బైక్, స్కూటర్ కొనే ముందు ఇది చూడండి! నవంబర్ సేల్స్ రిపోర్ట్: హీరో, హోండా, ఈవీల్లో టాప్ ఎవరు?

నవంబర్ 25 నాటికి వాహన్ (VAHAN) పోర్టల్ సమకూర్చిన సమాచారం ప్రకారం టూ-వీలర్ మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 25 నుంచి 26 లక్షల బైకులు, స్కూటర్లు రిజిస్టర్ అయ్యాయి. ఇవి అధికారిక రిటైల్ విక్రయాల గణాంకాలు. ఇక మొత్తం అమ్మకాల్లో ఈ-టూవీలర్ల వాటా దాదాపు 6 శాతంగా ఉంది. నెలాఖరు దగ్గరపడుతుండటంతో డీలర్లు డెలివరీలను వేగవంతం చేస్తున్నారు. చివర్లో బల్క్ బిల్లింగ్‌లు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ సంఖ్యల్లో మార్పులు ఉండవచ్చు. ఇవి డీలర్ల వద్ద జరిగే రిటైల్ రిజిస్ట్రేషన్లు మాత్రమే, ఫ్యాక్టరీ డిస్పాచ్‌లు కావు.

మోడళ్ల విషయానికి వస్తే పోటీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓవరాల్ అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ టాప్‌లో ఉండగా, స్కూటర్ల విభాగంలో హోండా యాక్టివా హవా నడుస్తోంది. మోటార్‌సైకిళ్ల విభాగంలో బజాజ్ పల్సర్ సిరీస్ గట్టి పోటీ ఇస్తోంది. అక్టోబర్ రిటైల్ అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ మొదటి వారంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. అక్టోబర్ సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే... స్ప్లెండర్ 2,61,376 యూనిట్లు రిజిస్టర్ కాగా, యాక్టివా 2,44,671 యూనిట్లతో తరువాతి స్థానంలో నిలిచింది.

India Two-Wheeler Sales Report November 2026: Hero, Honda, and EV Market Trends

వాహన్ సేల్స్ (నవంబర్ 1–25): టాప్ బ్రాండ్లు, ఇవి వాటా వివరాలు

వాహన్ పోర్టల్ వివరాల ప్రకారం, ఈ నెల రిటైల్ రిజిస్ట్రేషన్లలో హోండా, హీరో బ్రాండ్లు మొదటి రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం సేల్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సింగిల్ డిజిట్‌లోనే కొనసాగుతోంది. ఇక ఈవి విభాగంలో టీవీఎస్, బజాజ్ కంపెనీలు ముందుంజలో ఉండగా, అథర్, హీరో, గ్రీవ్స్, ఓలా వాటి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది నవంబర్‌లో ఈవి వాటా 4.7 శాతంగా ఉండగా, ఈసారి అది స్వల్పంగా మెరుగైంది.

ఈవి టూ-వీలర్ బ్రాండ్ నవంబర్ 25 నాటికి సేల్స్ వాటా (MTD)
టీవీఎస్ మోటార్ 26.4%
బజాజ్ ఆటో 22.8%
అథర్ ఎనర్జీ 14.8%
హీరో మోటోకార్ప్ 12.7%
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ (యాంపియర్) 5.9%
ఓలా ఎలక్ట్రిక్ 4.1%

100–125cc వర్సెస్ ప్రీమియం: నెలాఖరు సేల్స్ ట్రెండ్ ఎలా ఉందంటే?

స్ప్లెండర్ వంటి 100–125 సీసీ కమ్యూటర్ బైక్‌ల అమ్మకాలు నెలాఖరులో ఒక్కసారిగా పుంజుకుంటాయి. ఫైనాన్స్ త్వరగా క్లియర్ కావడం, అన్ని కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉండటమే దీనికి కారణం. ఆర్టీవో స్లాట్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో యాక్టివా లాంటి స్కూటర్ల విక్రయాలు కూడా నెలాఖరులో పెరుగుతాయి. ఇక పల్సర్ మోడళ్లతో కూడిన 150–160 సీసీ ప్రీమియం బైక్‌ల బుకింగ్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. దీపావళి తర్వాత పల్సర్ వేరియంట్లలో వచ్చిన కొత్త ఫీచర్లు షోరూమ్ సేల్స్ పెరిగేలా చేశాయి.

ఈవి స్కూటర్ల ట్రెండ్: టీవీఎస్, బజాజ్, అథర్, హీరో, ఓలా పోటీ

ఈవి స్కూటర్ల విభాగంలో ఇప్పటివరకు టీవీఎస్ అగ్రస్థానంలో నిలవగా, బజాజ్ కొద్దిపాటి తేడాతో తర్వాతి స్థానంలో ఉంది. అథర్, హీరో బ్రాండ్లు దేశవ్యాప్తంగా రెండంకెల మార్కెట్ వాటాను నిలబెట్టుకున్నాయి. గ్రీవ్స్‌కు చెందిన యాంపియర్ టాప్ 5లోకి అడుగుపెట్టింది. నవంబర్ 18 నాటికి 6 శాతం మార్కెట్ వాటా సాధించినట్లు సదరు సంస్థ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రముఖ రీసెర్చ్ సంస్థల నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ కస్టమర్లకు అలర్ట్: డెలివరీ సమయం, కలర్ ఆప్షన్లు

హైదరాబాద్ డీలర్ల సమాచారం ప్రకారం.. మీరు ఎంచుకునే కలర్, వేరియంట్‌ను బట్టి యాక్టివా డెలివరీకి 3 నుంచి 6 వారాల సమయం పడుతోంది. స్ప్లెండర్ వెయిటింగ్ పీరియడ్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేర్వేరు షోరూమ్‌లలో వాకబు చేస్తే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధాన నగరాల్లో పల్సర్ 125 డెలివరీ కేవలం 2 నుంచి 4 రోజుల్లోనే పూర్తవుతోంది. అయితే బిల్లింగ్ చేసేముందు ఇన్సూరెన్స్ యాడ్-ఆన్స్ వివరాలను డీలర్లను అడిగి తెలుసుకోవడం మంచిది.

నవంబర్ 26–30 మధ్య ఏం జరగనుంది? డిసెంబర్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?

నెలాఖరులో డీలర్లు సేల్స్ టార్గెట్లు పూర్తి చేయడం, ఆర్టీవోల పనివేళలు పెంచడంతో రిజిస్ట్రేషన్లు వేగవంతం కానున్నాయి. పెండింగ్ ఫైళ్లు క్లియర్ అయితే ఈవి వాటా మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్ ఆఖరులో ధరల పెంపు ఉండే అవకాశం ఉన్నందున, స్ప్లెండర్ కొనాలనుకునే వారు ఈవారంలోనే బుక్ చేసుకోవడం శ్రేయస్కరం. షోరూమ్ నుంచి డెలివరీ తేదీ, కలర్ విషయంలో రాతపూర్వక హామీ తీసుకోవడం మర్చిపోవద్దు. నవంబర్ 30 వరకు మార్కెట్ అప్‌డేట్‌లను గమనిస్తూ ఉండండి.

Article Published On: Wednesday, November 25, 2026, 8:04 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+