కార్లలో ఉండే ఫీచర్లు ఇప్పుడు స్కూటర్‌లో.. ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు.. ADASతో స్టైలిష్ EV!
భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ గురించి మాట్లాడితే, స్కూటర్లకు ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాల కోసం స్కూటర్లు ఇప్పుడు లక్షలాది మంది జీవితాల్లో భాగమయ్యాయి. ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించగలగడం, తక్కువ నిర్వహణ ఖర్చులు, కుటుంబ వినియోగానికి అనువుగా ఉండటం వంటి కారణాలతో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ప్రజల ఆలోచనల్లో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ టూవీలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన తయారీ సంస్థలు కూడా వరుసగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.
ఇప్పటికే అనేక భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు EV మార్కెట్లో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో మరో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ చేరబోతోంది. ఆదిశ్వర్ ఆటో రైడ్ కంపెనీ ఆధ్వర్యంలో భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హంగేరియన్ ద్విచక్ర వాహన బ్రాండ్ కీవే (keeway), తొలిసారి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దీని గురించి ఇతర వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ఇప్పటివరకు కీవే బ్రాండ్ పేరు చెప్పగానే ఎక్కువ మందికి స్టైలిష్ పెట్రోల్ బైక్‌లు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తోంది. పెట్రోల్ వాహనాలకే పరిమితమైన తన శ్రేణిలోకి తొలిసారిగా ఒక ఈవీని తీసుకురావడం ద్వారా, భవిష్యత్ మొబిలిటీపై తమ దృష్టిని స్పష్టంగా తెలియజేస్తోంది. కీవే త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ EZI హైప్‌వోల్ట్ (Hypevolt) ఇప్పుడు ఆటో రంగంలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దీనిని V1, V2 అనే వేరియంట్లలో విడుదల చేయనుంది. V1 వేరియంట్‌లో హబ్-మౌంటెడ్ మోటార్‌ను ఉపయోగించగా, మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కోరుకునే వినియోగదారుల కోసం V2 వేరియంట్‌లో మిడ్-మౌంటెడ్ మోటార్‌ను అందించారు. ఒకే మోడల్‌లో రెండు వేర్వేరు డ్రైవ్ ఆర్కిటెక్చర్లను ఇవ్వడం EV మార్కెట్లో చాలా అరుదైన విషయం అని చెప్పొచ్చు. దీన్ని చైనా నుంచి CBU యూనిట్‌గా దిగుమతి అయ్యే అవకాశం ఉంది.

బడ్జెట్‌కు అనుగుణంగా రూపొందించిన V1 వేరియంట్‌లో 72V, 35Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది మొత్తం 2.52 kWh సామర్థ్యానికి సమానం. ఈ సెటప్‌తో EZI హైపర్‌వోల్ట్ V1 సుమారు 2,000 వాట్ల రేటెడ్ పవర్‌ను అందిస్తుంది. అలాగే ఇది 23 డిగ్రీల వరకు వాలును సులభంగా ఎక్కగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రేంజ్ పరంగా, ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే సుమారు 65 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్ కోరుకునే వినియోగదారుల కోసం V2 వేరియంట్‌ను రూపొందించారు. ఇందులో బ్యాటరీ సెటప్ మరింత బలంగా ఉండి సుమారు 5 kWh సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ వేరియంట్‌లో 6,000 వాట్ల రేటెడ్ అవుట్‌పుట్‌ను కంపెనీ అందిస్తోంది. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు 125 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించడం దీని ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఇది గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందించగలదు.

హైప్‌వోల్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లు, షార్ప్ బాడీ ప్యానెలింగ్, స్ప్లిట్ సీట్లు, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే 5-అంగుళాల TFT డిస్‌ప్లే, కీలెస్ స్టార్ట్, డిస్క్ బ్రేకులు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జింగ్, యాప్ కనెక్టివిటీ, రివర్స్ కెమెరా, నావిగేషన్, ADAS, డ్యూయల్ ABS, సీటు కింద పెద్ద స్టోరేజ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications