దేశంలో ఈ స్కూటర్ అంటే నచ్చని వారు ఎవరూ ఉండరు.. కోట్ల మంది ఫ్యాన్స్! అందుకే రికార్డ్ సేల్స్!
భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). ఈ పేరు వినగానే చాలా మందికి నమ్మకం, మైలేజ్ గుర్తుకు రావడం సహజం. కాలక్రమేణా యాక్టివా కేవలం ఒక వాహనం మాత్రమే కాకుండా, ప్రతి ఇంటి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఒకే రీతిలో ఆదరణ పొందుతూ, దేశంలోని నంబర్ వన్ స్కూటర్‌గా తన స్థానాన్ని దృఢంగా నిలబెట్టుకుంది. ఈ ప్రాచుర్యానికి తగినట్టుగానే యాక్టివా అమ్మకాలు కూడా నిరంతరం బలంగా కొనసాగుతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాలు చూస్తే, 2026 ఫిబ్రవరి నెలలో ఈ స్కూటర్ ఏకంగా 2,54,449 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఇది కేవలం ఒక నెలలో సాధించిన భారీ సంఖ్య మాత్రమే కాకుండా, మార్కెట్లో యాక్టివా డిమాండ్ ఎంతగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ వృద్ధి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 2025లో యాక్టివా 1,74,009 యూనిట్ల అమ్మకాలకే పరిమితమైంది. అయితే కేవలం ఏడాది వ్యవధిలోనే అమ్మకాలు భారీగా పెరిగి, ఈసారి దాదాపు 46 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

ఇది వినియోగదారులు ఇంకా యాక్టివాపైనే ఎక్కువగా నమ్మకం ఉంచుతున్నారని చెప్పడానికి మంచి ఉదాహరణ. ఈ విజయానికి ప్రధాన కారణం యాక్టివా అందించే విశ్వసనీయత, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అన్ని వయసుల వారికి అనుకూలమైన డిజైన్. అలాగే Honda Motorcycle and Scooter India కంపెనీ నిరంతరం మోడల్‌ను అప్‌డేట్ చేస్తూ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందించడం కూడా ఈ విజయానికి తోడ్పడుతోంది.
ప్రస్తుతం టీవీఎస్ జూపిటర్, హీరో డెస్టిని, సుజుకి యాక్సెస్ వంటి స్కూటర్లు యాక్టివా ధరకు సమానంగా లేదా కొంచెం తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అయినప్పటికి తీవ్ర పోటీని సైతం తట్టుకుని యాక్టివా 46 శాతం బలమైన వృద్ధి సాధించడం గొప్ప విషయం. యాక్టివా ఆధునిక ఫీచర్లతో, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుండటంతో కొత్త కొనుగోలుదారులు వాటివైపు ఆకర్షితులవుతున్నారు. రానున్న రోజుల్లో దీని అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

భారత స్కూటర్ మార్కెట్లో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన Honda Activa సిరీస్‌లో భాగమైన Honda Activa 110, Honda Activa 125 మోడళ్లు వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంతో ఆలోచించి రూపొందించబడ్డాయి. ముందుగా యాక్టివా 110 గురించి మాట్లాడితే, ఇది నిజంగా మధ్యతరగతి కుటుంబాల నమ్మకమైన సహచరంగా మారిపోయింది. ఇంట్లో మొదటి స్కూటర్‌గా చాలామంది ఎంపిక చేసుకునే మోడల్ ఇదే.
సాదాసీదా డిజైన్, సులభమైన రైడింగ్ అనుభవం, తక్కువ మెయింటెనెన్స్‌తో ఆకట్టుకుంటుంది . రూ. 75,433 నుంచి రూ. 89,806 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో లభించడం దీన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చింది. 109.51 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్ నగరంలో రోజువారీ ప్రయాణాలకు చక్కగా సరిపోతుంది. పైగా సుమారు 50 కి.మీ వరకు మైలేజీ ఇవ్వగలగడం వల్ల ఖర్చు పరంగా కూడా చాలా ఆర్థికంగా ఉంటుంది.

ఇక యాక్టివా 125 విషయానికి వస్తే, ఇది కొంచెం ప్రీమియం టచ్‌తో కూడిన స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. కాస్త ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి బాగా నచ్చుతుంది. రూ. 88,339 నుంచి రూ. 94,096 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో లభించే ఈ స్కూటర్ 123.92 సిసి ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ నగర ప్రయాణాల్లో స్మూత్‌గా పని చేయడమే కాకుండా, సుమారు 47 కి.మీ మైలేజీ కూడా అందిస్తుంది.
గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగంగా ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే, యాక్టివా 125లో ఆధునిక టెక్నాలజీకి పెద్దపీట వేశారు. TFT కన్సోల్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. అలాగే భద్రత పరంగా డిస్క్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా రైడర్‌కు మరింత విశ్వాసాన్ని కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications








