అలారం, హిల్ హోల్డ్ అసిస్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, 34 లీటర్ల భారీ స్టోరేజ్ కూడా లభిస్తుంది.


Click it and Unblock the Notifications