ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180కిమీ రేంజ్.. 15 రోజుల్లోనే 25,000 బుకింగ్స్.. ఒబెన్ రోర్ ఎవో సరికొత్త రికార్డ్
దేశలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు పెట్రోల్ ధరల భారాన్ని తట్టుకోలేక వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) ఆదరణ భారీగా పెరుగుతోంది.
దీనిని క్యాష్ చేసుకునేందుకు బెంగళూరుకు చెందిన ప్రముఖ ఇవి స్టార్టప్ కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) మార్కెట్లోకి తెచ్చిన సరికొత్త మోడల్ ఒబెన్ రోర్ ఎవో (Oben Rorr Evo) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 15 రోజుల్లోనే ఏకంగా 25,000 కు పైగా ఆర్డర్లను సాధించి టూ వీలర్ సెగ్మెంట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

భారతదేశంలో అత్యంత వేగంగా బుక్ అవుతున్న నంబర్ వన్ ఎలక్ట్రిక్ బైక్‌గా ఇది సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ జోరు చూస్తుంటే దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌ల విప్లవం త్వరలోనే రాబోతోందని స్పష్టమవుతోంది. వచ్చే నెల అంటే 2026 జూన్ నుంచే ఈ బైకుల డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం కంపెనీ తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో పేమెంట్ పోర్టల్‌ను కూడా లైవ్ చేసింది. బుక్ చేసుకున్న కస్టమర్లు తమ ఆర్డర్లను ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకులు అంటే బడ్జెట్ దాటిపోతాయని చాలామంది భయపడుతుంటారు. కానీ ఒబెన్ కంపెనీ సామాన్యులను దృష్టిలో ఉంచుకుని క్రేజీ ఆఫర్ ప్రకటించింది. మొదటి 10,000 మంది కస్టమర్లకు ఈ ఒబెన్ రోర్ ఎవో బైక్‌ను కేవలం రూ.99,999ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే అందిస్తోంది.

ఈ కోటా పూర్తయిన తర్వాత దీని సాధారణ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.24 లక్షలుగా మారనుంది. దాదాపు రూ.25 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుండటంతో కస్టమర్లు ఈ బైక్‌ను కొనేందుకు ఎగబడుతున్నారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను కంపెనీ తన అధునాతన ఏఆర్ఎక్స్ (ARX) ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేసింది.
ఇందులో సరికొత్తగా సొంతంగా డెవలప్ చేసిన 9kW I-PMSM మోటార్‌ను ఉపయోగించారు. ఇది వీల్‌కు ఏకంగా 250Nm అత్యధిక టార్క్‌ను అందిస్తుంది. దీనివల్ల బైక్‌కు అద్భుతమైన పికప్ లభిస్తుంది. కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందీ స్మార్ట్ బైక్. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 110 కిమీ ఉంది.

ఎలక్ట్రిక్ బైక్ కొనేవారికి అతిపెద్ద టెన్షన్ మైలేజ్ లేదా రేంజ్. ఆ విషయంలో ఈ రోర్ ఎవో బైక్ ఫుల్ మార్కులు కొట్టేసింది. ఇందులో 3.4kWh సామర్థ్యం గల ఎల్‌ఎఫ్‌పి (LFP) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 180 కిలోమీటర్ల ఐడీసీ (IDC) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
అయితే, రోడ్డు కండిషన్లు, సిటీ ట్రాఫిక్‌ను బట్టి సుమారు 150 కిలోమీటర్ల వరకు పక్కా ట్రూ రేంజ్ వస్తుందని ఒబెన్ ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది. ఆఫీసులకు వెళ్లేవారికి, రోజువారీ తిరిగేవారికి ఈ రేంజ్ చాలా ఎక్కువని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇవి వాహనాలలో బ్యాటరీల భద్రత అనేది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఒబెన్ ఉపయోగించిన ఎల్‌ఎఫ్‌పి (LFP) బ్యాటరీ టెక్నాలజీ అత్యంత సురక్షితమైనదిగా పేరుగాంచింది.

భారతీయ వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా ఏకంగా 280 డిగ్రీ సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఈ బ్యాటరీని టెస్ట్ చేశారు. అలాగే దీనికి నీరు, ధూళి నుంచి రక్షణ కల్పించే IP67 రేటింగ్‌ను కూడా ఇచ్చారు. కస్టమర్ల నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ ఈ బ్యాటరీపై కంపెనీ ఏకంగా 8 సంవత్సరాల వారంటీని ఇస్తుండటం విశేషం.
ఈ బైక్‌లో కస్టమర్లను ఆకట్టుకునే మరో పెద్ద హైలైట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. కేవలం 90 నిమిషాల్లోనే బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ అయిపోతుంది. ఇంట్లోని సాధారణ 15A సాకెట్ల సహాయంతో ఒబెన్ ప్లగ్ ద్వారా దీనిని సులభంగా చార్జ్ చేసుకోవచ్చు. ఒక నిమిషం చార్జ్ చేస్తే 1 కిలోమీటర్ ప్రయాణించేలా ఫీచర్‌ను కూడా అందించారు.
ఈ బైక్‌లో రైడింగ్ కోసం ఇకో (Eco), రోడ్ (Road), హావోక్ (Havoc), స్మార్ట్ ఐక్యు (SmartIQ) అనే నాలుగు మోడ్‌లను ఇచ్చారు. ఇందులో కంపెనీ ప్రైడ్ అయిన స్మార్ట్ ఐక్యు టెక్నాలజీ రైడర్ నడిపే విధానాన్ని బట్టి బ్యాటరీ రేంజ్‌ను మరో 15% అదనంగా పెంచుతుంది. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సిటీలో సేఫ్‌గా ఉండేందుకు ఇకో మోడ్ టాప్ స్పీడ్‌ను 60 కి.మీ.లుగా లాక్ చేశారు.
లుక్స్ పరంగా అదరహో.. అధునాతన స్మార్ట్ ఫీచర్లు!
చూడగానే ఎవరినైనా కట్టేసేలా మోడ్రన్ స్పోర్ట్స్ లుక్‌తో, ఎల్‌ఈడీ లైటింగ్, ప్రొజెక్టర్ హెడ్ లైట్, స్టైలిష్ డీఆర్‌ఎల్స్ (DRLs) దీనికి మరింత గ్రేస్ తెచ్చాయి. రైడర్ల సౌకర్యం కోసం సెగ్మెంట్‌లోనే అతిపెద్ద సీటును ఇచ్చారు. స్టోరేజ్ విషయానికి వస్తే సీటు కింద 6 లీటర్ల కంపార్ట్‌మెంట్, ట్యాంక్ ఏరియాలో రెండు యూఎస్‌బీ పోర్టులతో కూడిన 4 లీటర్ల స్పేస్.. మొత్తంగా 10 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీని ఇచ్చారు.
టెక్నాలజీ పరంగా ఈ బైక్ ఒక స్మార్ట్‌ఫోన్ లాంటిదే. ఇందులో లభించే ప్రధాన ఫీచర్లు:
5 ఇంచ్ టీఎఫ్‌టీ (TFT) కలర్ డిస్‌ప్లే,
ఓటీఏ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్,
టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్,
జియో-ఫెన్సింగ్ & రిమోట్ ఇమ్మొబిలైజేషన్,
యాక్సిడెంట్ అలర్ట్ (ఫాల్ డిటెక్షన్) & ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ (SOS),
ప్రస్తుతం దేశంలోని 18 రాష్ట్రాల్లోని 100కు పైగా నగరాల్లో 150 కంటే ఎక్కువ షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లతో ఒబెన్ నెట్‌వర్క్ విస్తరించి ఉంది. రాబోయే 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 200 కొత్త ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను ఓపెన్ చేయాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications