దేశంలో ఇంతకంటే మంచి స్కూటర్ చూపించలేరు! దీని గురించి చెడుగా చెప్పేవారు చాలా తక్కువ!
భారతదేశంలో స్కూటర్ మార్కెట్ గురించి మాట్లాడితే, ముందుగా గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). సంవత్సరాలుగా ఇది కేవలం ఒక వాహనం మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయ కుటుంబాల నమ్మకానికి ప్రతీకగా మారింది. సాధారణ ప్రయాణాల కోసం ఒక సౌకర్యవంతమైన, నమ్మదగిన, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన వాహనం కావాలంటే ఎక్కువ మంది ఎంచుకునేది యాక్టివానే. అందుకే ఇది పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా తన స్థానం సంపాదించుకుంది. స్కూటర్ మార్కెట్లో ఎన్నో కొత్త మోడళ్లు, ఆధునిక డిజైన్‌లు, కొత్త ఫీచర్లు వచ్చినప్పటికీ, యాక్టివా స్థిరమైన డిమాండ్‌ను కొనసాగించడం దాని బలాన్ని చూపిస్తుంది. ప్రతి నెలా లక్షల సంఖ్యలో అమ్మకాలు నమోదు కావడం దీని ప్రజాదరణకు స్పష్టమైన ఉదాహరణ.
భారతదేశంలో స్కూటర్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న హోండా యాక్టివా తాజాగా మరోసారి తన బలాన్ని నిరూపించింది. ఏప్రిల్ 2026 నెలలో ఈ స్కూటర్ 2,20,774 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, మార్కెట్‌లో తన స్థిరమైన డిమాండ్‌ను స్పష్టంగా చూపించింది. కేవలం 30 రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో అమ్మకాలు సాధించడం ఈ మోడల్‌పై ఉన్న వినియోగదారుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.

గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనిపించింది. 2025 ఏప్రిల్‌లో యాక్టివా 1,94,787 యూనిట్ల అమ్మకాలను సాధించగా, 2026 ఏప్రిల్‌లో అది 25,987 యూనిట్ల అదనపు అమ్మకాలను నమోదు చేసింది. ఈ పెరుగుదల కారణంగా సంవత్సర ప్రాతిపదికన 13.34 శాతం వృద్ధి నమోదైంది, ఇది స్కూటర్ విభాగంలో చాలా కీలకమైన పెరుగుదలగా భావించవచ్చు.
ఈ స్థిరమైన వృద్ధి యాక్టివా కేవలం ఒక స్కూటర్ మాత్రమే కాదని, భారత కుటుంబాల రోజువారీ జీవితంలో భాగమైపోయిందని మరోసారి రుజువు చేస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ ప్రయాణాలకు కావొచ్చు, గ్రామాల్లో సౌకర్యవంతమైన రవాణాకు కావొచ్చు, యాక్టివా ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు సరిపోయే ఎంపికగా నిలుస్తోంది. ఏప్రిల్ 2026 మొత్తం టూవీలర్ మార్కెట్‌లో కూడా యాక్టివా తన ప్రత్యేక స్థానం నిలుపుకుంది.

ఈ విభాగంలో రెండవ స్థానంలో నిలవడం, పోటీ ఎంతగా ఉన్నా కూడా తన స్థిరమైన మార్కెట్ వాటాను కొనసాగించగలిగిందని సూచిస్తోంది. కొత్త మోడళ్లు, ఆధునిక స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నా, యాక్టివా తన నమ్మకం, రీ-సేల్ విలువ, సులభమైన నిర్వహణతో వినియోగదారులలో ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది. యాక్టివా సాధించిన ఈ అమ్మకాల గణాంకాలు భారత స్కూటర్ మార్కెట్‌లో దాని స్థిరమైన ఆధిపత్యాన్ని మరోసారి బలంగా నిరూపిస్తున్నాయి.
ప్రస్తుంత యాక్టివా మార్కెట్లో రెండు ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. యాక్టివా 125, యాక్డివా 110 రెండు కూడా వినియోగదారులకు మంచి పనితీరును అందించడంలో ముందు ఉంటాయి. తమ అవసరాలకు అనుగుణంగా నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. 110 విషయానికి వస్తే, ఇది ఎక్కువ మంది కుటుంబాల మొదటి ఎంపికగా నిలిచింది. ధర రూ. 75,433 నుంచి రూ. 89,806(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

109.51 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో సుమారు 50 కి.మీ వరకు మైలేజీ ఇవ్వగలదు. యాక్టివా 125 గురించి చెప్పుకుంటే, 123.92 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీని ధర రూ. 88,339 నుంచి రూ. 94,096 (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 90 కి.మీ వరకు ఉండటం వల్ల హైవే ప్రయాణాల్లో కూడా నమ్మకంగా నడపవచ్చు. ఇది లీటరుకు సుమారు 47 కి.మీ వరకు మైలేజీ ఇవ్వగలదు.


Click it and Unblock the Notifications