రూ.60 పెట్రోల్‌తో 45 కి.మీ మైలేజ్, బైక్ ధర రూ.65 వేలు.. ట్యాంక్ నింపితే 825 కిలోమీటర్లకు పైగా వెళ్లొచ్చు
బజాజ్ ప్లాటినా 110 (bajaj platina 110) భారత ద్విచక్ర వాహన మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మోటార్‌సైకిల్‌గా నిలుస్తోంది. ఈ బైక్ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ముఖ్యంగా రోజువారీ ఆఫీసు ప్రయాణాలు, చిన్న వ్యాపార అవసరాలు, రోజంతా బైక్ మీదే ఆధారపడే వినియోగదారుల కోసం ప్లాటినా ఒక నమ్మకమైన భాగస్వామిగా మారింది. ఈ బైక్‌కు ఉన్న ప్రధాన బలం దాని తక్కువ నిర్వహణ ఖర్చులు. సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉండడంలోనూ ప్లాటినా వినియోగదారులకు ఎలాంటి భారాన్ని మోపదు. సాధారణంగా నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగా ఉండటం వల్ల, దీర్ఘకాలంలో ఈ బైక్‌ను ఉపయోగించడం చాలా లాభదాయకంగా మారుతుంది.
ఇదే కారణంగా మొదటిసారి బైక్ కొనుగోలు చేసే వారు, అలాగే ఖర్చులు నియంత్రణలో ఉంచాలనుకునే వారు ఈ మోడల్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న బజాజ్ ప్లాటినా 100 ధర కూడా బడ్జెట్ వినియోగదారులకు ఊరటనిచ్చే విధంగా ఉంది. ఈ మోడల్ రూ. 65,850 ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి రావడం వల్ల, తక్కువ ధరలో నమ్మకమైన ద్విచక్ర వాహనం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారింది.

పనితీరు విషయానికి వస్తే, బజాజ్ ప్లాటినా 100ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశాల్లో దాని శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఒకటి. ఈ బైక్‌లో 102 సిసి పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 7.9 పీఎస్ హార్స్‌పవర్‌తో పాటు 8.34 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మృదువైన పవర్ డెలివరీ ఈ ఇంజిన్ ప్రత్యేకత. ట్రాఫిక్‌లో నెమ్మదిగా సాగాల్సిన సందర్భాల్లోనూ, ఓపెన్ రోడ్లపై వేగం పెంచాలనుకున్నప్పుడు కూడా సాఫీగా స్పందిస్తుంది.
ఈ ఇంజిన్‌కు అనుసంధానంగా 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. దీని వల్ల ట్రాఫిక్‌లో గేర్ మార్పులు చాలా సులభంగా ఉండటమే కాకుండా, హైవే ప్రయాణాల్లో కూడా బైక్ స్థిరమైన పనితీరును చూపిస్తుంది. ఈ బైక్ లీటర్‌కు దాదాపుగా 90 కి.మీ.ల మైలేజ్ ఇవ్వగలదు. దీని పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు కావడంతో, ఒకసారి ట్యాంక్ పూర్తిగా నింపితే 825 కి.మీ.లకుపైగా ప్రయాణించగలదు. 10 రోజుల వరకు బంక్ వైపు చూడరు.

బజాజ్ ప్లాటినా 100 కేవలం 9 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడం ద్వారా రోజువారీ వినియోగానికి సరిపోయే మంచి యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర స్టార్ట్ అవ్వడంలో గానీ, రద్దీ రోడ్లలో ఓవర్‌టేక్ చేయాల్సిన సందర్భాల్లో గానీ ఈ స్పందన వినియోగదారులకు ఉపయోగపడుతుంది. అంటే ఇది కేవలం మైలేజ్‌కే పరిమితమైన బైక్ కాకుండా, అవసరమైన చోట సరైన పనితీరును కూడా ఇస్తుందన్న మాట.
ఫీచర్లు, డిజైన్ విషయానికి వస్తే, ప్లాటినా 100 వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సింపుల్ కానీ ఉపయోగకరమైన విధంగా రూపొందించబడింది. ఈ బైక్‌లో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇందులో వేగం, ఇంధన స్థాయి వంటి ముఖ్యమైన సమాచారం స్పష్టంగా కనిపించేలా అమర్చారు. డిజిటల్ గ్లామర్‌పై కాకుండా, నమ్మకమైన, సులభంగా చదవగలిగే డిస్‌ప్లేను ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చే అంశం.

రోజువారీ రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ బైక్‌లో ఎలక్ట్రిక్ స్టార్టర్ ఫీచర్‌ను కూడా అందించారు. ఉదయం ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు లేదా ట్రాఫిక్‌లో తరచూ స్టార్ట్-స్టాప్ పరిస్థితుల్లో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. దీని వల్ల రైడింగ్ అనుభవం మరింత ఈజీగా, స్ట్రెస్ లేకుండా మారుతుంది. ముందు స్టైలిష్ హెడ్‌ల్యాంప్, దానికి తోడుగా LED DRLలు, వెనుక భాగంలో ఆకట్టుకునే టెయిల్ లాంప్ బైక్‌ను స్టైలిష్ లుక్‌లో చూపిస్తాయి.


Click it and Unblock the Notifications








