Flipkartలో రూ.55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అందరినీ ఆకర్షిస్తోంది! వెంటనే బుక్ చేసుకోండి!

పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితుల్లో, ప్రజలు ఇప్పుడు రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారుతున్నారు. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చు, సులభమైన మెయింటెనెన్స్, అలాగే భవిష్యత్ టెక్నాలజీ కావడంతో ఈవీ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో అనేక బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వాటిలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్న మోడల్ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ లెక్ట్రిక్స్‌కు చెందిన ఎన్ డ్యూరో (Lectrix NDuro Electric Scooter). లెక్ట్రిక్స్ కంపెనీకి చెందిన ఈ స్కూటర్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా బుకింగ్‌కు అందుబాటులో ఉంది.

వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ దీనిని రెండు రకాల ఆప్షన్లలో అందిస్తోంది. ఒకటి పూర్తి ఓనర్‌షిప్ మోడల్, మరొకటి BaaS (Battery as a Service) స్కీమ్. సాధారణంగా బ్యాటరీతో కలిపి కొనాలంటే ఈ స్కూటర్ ధర సుమారు రూ. 90,000 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటుంది. ఈ ఆప్షన్‌లో బ్యాటరీ పూర్తిగా కస్టమర్ సొంతమవుతుంది కాబట్టి నెలవారీ రెంటల్ ఖర్చు ఉండదు.

Lectrix Nduro Ev Scooter Price Range Flipkart Deal In India Details

దీన్ని ఎక్కువకాలం ఉపయోగించాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా చెప్పొచ్చు. అదే సమయంలో తక్కువ ప్రారంభ ఖర్చుతో స్కూటర్ కావాలనుకునే వారికి BaaS చాలా ఆకర్షణీయంగా మారుతోంది. ఈ ఆప్షన్‌లో స్కూటర్‌ను సుమారు రూ. 59,000 రేంజ్‌లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఛార్జర్ కూడా కలిపి వస్తుంది, కానీ బ్యాటరీ మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా ఉపయోగించుకోవాలి. అంటే బ్యాటరీని కొనాల్సిన అవసరం లేకుండా నెలవారీ రెంటల్ చెల్లించి ఉపయోగించుకోవచ్చు.

ఈ బ్యాటరీ రెంటల్ సిస్టమ్ వల్ల వినియోగదారులకు పెద్ద పెద్ద ఖర్చు తగ్గిపోతుంది. సాధారణంగా నెలకు సుమారు రూ. 1,199 నుండి ప్రారంభమయ్యే ప్లాన్‌లతో బ్యాటరీ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఒకేసారి భారీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా, సులభంగా ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారే అవకాశం కలుగుతుంది. అంతేకాదు, బ్యాటరీ మెయింటెనెన్స్, రీప్లేస్‌మెంట్ బాధ్యతలు కూడా తగ్గిపోవడంతో రోజువారీ ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారతాయి.

Lectrix Nduro Ev Scooter Price Range Flipkart Deal In India Details

మరో కీలక విషయం ఏమిటంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్కూటర్‌పై తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన కార్డులను ఉపయోగించడం ద్వారా ఈ స్కూటర్‌ను భారీ తగ్గింపుతో మీ సొంతం చేసుకోవచ్చు. అత్యధికంగా కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.4,750 తగ్గింపు ఉంది. ఇంకా HSBC, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై వరుసగా రూ.1500, 1750 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్ వినియోగించుకున్నట్లయితే స్కూటర్ రూ.55,100 కే లభిస్తుంది.

ఎన్ డ్యూరో స్కూటర్ ముందు భాగంలో పెద్ద రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంటుంది, ఇది దీనికి ఒక రేట్రో-మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది. సైడ్ ప్రొఫైల్‌ స్ప్లిట్ గ్రాబ్ రైల్స్‌తో పొడవైన సింగిల్-పీస్ సీటు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. అలాగే ఫ్లోర్‌బోర్డ్ రెండు వైపులా లెగ్ గార్డ్స్‌ను అందించడంతో రైడర్‌కు అదనపు సేఫ్టీతో పాటు కంఫర్ట్ కూడా లభిస్తుంది. విశాలమైన ఫ్లోర్‌బోర్డ్ డిజైన్ రోజువారీ ప్రయాణాల్లో మరింత సౌకర్యాన్ని కలిగిస్తుంది.

Lectrix Nduro Ev Scooter Price Range Flipkart Deal In India Details

పనితీరు విషయానికి వస్తే, ఇందులో హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగాన్ని అందించగలదని కంపెనీ చెబుతోంది. కేవలం 5.1 సెకన్లలో 0 నుండి 40 kmph వరకు వేగాన్ని చేరుకోవడం దీని స్పోర్టీ క్యారెక్టర్‌ను చూపిస్తుంది. బ్యాటరీ ఆప్షన్లలో 2.3 kWh బ్యాటరీ ప్యాక్, ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 90 కిలోమీటర్ల IDC రేంజ్‌ను అందిస్తుంది.

Article Published On: Thursday, May 21, 2026, 14:51 [IST]
English summary
Lectrix nduro ev scooter price range flipkart deal in india details
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+