పేదలపాలిటి పెన్నిది ఈ స్కూటర్..లక్ష బడ్జెట్లో ఏకంగా 110కిమీ రేంజ్..రోజు వారి పనులకు బెస్ట్ ఆప్షన్

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఓమేగా సెకి మొబిలిటీ (Omega Seiki Mobility) సామాన్యుడి బడ్జెట్‌లో అదిరిపోయే రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని పేరు వెక్‌స్ట్రా (Vextra). ఇప్పటి వరకు కమర్షియల్ వాహన రంగంలో తన ముద్ర వేసిన ఈ కంపెనీ, ఇప్పుడు ప్రయాణికుల కోసం అదిరిపోయే ఫీచర్లతో ఈ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఓమేగా సెకి మొబిలిటీ తన వెక్‌స్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.90,900 (ఎక్స్-షోరూమ్) ధరకే మార్కెట్లోకి విడుదల చేసింది. అంటే సరిగ్గా లక్ష రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ఒక ప్రీమియం ఈవీ అనుభవాన్ని అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రముఖ బ్రాండ్ల స్కూటర్ల కంటే ఇది చాలా తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం. రోజువారీ ఆఫీస్ పనులకు లేదా సిటీ లోపల ప్రయాణాలకు ఇది పక్కాగా సరిపోతుంది.

Omega Seiki Vextra Electric Scooter Launched at Rs 90 900 110KM Range 70kmph Top Speed Full Details

ఈ స్కూటర్‌లో అత్యంత శక్తివంతమైన 3.45kWh సామర్థ్యం గల IP67 రేటెడ్ LMO బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్ కావడంతో వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుపుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

ఇందులో 3kW BLDC మోటార్‌ను ఉపయోగించారు, ఇది ఎత్తు పల్లాల రోడ్లపై కూడా సునాయాసంగా వెళ్ళడానికి తగిన టార్క్‌ను అందిస్తుంది. చాలామంది ఎలక్ట్రిక్ వాహనం కొనాలంటే ఛార్జింగ్‌కు పట్టే సమయం గురించి భయపడతారు. కానీ వెక్‌స్ట్రా విషయంలో ఆ చింత అక్కర్లేదు. సాధారణ ఛార్జర్‌తో కేవలం 4 గంటల్లోనే బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు నింపవచ్చు.

పూర్తిగా 100 శాతం ఛార్జ్ అవ్వడానికి 5 గంటల సమయం పడుతుంది. రాత్రిపూట ఛార్జింగ్‌ పెట్టుకుంటే ఉదయానికల్లా మీ స్కూటర్ ప్రయాణానికి రెడీగా ఉంటుంది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. టెక్నాలజీ పరంగా వెక్‌స్ట్రా వెనుకబడలేదు. ఇందులో 3.5 ఇంచుల కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది బ్యాటరీ ఛార్జ్ ఎంత ఉంది, ఇంకా ఎంత దూరం వెళ్ళవచ్చు వంటి సమాచారాన్ని క్లియర్ గా చూపిస్తుంది.

Omega Seiki Vextra Electric Scooter Launched at Rs 90 900 110KM Range 70kmph Top Speed Full Details

ఇందులో ఎకో (Eco), సిటీ (City), స్పోర్ట్ (Sport) అనే మూడు రైడ్ మోడ్లు ఉన్నాయి. పార్కింగ్ సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు రివర్స్ పార్క్ అసిస్ట్ ఫీచర్ ఇచ్చారు. జీఎస్‌ఎమ్ (GSM) కనెక్టివిటీ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకునే వీలుంది.

ఓమేగా సెకి కంపెనీ ఈ స్కూటర్లను హర్యానాలోని ఫరీదాబాద్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీలో ఏడాదికి 25,000 వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈ మేక్ ఇన్ ఇండియా స్కూటర్లను కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. పెట్రోల్ స్కూటర్లకు సరైన ప్రత్యామ్నాయంగా వెక్‌స్ట్రా నిలుస్తుందని కంపెనీ యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.

మీరు తక్కువ ధరలో మంచి రేంజ్ ఇచ్చే స్కూటర్ కోసం చూస్తుంటే వెక్‌స్ట్రా బెస్ట్ ఛాయిస్. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుంటూ, అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ఇది అద్భుతమైన వాహనం. డిజైన్ పరంగా కూడా ఇది చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 6, 2026, 16:49 [IST]
English summary
Omega seiki vextra electric scooter launched at rs 90 900 110km range 70kmph top speed full detail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+