కేవలం 100 మందికే ఛాన్స్.. ఈ బైక్ కావాలంటే ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాలి

ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ KTM, తన చరిత్రలోనే అత్యంత పవర్ఫుల్, అత్యంత వేగవంతమైన మోటార్ సైకిల్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించింది. అదే 2026 KTM 1390 సూపర్ డ్యూక్ RR ట్రాక్. పేరులోనే ఉన్నట్లుగా, ఇది కేవలం రేస్ ట్రాక్‌ల కోసం మాత్రమే ప్రత్యేకంగా రూపొందించబడిన ట్రాక్-ఓన్లీ మోడల్. అంటే ఈ బైక్‌ను మీరు సాధారణ రోడ్ల మీద నడపలేరు. కానీ, రేస్ ట్రాక్ మీద మాత్రం ఇది తిరుగులేని రారాజుగా నిలుస్తుంది.

ఈ బైక్ అతిపెద్ద ప్రత్యేకత దాని లభ్యత. KTM సంస్థ ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లను మాత్రమే తయారు చేస్తోంది. మే 2026 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. పరిమిత సంఖ్యలో ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ కలెక్టర్లు, రేసింగ్ లవర్స్ దీని కోసం పోటీ పడుతున్నారు. దీని ధర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇందులో ఉపయోగించిన హార్డ్‌వేర్, దీని ఎక్స్‌క్లూజివిటీని బట్టి చూస్తే, ఇది భారీ ధరకే విక్రయించబడే అవకాశం ఉంది.

KTM Unveils 1390 Super Duke RR Track Only 100 Units 198 BHP Beast Built for Pure Racing

ఈ బైక్ గుండెకాయ వంటి ఇంజిన్ గురించి చెప్పుకుంటే.. ఇందులో 1350cc, 75-డిగ్రీ V-ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఇది అక్షరాలా 198 bhp గరిష్ట శక్తిని, 151 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. KTM ఇప్పటివరకు విడుదల చేసిన ఏ ప్రొడక్షన్ మోడల్‌లోనూ ఇంతటి పవర్ చూడలేదు. దీనికి తోడు Akrapovic ఎవల్యూషన్ లైన్ టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను జోడించారు. ఇది బైక్ పనితీరును పెంచడమే కాకుండా, బరువును గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

సాధారణ రోడ్-లీగల్ బైక్‌లతో పోలిస్తే, ఈ RR ట్రాక్ ఎడిషన్ చాలా తేలికైనది.ఇది స్టాండర్డ్ 1390 సూపర్ డ్యూక్ R కంటే 20 కేజీలు తక్కువ బరువు ఉంటుంది. రోడ్-లీగల్ RR వెర్షన్ కంటే 9 కేజీలు తక్కువ బరువు ఉంటుంది. ఈ బరువు తగ్గింపు కోసం కార్బన్ ఫైబర్ బాడీ వర్క్, ఫోర్జడ్ మెగ్నీషియం వీల్స్, టైటానియం స్క్రూలను ఉపయోగించారు. రోడ్డు మీద నడిపేందుకు అవసరమైన హెడ్ లైట్లు, ఇండికేటర్లు, మిర్రర్లు వంటి వస్తువులను తొలగించడం వల్ల కూడా బరువు తగ్గింది.

KTM Unveils 1390 Super Duke RR Track Only 100 Units 198 BHP Beast Built for Pure Racing

రేస్ ట్రాక్ మీద బైక్ కంట్రోలింగ్ అత్యంత ముఖ్యం. అందుకే ఇందులో MotoGPలో ఉపయోగించే WP ప్రో కాంపోనెంట్స్ సస్పెన్షన్‌ను వాడారు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, అల్ట్రా-ప్రీమియం బ్రెంబో (Brembo GP4 MS) మోనోబ్లాక్ ఫోర్-పిస్టన్ కాలిపర్లను అమర్చారు. వీటికి T-Drive ఫ్రంట్ బ్రేక్ డిస్క్‌లు జతచేశారు. అలాగే, సర్క్యూట్ మీద అత్యుత్తమ గ్రిప్ కోసం మిచెలిన్ పవర్ పెర్ఫార్మెన్స్ స్లిక్స్ టైర్లను అందించారు.

రేసర్లకు గరిష్ట సౌకర్యం అందించేలా దీని బాడీ డిజైన్ ఉంది. బైక్ ట్యాంక్ కొంచెం బయటికి వంగి ఉంటుంది, ఇది రైడర్ పూర్తిగా బైక్‌పై పడుకున్నప్పుడు మంచి సపోర్ట్ ఇస్తుంది. హ్యాండిల్ బార్ కొంచెం కిందకు ఉంటుంది, దీనివల్ల హై-స్పీడ్ వద్ద బైక్ కంట్రోల్ చేయడం సులభం అవుతుంది. కార్బన్ ఫైబర్ అండర్ ట్రేపై అమర్చిన సింగిల్ రేస్ సీటు ఈ బైక్ కు మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తుంది.

KTM Unveils 1390 Super Duke RR Track Only 100 Units 198 BHP Beast Built for Pure Racing

KTM 1390 సూపర్ డ్యూక్ RR ట్రాక్ అనేది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. FIM రేస్ ట్రాక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన ఈ బైక్, రేసింగ్ ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. భారతీయ సంపన్న రేసింగ్ లవర్స్ కూడా ఈ 100 యూనిట్లలో ఒక దానిని దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Article Published On: Thursday, April 23, 2026, 7:40 [IST]
English summary
Ktm unveils 1390 super duke rr track only 100 units 198 bhp beast built for pure racing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+