తక్కువ ధరలో స్పోర్ట్స్ బైక్ ఫీల్.. ఈ ధరలో ఇలాంటి బైక్ దొరకడం కష్టమే! మరింత అడ్వాన్స్‌డ్‌గా అపాచీ
దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) మరోసారి తన అభిమానులను ఆకట్టుకునేలా ముందుకొచ్చింది. యువతలో ప్రత్యేక గుర్తింపు పొందిన టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి (TVS Apache RTR 160 4V) బైక్‌కు 2026 సంవత్సరానికి సంబంధించిన అప్‌డేట్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ కేవలం చిన్న మార్పులతో మాత్రమే కాకుండా, మరింత ప్రాక్టికల్‌గా, స్టైలిష్‌గా, అలాగే టెక్నాలజీ పరంగా ముందంజలో ఉండేలా తీర్చిదిద్దడం విశేషం. ఈసారి కంపెనీ రెండు కొత్త వేరియంట్‌లను కూడా పరిచయం చేసింది. దీంతో వినియోగదారులకు తమ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం మరింత విస్తరించింది.
ముఖ్యంగా గతంలో కేవలం టాప్-స్పెక్ మోడల్‌కే పరిమితమైన కొన్ని ఆధునిక ఫీచర్లను ఇప్పుడు కింది స్థాయి వేరియంట్‌లలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది మధ్యతరగతి వినియోగదారులకు నిజంగా పెద్ద ప్రయోజనం. డిజైన్ విషయానికి వస్తే, అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి ఇప్పటికే తన అగ్రెసివ్ లుక్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొత్త 2026 మోడల్‌లో ఆ స్టైలింగ్‌ను అలాగే కొనసాగిస్తూ, కొన్ని చిన్న అప్‌డేట్స్‌తో మరింత ప్రీమియం ఫీల్ ఇస్తుంది.

కొత్త ఫీచర్స్, పనితీరు ఈ బైక్‌కు తాజా లుక్‌ను తీసుకొచ్చాయి. రోడ్డు మీద చూసిన వెంటనే ఆకట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. నగరంలో రోజువారీ ప్రయాణాలకు గానీ, హైవేల్లో వేగంగా ప్రయాణించాలనుకునేవారికి గానీ ఈ బైక్ మంచి ఎంపికగా నిలుస్తుంది. పర్ఫార్మెన్స్ విషయంలో కూడా టీవీఎస్ ఎలాంటి రాజీ పడలేదు. ఇప్పుడు మరింత స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందించేలా మెరుగుపరిచారు.
కొత్తగా విడుదలైన TVS Apache RTR 160 4V 2026 మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వచ్చేసింది. రూ.1,25,440 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్, ఇప్పుడు మూడు వేరియంట్లలో లభించడం ద్వారా వినియోగదారులకు మరింత ఎంపికలను అందిస్తోంది. ధర, ఫీచర్లు, పనితీరు కలిపి ఈ సెగ్మెంట్‌లో ఇది మరింత బలమైన ఆప్షన్‌గా మారింది.

ఈసారి టీవీఎస్ ఈ బైక్‌లో చేసిన ముఖ్యమైన మార్పులు ఫీచర్ల పరంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కేవలం టాప్-స్పెక్ వేరియంట్‌కే పరిమితమైన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRLs (డేటైమ్ రన్నింగ్ లైట్లు), పూర్తి LED లైటింగ్ సెటప్ వంటి ఆధునిక ఫీచర్లు ఇప్పుడు మరిన్ని వేరియంట్‌లలో కూడా అందుబాటులోకి రావడం గమనార్హం. దీని వల్ల బేస్ లేదా మిడ్ వేరియంట్ తీసుకునే వారికి కూడా ప్రీమియం అనుభూతి లభిస్తుంది.
అదే సమయంలో, రైడింగ్‌ను మరింత సులభతరం చేసే అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌ను కూడా ఇప్పుడు మరిన్ని వేరియంట్‌లలో చేర్చడం జరిగింది. ఇది ముఖ్యంగా అధిక వేగంతో గేర్లు తగ్గించేటప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. క్లచ్ లీవర్ తేలికగా అనిపించడం వల్ల నగర ట్రాఫిక్‌లో గానీ, స్పోర్టీ రైడింగ్ సమయంలో గానీ రైడర్‌కు ఎక్కువ కంఫర్ట్ లభిస్తుంది. ఫలితంగా మొత్తం రైడ్ మరింత స్మూత్‌గా, నియంత్రణలో ఉండేలా అనిపిస్తుంది.

మెకానికల్‌గా పెద్ద మార్పులు చేయలేదు. అదే 159.7cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు. దీనిలో రైడ్ మోడ్‌లను అందించారు. స్పోర్ట్ మోడ్‌లో ఈ ఇంజిన్ 9,250 rpm వద్ద 17.6 hp శక్తిని, 7,500 rpm వద్ద 14.73 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక అర్బన్, రెయిన్ మోడ్‌లలో అవుట్‌పుట్ కొంచెం తగ్గి 8,650 rpm వద్ద 15.6 hp, 7,250 rpm వద్ద 14.1 Nm టార్క్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








