90 కి.మీ మైలేజ్ స్కూటర్ రూ.90 వేలకే రాక! మార్కెట్‌లో సునామీ సృష్టించిన ప్రస్తుత మోడల్
భారతదేశంలో విశ్వసనీయమైన కుటుంబ స్కూటర్‌గా గుర్తింపు పొందిన టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) మరోసారి తన సత్తాను చాటుకుంది. సాధారణంగా పట్టణాలు, చిన్న పట్టణాలు మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్కూటర్‌కు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జనవరి 2026లో నమోదైన అమ్మకాల గణాంకాలు చూస్తే, జూపిటర్‌కు మార్కెట్లో ఎంత బలమైన స్థానం ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గత నెలలో మొత్తం 1,29,744 యూనిట్లు వినియోగదారులకు పంపిణీ చేయడం గమనార్హం. ఇదే కాలంలో 2025 జనవరిలో 1,07,847 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సంవత్సరం వారీగా చూస్తే 16.89 శాతం వృద్ధి నమోదవడం కంపెనీకి పెద్ద ఊతంగా మారింది.
ఈ వృద్ధికి కారణాలు అనేకం ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది జూపిటర్ మైలేజ్. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. జూపిటర్ ఈ విషయంలో మంచి ఫలితాలను ఇస్తూ కుటుంబాల మొదటి ఎంపికగా నిలుస్తోంది. అదనంగా, తక్కువ నిర్వహణ ఖర్చులు కూడా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం, సౌకర్యవంతమైన సీటింగ్, విశాలమైన స్టోరేజ్ దీనిని డిమాండ్‌ను మరింత పెంచాయి.

సరసమైన ధరలో అందుబాటులో ఉండటం కూడా అమ్మకాల పెరుగుదలకు మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయే ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్కూటర్ కావాలనుకునే వారికి జూపిటర్ ఒక సరైన ఎంపికగా మారింది. అలాగే బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ఈ స్కూటర్, కొత్త వేరియంట్లు, మెరుగైన ఫీచర్లతో మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
TVS Jupiter ప్రస్తుతం రెండు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. జూపిటర్ 110, జూపిటర్ 125. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ రెండు మోడళ్లు డిజైన్ చేయబడ్డాయి. నగర ప్రయాణాలకు సరిపడే సాధారణ పనితీరు కావాలనుకునే వారికి జూపిటర్ 110 సరైన ఎంపిక అయితే, మరింత పవర్, వేగం కోరుకునే వారికి జూపిటర్ 125 మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

మొదటగా జూపిటర్ 110 గురించి మాట్లాడుకుంటే, దీని ధర రూ.77,000 నుండి రూ.89,600 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులో 113 సిసి పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఈ ఇంజిన్ 8.02 బిహెచ్‌పి హార్స్‌పవర్, 9.8 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ ప్రయాణాలకు తగినంత శక్తిని అందించే ఈ స్కూటర్, సుమారు 50 కి.మీ. వరకు మైలేజీ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 82 కి.మీ.ల వరకు చేరుకుంటుంది.
ఇక జూపిటర్ 125 విషయానికి వస్తే, ధర రూ.83,500 నుండి రూ.92,460 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. 124.8 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేసే ఈ స్కూటర్ 8.2 బిహెచ్‌పి హార్స్‌పవర్, 10.5 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ విషయంలో కూడా సుమారు 50 కి.మీ. వరకు అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 95 కి.మీ.ల వరకు ఉండటం దీన్ని హైవే ప్రయాణాలకు కూడా అనుకూలంగా మారుస్తోంది.

మరో విషయం ఏమిటంటే త్వరలో కంపెనీ జూపిటర్ CNG స్కూటర్‌ను విడుదల చేయనుంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ ఏప్రిల్ నెల నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ధర ఎక్స్-షోరూమ్ ధర రూ. 90,000 నుంచి రూ. 1 లక్ష మధ్య ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా CNG మోడ్‌లో ఈ స్కూటర్ సుమారు 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








