Ola Electric : ఓలా పాత కస్టమర్లకు పండగే.. ఏకంగా రూ.50,000 వరకు బంపర్ ఆఫర్లు

Ola Electric : భారతదేశపు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్, ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు స్టాక్ మార్కెట్‌లో షేరు ధర పతనం, మరోవైపు కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులతో కంపెనీ ఇమేజ్ కాస్త డీలా పడింది. ఈ నేపథ్యంలో, తన పాత కస్టమర్లను బుజ్జగించడానికి, కొత్త అమ్మకాలను పెంచుకోవడానికి ఓలా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే ఓలా ఇన్సైడర్స్ (Ola Insiders) కమ్యూనిటీ ప్రోగ్రామ్. పది లక్షల మందికి పైగా ఉన్న తన పాత కస్టమర్ల కోసం ఏకంగా రూ.50,000 వరకు ప్రయోజనాలను ప్రకటిస్తూ ఓలా మళ్ళీ రేసులోకి రావాలని చూస్తోంది.

ఓలా తీసుకొచ్చిన ఈ కొత్త ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం పాత వాహనాలను వాడుతున్న వారిని కొత్త టెక్నాలజీ వైపు మళ్లించడం. ఓలా మొదటి తరం (Gen 1), రెండో తరం (Gen 2) స్కూటర్లను వాడుతున్న కస్టమర్లు ఇప్పుడు తమ వాహనాలను లేటెస్ట్ జెన్ 3 S1 స్కూటర్లు లేదా ఓలా కొత్తగా తీసుకొచ్చిన రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇలా అప్‌గ్రేడ్ చేసుకునే వారికి రూ. 50,000 వరకు భారీ తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీనివల్ల పాత స్కూటర్ ఇచ్చేసి కొత్తది కొనేవారికి ధర చాలా తక్కువ పడుతుంది.

Ola Electric Announces Rs50 000 Bumper Offer for Existing Customers

ముఖ్యంగా ఓలా సొంతంగా తయారు చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీని ప్రమోట్ చేయడమే ఈ ఆఫర్ వెనుక ఉన్న అసలు రహస్యం. ఈ సరికొత్త బ్యాటరీ సెల్స్ వల్ల వాహనం రేంజ్ పెరగడమే కాకుండా ఛార్జింగ్ కూడా వేగంగా అవుతుంది. ఇప్పటికే ఒక ఓలా స్కూటర్ ఉన్న వ్యక్తి, తన ఇంట్లో మరొకరి కోసం లేదా రెండో వాహనంగా ఓలానే ఎంచుకుంటే అదనంగా రూ.20,000 క్యాష్‌బ్యాక్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. అంటే ఒకే కుటుంబంలో రెండు ఓలా వాహనాలు ఉంటే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి.

కేవలం కొనుగోలు మీద ఆఫర్లు మాత్రమే కాకుండా, రిఫరల్ స్కీమ్ ద్వారా కూడా ఓలా తన నెట్‌వర్క్‌ను పెంచుకోవాలని చూస్తోంది. మీరు ఒక ఓలా కస్టమర్ అయితే, మీ స్నేహితులకు లేదా బంధువులకు ఓలా స్కూటర్‌ను రిఫర్ చేస్తే, మీకు 5,000 ఓలా క్రెడిట్స్ లభిస్తాయి. అలాగే మీ రిఫరల్ ద్వారా స్కూటర్ కొనే కొత్త వ్యక్తికి ధరలో రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు MoveOS సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ప్రత్యేక వారంటీ ప్రయోజనాలను కూడా కంపెనీ ఇన్సైడర్ ప్రోగ్రామ్ కింద అందిస్తోంది.

Ola Electric Announces Rs50 000 Bumper Offer for Existing Customers

ప్రస్తుతం ఓలా మార్కెట్‌లో S1 ప్రో, S1 X వంటి రకరకాల మోడళ్లను విక్రయిస్తోంది. S1 X మోడల్ విషయానికి వస్తే ఇది 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ.82,999 నుంచి రూ.1,14,999 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. అలాగే రోడ్‌స్టర్ మోడళ్లు రూ.99,999 నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ మోడల్ రూ.1.89 లక్షల వరకు ఉన్నాయి. ఇంత పెద్ద రేంజ్ ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి కంపెనీలు ఓలా అమ్మకాలను అధిగమిస్తున్నాయి. ఆ కోల్పోయిన మార్కెట్ వాటాను మళ్ళీ దక్కించుకోవడమే ఓలా ప్రస్తుత వ్యూహం.

గతంలో ఓలా స్కూటర్ల సర్వీస్ గురించి కస్టమర్ల నుంచి కొన్ని నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఓలా ఫౌండర్ భవిష్య అగర్వాల్‌ను నెటిజన్లు ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానంగా, కంపెనీ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తామని ప్రామిస్ చేయడమే కాకుండా, ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లకు చేరువవాలని ప్రయత్నిస్తోంది. బ్యాటరీ మీద 8 ఏళ్ల వరకు వారంటీ ఇవ్వడం కూడా కస్టమర్లలో భరోసా నింపే ప్రయత్నమే. రాబోయే రోజుల్లో ఈ ఓలా ఇన్సైడర్స్ ప్రోగ్రామ్ కంపెనీ తలరాతను మారుస్తుందో లేదో చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 3, 2026, 10:03 [IST]
English summary
Ola electric announces rs50 000 bumper offer for existing customers
Read more on: #ola electric #discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+