దీనికోసమే దేశం మొత్తం ఎదురుచూసింది.. రూ.91 వేలకే లాంచ్.. ఈ స్కూటర్‌కు అంత ప్రత్యేకత ఎందుకు?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, తన ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుతూ కొత్తగా బజాజ్ చేతక్ సీ25 (bajaj chetak c25)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ స్కూటర్, సింపుల్‌గానూ ప్రాక్టికల్‌గానూ ఉండేలా రూపొందించబడింది. ముఖ్యంగా ఆఫీస్‌కు వెళ్లేవారు, కాలేజ్ విద్యార్థులు, చిన్న షాపింగ్ పనులు లేదా ఇంటి అవసరాల కోసం తేలికగా ఉపయోగించుకునేలా ఇది అనువుగా ఉంటుంది. చేతక్ C25 డిజైన్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్‌కు చెందిన ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే కొంచెం కాంపాక్ట్‌గా కనిపిస్తుంది. చిన్న సైజ్ ఉన్నప్పటికీ, బజాజ్ ప్రత్యేకతగా నిలిచే దృఢమైన మెటల్ బాడీని ఇందులో కూడా ఉపయోగించారు.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్లాస్టిక్ బాడీపై ఆధారపడుతుంటే, చేతక్ మాత్రం పూర్తిగా మెటల్ బాడీతో రావడం దీని బలమైన నిర్మాణానికి నిదర్శనం. ఇది స్కూటర్‌కు మంచి దృఢత్వంతో పాటు, దీర్ఘకాలిక ఉపయోగానికి భరోసాను ఇస్తుంది. ఈ స్కూటర్‌ను నడపడం చాలా సులభంగా ఉండేలా డిజైన్ చేశారు. తేలికైన బరువు, బ్యాలెన్స్ అయిన చాసిస్ వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగర రోడ్లపై కూడా సాఫీగా సాగుతుంది.

రోజూ ఆఫీస్‌కు, మార్కెట్‌కు వెళ్లే ప్రయాణాల్లో స్ట్రెస్ లేకుండా, హ్యాండిల్ చేయడం ఈ స్కూటర్‌లో చాలా ఈజీ. కొత్తగా స్కూటర్ నేర్చుకునే వారికి కూడా ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది. బజాజ్ చేతక్ C25 ధర విషయానికి వస్తే, ఈ స్కూటర్‌ను రూ. 91,399(ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్న మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది అందుబాటులో ఉండే ఆప్షన్‌గా బజాజ్ భావిస్తోంది.
ఈ స్కూటర్‌లో 2.5 kWh సామర్థ్యం గల బ్యాటరీని ఉపయోగించారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 113 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించడం దీని ప్రధాన ఆకర్షణ. నగరాల్లో ఆఫీస్, షాపింగ్, చిన్న చిన్న పనుల కోసం రోజూ తిరిగే వినియోగదారులకు ఇది చాలిపోతుంది. వేగం విషయానికి వస్తే, చేతక్ C25 గంటకు 55 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇది సురక్షితంగా ప్రయాణించడానికి సరైన వేగంగా చెప్పుకోవచ్చు.

చార్జింగ్ పరంగా కేవలం 2.25 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవడం వల్ల, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. రోజువారీ వినియోగంలో ఇది ప్రాక్టికల్ ఫీచర్. ఇంట్లో లేదా ఆఫీస్‌లో కొద్దిసేపు ప్లగ్ పెట్టినా సరిపడా ఛార్జ్ లభిస్తుంది. ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకుని బజాజ్ ఇందులో 25 లీటర్ల బూట్ స్పేస్ను అందించింది. ఇది రోజువారీ అవసరాలైన బ్యాగ్, కూరగాయలు, చిన్న సరుకులు తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది.
డిజైన్ విషయానికి వస్తే, చేతక్ C25 చాలా సొగసుగా, క్లాసిక్ టచ్‌తో కనిపిస్తుంది. ముందు రౌండ్ LED హెడ్‌లైట్ ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది. వెనుక హార్స్‌షూ ఆకారంలో ఉన్న ఐస్ క్యూబ్ LED టెయిల్ లైట్ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. వెనుక ఇచ్చిన అల్యూమినియం కాస్ట్ గ్రాబ్ హ్యాండిల్ పారామెట్రిక్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ గ్రాబ్ హ్యాండిల్‌పై స్పష్టంగా కనిపించే చేతక్ లోగో బ్రాండ్ ఐడెంటిటీని మరింత హైలైట్ చేస్తుంది.

ఈ స్కూటర్‌లో కలర్ LED స్పీడోమీటర్ను అందించడం మరో ముఖ్యమైన ఫీచర్. రైడర్‌కు అవసరమైన అన్ని సమాచారం స్పష్టంగా కనిపించేలా ఇది డిజైన్ చేయబడింది. సేఫ్టీ, కంఫర్ట్ విషయాల్లో కూడా బజాజ్ రాజీపడలేదు. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల రోడ్డు గుంటలు, స్పీడ్ బ్రేకర్లపై కూడా రైడ్ సాఫీగా ఉంటుంది. బ్రేకింగ్ కోసం ముందు చక్రానికి డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్ను అందించారు.


Click it and Unblock the Notifications








