పేదల ఇళ్లలో పెళ్లి కానుక నుంచి పాల వ్యాపారం దాకా..అన్నింటికీ ఇదే..వారి పాలిట కల్పవృక్షం ఈ బైక్

భారతదేశ ఆటోమొబైల్ చరిత్రలో కొన్ని వాహనాలు కేవలం యంత్రాలుగా మాత్రమే కాకుండా కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. హిందుస్తాన్ అంబాసిడర్, మారుతి 800, మారుతి ఓమ్ని వంటి కార్లు ఒకప్పుడు భారతీయ రోడ్లను ఏలాయి. అయితే టూ వీలర్ల విషయానికి వస్తే గత మూడు దశాబ్ధాలుగా ఒకే ఒక పేరు మార్మోగుతోంది. అదే హీరో స్ప్లెండర్(Hero Splendor).

ఈ బైక్ భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టి అప్పుడే 32 ఏళ్లు గడిచిపోయాయి. కాలం మారుతున్నా, కొత్త మోడల్స్ ఎన్నో వస్తున్నా స్ప్లెండర్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా విడుదలైన విక్రయాల గణాంకాలు చూస్తుంటే ఈ బైక్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేలా దూసుకుపోతుంది.

India s Most Trusted Bike Hero Splendor Sales Jump 46 in December 2025

మన దేశంలో టూ వీలర్ అంటే సగటు సామాన్యుడికి గుర్తొచ్చే మొదటి పేరు హీరో స్ప్లెండర్. 1994లో తొలిసారిగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బైక్ నేటికి 32 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఒక వెహికల్ మూడు దశాబ్ధాల పాటు మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగడం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదైన విషయం.

కానీ హీరో మోటోకార్ప్ తన స్ప్లెండర్ మోడల్ తో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. డిసెంబర్ 2025 సేల్స్ లెక్కలను పరిశీలిస్తే..హీరో స్ప్లెండర్ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

India s Most Trusted Bike Hero Splendor Sales Jump 46 in December 2025

తాజా రిపోర్టుల ప్రకారం 2025 డిసెంబర్ నెలలో మొత్తం 2,80,760 హీరో స్ప్లెండర్ బైక్స్ అమ్ముడయ్యాయి. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న పాపులర్ స్కూటర్ హోండా యాక్టివా కేవలం 1,81,604 యూనిట్లు మాత్రమే విక్రయించింది. అంటే యాక్టివా కంటే దాదాపు 99,156 బైక్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయి.

ఇది స్ప్లెండర్ బ్రాండ్ మీద ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనం. గతేడాది డిసెంబర్(2024)తో పోలిస్తే, ఈ ఏడాది విక్రయాల్లో ఏకంగా 45.90 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. 2024లో 1.92 లక్షల బైక్‌లు అమ్ముడవ్వగా, ఈసారి ఆ సంఖ్య 2.80 లక్షలకు చేరింది.

India s Most Trusted Bike Hero Splendor Sales Jump 46 in December 2025

స్ప్లెండర్ సక్సెస్‎కు ప్రధాన కారణం దాని మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు. భారతీయ ఫ్యామిలీలకు కావాల్సిన పొదుపును ఇది అందిస్తుంది. కాలక్రమేణా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా హీరో మోటోకార్ప్ ఈ బైక్‌లో అనేక మార్పులు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ వంటి వివిధ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.

కేవలం 100సీసీ సెగ్మెంట్లోనే కాకుండా 125సీసీ సెగ్మెంట్లోనూ సూపర్ స్ప్లెండర్ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఇందులోని i3S టెక్నాలజీ ఇంధనాన్ని ఆదా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. హీరో స్ప్లెండర్ కేవలం ఇండియాలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా అత్యధికంగా అమ్ముడవుతున్న టూవీలర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఒక స్వదేశీ కంపెనీ తయారు చేసిన వాహనం, అంతర్జాతీయ బ్రాండ్ల పోటీని తట్టుకుని అగ్రస్థానంలో నిలవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు ప్రతి గల్లీలోనూ ఈ బైక్ కనిపిస్తుంది. గతుకుల రోడ్ల మీద కూడా సాఫీగా ప్రయాణించే దీని సస్పెన్షన్, దశాబ్దాల పాటు మన్నికగా ఉండే ఇంజిన్ దీనిని సర్వకాలీన అద్భుతంగా మార్చాయి.

ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్, అత్యాధునిక ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి వస్తున్నా, స్ప్లెండర్ విక్రయాలు పెరుగుతుండటం గమనిస్తే.. భారతీయ వినియోగదారులు ఇప్పటికీ మన్నిక, నమ్మకానికి పెద్దపీట వేస్తున్నారని అర్థమవుతుంది. తక్కువ ధరలో గరిష్ట ప్రయోజనం అందించే ఈ బైక్ రాబోయే మరికొన్ని దశాబ్దాల పాటు భారతీయ రోడ్లను ఏలడం ఖాయమని ఆటోమొబైల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.నమ్మకమైన ప్రయాణం, జేబుకు చిల్లు పడని మైలేజ్ కావాలనుకునే ప్రతి ఒక్కరికీ స్ప్లెండర్ ఫస్ట్ ఆప్షన్‎గా నిలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, January 26, 2026, 7:30 [IST]
English summary
India s most trusted bike hero splendor sales jump 46 in december 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+