ఒక్క చుక్క పెట్రోల్ లేకుండా 90కిమీ మైలేజ్..పేద కుటుంబాల నమ్మకమైన నేస్తం ఈ స్కూటర్

తమిళనాడుకు చెందిన ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్(TVS Motors) ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఒక సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే భారత మార్కెట్లో తన జూపిటర్ (TVS Jupiter) స్కూటర్‌తో రికార్డు స్థాయి అమ్మకాలను సాధిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉండడం కోసం సరికొత్త సీఎన్జీ(CNG) స్కూటర్‌ను రంగంలోకి దింపబోతుంది. లీటర్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో కిలో సీఎన్జీతో 90కిలోమీటర్ల మైలేజీ ఇచ్చేలా ఈ స్కూటర్ తయారు కావడం విశేషం.

సాధారణంగా ఏడాది చివరలో వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. కంపెనీలు భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ఉండడంతో చాలా మంది కొత్త వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. గత 2025 డిసెంబర్ నెలలో కూడా భారత ఆటోమొబైల్ రంగంలో అదిరిపోయే అమ్మకాలు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యంగా మన దేశీ కంపెనీ అయిన టీవీఎస్ తన జూపిటర్ స్కూటర్‌తో అమ్మకాల్లో కొత్త శిఖరాలను తాకింది.

Petrol Prices Get a Shock TVS to Launch World s First CNG Scooter with 90 Km kg Mileage

ఒక్క డిసెంబర్ నెలలోనే ఏకంగా 1,20,477 యూనిట్ల జూపిటర్ స్కూటర్లను టీవీఎస్ కంపెనీ విక్రయించింది. 2024 డిసెంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే ఇది సుమారు 36 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న మొదటి పది టూ వీలర్ల జాబితాలో జూపిటర్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

ప్రస్తుతం మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 110 సీసీ, 125 సీసీ వేరియంట్లలో లభిస్తోంది. హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్ వంటి దిగ్గజ స్కూటర్లకు జూపిటర్ గట్టి పోటీనిస్తోంది. అత్యుత్తమ భద్రతా ఫీచర్లైన ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, టర్న్ సిగ్నల్ రీసెట్ వంటి ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా టీవీఎస్ జూపిటర్‌లోనే పరిచయం చేశారు.

అంతేకాకుండా వాయిస్ అసిస్ట్, నేవిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుత పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.73,400 నుంచి రూ.76,200 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

Petrol Prices Get a Shock TVS to Launch World s First CNG Scooter with 90 Km kg Mileage

అయితే ఇప్పుడు అసలు వార్త ఏమిటంటే.. టీవీఎస్ సంస్థ రాబోయే కొద్ది నెలల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. బజాజ్ ఇప్పటికే సీఎన్‌జీ బైక్‌ను తెచ్చి సక్సెస్ అవ్వగా, స్కూటర్ విభాగంలో టీవీఎస్ ఈ సాహసాన్ని చేస్తోంది. ఈ స్కూటర్ కేజీ సీఎన్‌జీకి 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని అంచనా.

అంటే పెట్రోల్‌తో పోలిస్తే ఇంధన ఖర్చు సగానికి పైగా తగ్గుతుంది. ప్రతిరోజూ ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే సామాన్యులకు ఇది ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ధర విషయానికి వస్తే, టీవీఎస్ ఈ స్కూటర్‌ను చాలా పోటీ ధరలో అంటే సుమారు రూ. 90,000 లోపు మాత్రమే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

పర్యావరణ హితంగా ఉండటమే కాకుండా, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో కూడిన ఈ స్కూటర్ ఖచ్చితంగా మార్కెట్ రూపురేఖలను మార్చేయబోతోంది. పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సగటు మధ్యతరగతి మనిషికి టీవీఎస్ సీఎన్జీ స్కూటర్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది. తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ సంస్థ నుంచి ప్రపంచంలోనే తొలి సీఎన్జీ స్కూటర్ రావడం నిజంగా గర్వించదగ్గ విషయం.

More from DriveSpark

Article Published On: Saturday, January 24, 2026, 11:29 [IST]
English summary
Petrol prices get a shock tvs to launch world s first cng scooter with 90 km kg mileage
Read more on: #tvs motor #cng #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+