150 నగరాలు.. 7,500 మంది రైడర్లు.. 24 ఏళ్ల వారసత్వానికి సెల్యూట్.. ఘనంగా జావా-యెజ్డీ డే
బైక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంతర్జాతీయ జావా-యెజ్డీ దినోత్సవం (International Jawa-Yezdi Day) ఈ ఏడాది తన 24వ ఎడిషన్‌ను ఘనంగా నిర్వహించింది. జూలై రెండో ఆదివారం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో భారతదేశం నలుమూలల నుంచి వేలాది మంది రైడర్లు పాల్గొని జావా, యెజ్డీ బ్రాండ్లపై తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఒకప్పుడు కొద్దిమందితో కలిసి ప్రారంభించిన చిన్న సమావేశంగా మొదలైన ఈ కార్యక్రమం, నేడు దేశాల సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రముఖ మోటార్‌సైక్లింగ్ సంప్రదాయంగా ఎదిగింది. ఈ ఏడాది నిర్వహించిన వేడుకల్లో భారతదేశంలోని 150కు పైగా నగరాల నుంచి 7,500 మందికి పైగా రైడర్లు పాల్గొనడం విశేషం.
ఒకప్పటి జావా, యెజ్డీ మోటార్‌సైకిళ్లతో పాటు లేటెస్ట్ జావా, యెజ్డీ బైక్‌లపై రైడర్లు భారీ ర్యాలీలు నిర్వహించి ఈ ప్రత్యేక రోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇది బైక్‌ల గురించే కాకుండా, రైడర్ల మధ్య స్నేహం, మోటార్‌సైక్లింగ్‌పై అభిరుచి, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న వారసత్వాన్ని గుర్తు చేసే వేడుక. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో 40కు పైగా జావా-యెజ్డీ రైడర్ క్లబ్‌లు, డీలర్‌షిప్‌లు, స్వతంత్ర రైడింగ్ కమ్యూనిటీలు కీలకంగా నిలిచాయి.

బెంగళూరులో నిర్వహించిన ఈ వేడుకల్లో బెంగళూరు జావా యెజ్డీ మోటార్‌సైకిల్ క్లబ్ (BJYMC) ఆధ్వర్యంలో 500కు పైగా జావా, యెజ్డీ మోటార్‌సైకిళ్లు ఒకే వేదికపై సందడి చేశాయి. వందలాది మంది రైడర్లు నగర వీధుల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ జావా-యెజ్డీ బ్రాండ్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాత తరం బైక్‌ల నుంచి అత్యాధునిక మోడళ్ల వరకు ఒకే ర్యాలీలో పాల్గొనడం అక్కడికి వచ్చిన మోటార్‌సైకిల్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ వేడుక భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా జరిగింది. భారత్‌తో పాటు 11 దేశాల్లోని జావా, యెజ్డీ అభిమానులు స్థానిక రైడ్లు, కమ్యూనిటీ మీట్‌లు, ప్రత్యేక కార్యక్రమాలు, డిజిటల్ ఈవెంట్ల ద్వారా ఈ రోజును ఘనంగా జరుపుకున్నారు. దశాబ్దాల క్రితం తయారైన వింటేజ్ జావా, యెజ్డీ మోటార్‌సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపై పరుగులు తీస్తుండగా, వాటి పక్కనే కొత్త జావా, యెజ్డీ మోడళ్లు కనిపించడం విశేషం.

పాత జ్ఞాపకాలు, కొత్త సాంకేతికత ఒకే వేదికపై కలవడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. మరో విశేషం ఏమిటంటే, ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జావా కమ్యూనిటీలు, భారతదేశంలోని వివిధ రైడింగ్ క్లబ్‌లు ఒకే గుర్తింపు కింద కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. అంతర్జాతీయ రైడింగ్ గ్రూపులు, భారతీయ కమ్యూనిటీలు పరస్పరం సహకరించడంతో వివిధ దేశాలు, ఖండాల్లో జరిగిన కార్యక్రమాలన్నీ ఒకే గ్లోబల్ ఉద్యమంలా కనిపించాయి.
దీంతో జావా-యెజ్డీ బ్రాండ్ కేవలం ఒక మోటార్‌సైకిల్ పేరే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రైడర్లను కలిపే బలమైన కమ్యూనిటీగా మరోసారి నిరూపితమైంది. ఈ సందర్భంగా క్లాసిక్ లెజెండ్స్ సహ-వ్యవస్థాపకుడు అనుపమ్ థరేజా మాట్లాడుతూ, 24 సంవత్సరాల క్రితం కొద్దిమంది రైడర్లతో ప్రారంభమైన ఇంటర్నేషనల్ జావా-యెజ్డీ డే నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గొప్ప మోటార్‌సైక్లింగ్ సంప్రదాయంగా ఎదిగిందన్నారు.

ఈ కార్యక్రమం పూర్తిగా రైడర్లదేనని, ప్రతి రైడ్, ప్రతి సమావేశం జావా-యెజ్డీ వారసత్వాన్ని మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు. ప్రతి ఏడాది మరింత విస్తరిస్తూ ముందుకు సాగుతున్న, ఈ మోటార్‌సైకిళ్ల ద్వారా ఏర్పడిన స్నేహాలు, కమ్యూనిటీలు, మధుర జ్ఞాపకాలను గౌరవించే ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications